10, జూన్ 2020, బుధవారం

Sundarakanda సుందరకాండ 23



రామసుందరం
త్రయోవింశస్సర్గః
త్యుక్త్వా మైథిలీం రాజా రావణ శ్శత్రురావణః ।
సందిశ్య చ తత స్సర్వా రాక్షసీ ర్నిర్జగామ హ ॥ 1
పగవారికి రావణుడైన, రావణుడు, సీతతో, ఇలా చెప్పి, రాక్షసస్త్రీల కందఱికీ, ఆజ్ఞ చేసి, వెళ్లిపోయాడు.
నిష్క్రాంతే రాక్షసేంద్రే తు పున రంతఃపురం గతే ।
రాక్షస్యో భీమరూపా స్తా స్సీతాం సమభిదుద్రువుః ॥ 2
రావణుడు వెళ్ళి, అంతఃపురం చేరగానే, భయంకరూపులైన ఆ రాక్షసకాంతలు, సీదగ్గరకు పఱుగెత్తి, చుట్టుముట్టారు.
తత స్సీతా ముపాగమ్య రాక్షస్యః క్రోధమూర్ఛితాః
పరం పరుషయా వాచా వైదేహీ మిద మబ్రువన్‌ ॥ 3
అంత, ఆ రాక్షసస్త్రీలు, కోపంతో, ఒళ్లు తెలియక, సీత దగ్గరకు పోయి, మిక్కిలి పరుషమైన మాటలతో, ఇలా అన్నారు.
పౌలస్త్యస్య వరిష్ఠస్య రావణస్య మహాత్మనః ।
దశగ్రీవస్య భార్యాత్వం సీతే న బహుమన్యసే ॥ 4
“రావణుఁడు, పులస్త్యప్రజాపతివంశంలో పుట్టినవాడు. వరిష్ఠుడు, మహాత్ముడు, పది కంఠాలు కలవాడు. అట్టి రావణునికి, భార్యగా ఉండడం, నీ కెచ్చుగా తోచలేదా ఏం?" .
తత స్త్వేకజటా నామ రాక్షసీ వాక్య మబ్రవీత్‌ ।
ఆమంత్ర్య క్రోధతామ్రాక్షీ సీతాం కరతలోదరీమ్‌ ॥ 5
ప్పుడు, ఏకఅనే ఒక రాక్షసి, కోపంతో ఎఱ్ఱనైన కండ్లతో, కరతలోదరం కల్గిన సీతను పిలిచి, ఇలా అంది.
ప్రజాపతీనాం షణ్ణాం తు చతుర్థో యః ప్రజాపతిః ।
మానసో బ్రహ్మణః పుత్త్రః పులస్త్య ఇతి విశ్రుతః ॥ 6
మరీచి మొదలయిన ప్రజాపతులు ఆర్వురిలో, నాల్గవవాడు, పులస్త్యుడు’, అని పేరు పొందినవాడు. అతఁడు బ్రహ్మ మానసపుత్త్రుడు.
పులస్త్యస్య తు తేజస్వీ మహర్షి ర్మానస స్సుతః ।
నామ్నా స విశ్రవా నామ ప్రజాపతిసమప్రభః ॥ 7
పులస్త్యుని మానసపుత్త్రుడొక మహర్షి ఉన్నాడు. అతని పేరు విశ్రవసుఁడు. అడు మహాప్రభావుడు, ప్రజాపతిసమప్రభుడు.
తస్య పుత్త్రో విశాలాక్షి రావణ శ్శత్రురావణః ।
తస్య త్వం రాక్షసేంద్రస్య భార్యా భవితు మర్హసి ।
మయోక్తం చారుసర్వాంగి వాక్యం కిం నానుమన్యసే ॥ 8
విశాలాక్షీ!, విశ్రవసుని పుత్త్రుడే, శత్రురావణుడైన,రావణుఁడు. అలాంటి వంశంలో పుట్టి, రాక్షసులకు రాజైన, రావణునకు, నీవు, భార్యవు, కా. సర్వాంగసుందరీ! నేను చెప్పేమాటను ఎందుకు అంగీకరించటం లేదు?”.
తతో హరిజటా నామ రాక్షసీ వాక్య మబ్రవీత్‌ ।
వివర్త్య నయనే కోపా న్మార్జారసదృశేక్షణా ॥ 9
ప్పుడు, పిల్లివంటి కండ్లు , హరిజట అనే రక్కసి, కోపంతో, గ్రుడ్లు గిరగిర త్రిప్పుతూ, సీతను చూసి, ఇలా అంది.
యేన దేవా స్త్ర స్త్రింశ ద్దేవరాజశ్చ నిర్జితాః ।
తస్య త్వం రాక్షసేంద్రస్య భార్యా భవితు మర్హసి ॥ 10
ముప్పదిమూఁడుకోట్ల దేవతల్ని, దేవేంద్రుని జయించినట్టి, రాక్షసేంద్రుని భార్యవు కా. అది నీకు తగినది
తతస్తు ప్రఘసా నామ రాక్షసీ క్రోధమూర్ఛితా ।
ర్త్సయంతీ తదా ఘోర మిదం వచన మబ్రవీత్‌ ॥ 11
అంత, ప్రఘస అనే రాక్షసి, కోపావేశంతో, సీతను చూసి, బెదరిస్తూ, ఘోరంగా, ఇలా అంది.
వీర్యోత్సిక్తస్య శూరస్య సంగ్రామే ష్వనివర్తినః ।
బలినో వీర్యయుక్తస్య భార్యాత్వం కిం న లప్స్యసే ॥ 12
“ఓ సీతా! వీర్యంతో విఱ్ఱవీగుతూ, శూరుఁడై, యుద్ధాల్లో, వెనుదీయక, బలం, పరాక్రమం , రావణునకు, భార్య కావడానికి, ఎందుకు ఒప్పుకోవు?
ప్రియాం బహుమతాం భార్యాం త్యక్త్వా రాజా మహాబలః ।
సర్వాసాం చ మహాభాగాం త్వా ముపైష్యతి రావణః ॥ 13
మహాబలుడైన రావణుఁడు, తన భార్య లందఱిలో, మిక్కిలి ప్రియురాలై, పేరెన్నిక న్న మహాభాగ, మందోదరిని కూడా విడిచి, నిన్నే, పొంది, ఉండఁగలఁడు.
సమృద్ధం స్త్రీసహస్రేణ నానారత్నోపశోభితమ్‌ ।
అంతఃపురం సముత్సృజ్య త్వా ముపైష్యతి రావణః ॥ 14
వేవురు స్త్రీలతో నిండారి, నానారత్నాలంకృతమై ఉండే, అంతఃపురాన్ని కూడా దిగవిడిచి, రావణుఁడు, నిన్నే పొంది ఉండఁగలఁడు’'
అన్యా తు వికటా నామ రాక్షసీ వాక్య మబ్రవీత్‌ ।
అసకృ ద్దేవతాయుద్ధే నాగగంధర్వదానవాః ।
నిర్జితా స్సమరే యేన సతే పార్శ్వ ముపాగతః ॥ 15
తస్య సర్వసమృద్ధస్య రావణస్య మహాత్మనః ।
కి మద్య రాక్షసేంద్రస్య భార్యాత్వం నేచ్ఛసేధమే ॥ 16

వికట అనే మఱొక్క రాక్షసి, సీతను చూసి, ఇలా అంది. “మాటికిమాటికి యుద్ధంలో దేవతలు, పన్నగులు, గంధర్వులు, దానవులు, ఎవనిచేతిలో, ఓడారో,ట్టి రావణుడు, కోరి, నీ సరసన చేరాడు. అధమురాలా!, సర్వసమృద్ధులు కల్గిన, మహాత్ముడు, రాక్షసేంద్రుడు, ఆ రావణుని భార్య కావటానికి, నీవు, ఎందుకు ఇష్టపడటం లేదు?”  
తతస్తు దుర్ముఖీ నామ రాక్షసీ వాక్య మబ్రవీత్‌ ।
యస్య సూర్యో న తపతి భీతో యస్య చ మారుతః ।
న వాతి స్మాయతాపాంగే కిం త్వం తస్య న తిష్ఠసి ॥ 17
పిమ్మట, దుర్ముఖి అనే రాక్షస స్త్రీ, ఇలా అంది. “నిడువాలుగడన్నులు దానా!, ఎవనికి, భయపడి, సూర్యుడు, ఎండను కాయడో,  వాయువు, వీడో, అట్టి రావణుని అధీనంలో ఉండటానికి, నీవు, ఎందుకు కోరవు?
పుష్పవృష్టిం చ తరవో ముముచు ర్యస్య వై భయాత్‌ ।
శైలాశ్చ సుభ్రు పానీయం జలదాశ్చ యదేచ్ఛతి ॥ 18
తస్య నైరృతరాజస్య రాజరాజస్య భామిని ।
కిం త్వంన కురుషే బుద్ధిం భార్యార్థే రావణస్య హి ॥ 19
సాధు తే తత్త్వతో దేవి కథితం సాధు భామిని ।
గృహాణ సుస్మితే వాక్య మన్యథా న భవిష్యసి ॥ 20
ఓ సుభ్రూ!, ఎవనికి భయపడి, కోరినప్పుడు మాత్రమే, వృక్షాలు, పువ్వులవానను, కొండలు, మేఘాలు, జలాన్ని, కురిపిస్తాయో, అట్టి రాక్షసరారాజు, రావణుని భార్య కావటానికి, నీవు, ఎందుకు ఇష్టపడటం లేదు? దేవీ!, నీకు, యథార్థమైన సంగతిని, చక్కగా చెప్పాం. భామినీ! మా మాట విని, ఆ ప్రకారం ప్రవర్తించు. సుస్మితా! లేకపోతే, ప్రాణాలతో ఉండలేవు.

-----------------------------------------------------------------------------------------------
శ్రీరామ రామ రఘునన్దన రామ రామ,  శ్రీరామ రామ భారతాగ్రజ రామ రామ |
శ్రీరామ రామ రణకర్కశ రామ రామ,  శ్రీరామ రామ శరణం భవ రామ రామ ||28||
ఇత్యార్షే శ్రీమద్వాల్మీకిరామాయణే ఆదికావ్యే సుందరకాండే త్రయోవింశస్సర్గః (23)
మంగళం మహత్



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

SUNDARAKANDA సుందరకాండ 36

  రామసుందరం - షట్త్రింశస్సర్గః   భూయ ఏవ మహాతేజా హనూమాన్మారుతాత్మజః | అబ్రవీత్ప్రశ్రితం వాక్యం సీతాప్రత్యయకారణాత్ || 1 || సీతక...