3, జూన్ 2020, బుధవారం

Sundarakanda సుందరకాండ 16


రామసుందరం
షోడశస్సర్గః

ప్రశస్య తు ప్రశస్తవ్యాం సీతాం తాం హరిపుంగవః ।
గుణాభిరామం రామం చ పున శ్చింతాపరోభవత్‌ 1
వానరపుంగవుడు, హనుమంతుడు ప్రశంసించ తగిన సీతాదేవిని, గుణాభిరాముడు, రాముని ప్రశంసించి, మఱల చింతలో మునిగి పోయాడు.
స ముహూర్త మివ ధ్యాత్వా బాష్పపర్యాకులేక్షణః
సీతా మాశ్రిత్య తేజస్వీ హనుమా న్విలలాప హ ॥ 2
మాన్యా గురువినీతస్య లక్ష్మణస్య గురుప్రియా ।
యది సీతాపి దుఃఖార్తా కాలో హి దురతిక్రమః ॥ 3
ఆ తేజోవంతుడు, ముహూర్తంసేపు ఆలోచించి, అంన్నీరు చిప్పిలి, కలఁతను కల్గించగా, సీతను గూర్చి తనలో ఈమె, గురుశిక్షితుడు, పరమధార్మికుడు, లక్ష్మణునికి పూజనీయురాలు. జగద్రక్షకుడు, రామునికి ప్రియురాలు. ఇట్టి సీతే దుఃఖపీడిత అయితే, క కాలాన్ని అతిక్రమించడానికి,వ్వరికీ తరమే కాదు.
రామస్య వ్యవసాయజ్ఞా లక్ష్మణస్య చ ధీమతః ।
నాత్యర్థం క్షుభ్యతే దేవీ గంగేవ జలదాగమే ॥ 4
శ్రితరక్షణవ్రతుడు రాముఁని ప్రయత్నం, మృగాన్ని మారీచుడని కనుఁగొన్న మహాబుద్ధిమంతుఁడు లక్ష్మణుని ప్రత్నం గూర్చి ఎఱిగి, ఈ సీత, తానేమీ ప్రత్నం చేయక, కొంచెమైనను కలగుండు పొందక, వర్షాకాలం వచ్చినపుడు కలతపడని గంగానదిలా కనబడుతోంది.
తుల్యశీలవయోవృత్తాం తుల్యాభిజనలక్షణాం ।
రాఘవోర్హతి వైదేహీం తం చేయ మసితేక్షణా 5
స్వభావం, వయసు, నడవడి, వంశం, సాముద్రికశుభలక్షణాల్లో, రామునకు నురూపయై సీత ఉంది. కాబట్టి ఆమెకు తఁడు గి ఉన్నాడు. నల్లని వాలుకండ్లు కల ఈమె కూడా అతనికి గి ఉంది.” అని విలపించాడు.
తాం దృష్ట్వా నవహేమాభాం లోకకాంతా మివ శ్రియమ్‌ ।
జగామ మనసా రామం వచనం చేద మబ్రవీత్‌ ॥ 6
అస్యా హేతో ర్విశాలాక్ష్యా హతో వాలీ మహాబలః ।
రావణప్రతిమో వీర్యే కబంధశ్చ నిపాతితః ॥ 7
విరాధశ్చ హత స్సంఖ్యే రాక్షసో భీమవిక్రమః ।
వనే రామేణ విక్రమ్య మహేంద్రేణేవ శంబరః ॥ 8
ఆ హనుమంతుఁడు, క్రొత్త బంగారపుఛాయ కల్గి, లోకానికి ప్రియం కల్గించే లక్ష్మీదేవిలాంటి సీతను చూసి, రాముని మనసులో తలచుకొని, తనలో తాను “ఈ విశాలాక్షికొఱకే రాముఁడు మహాబలవంతుఁడు వాలిని, పరాక్రమంలో రావణునికి సాటైన కబంధుని, దేవేంద్రుడు శంబరాసురుని చంపినట్లు, అడవిలో పరాక్రమించి, యుద్ధంలో భయంకరపరాక్రముఁడగు రాక్షసుడు, విరాధుని, చంపాడు.
చతుర్దశసహస్రాణి రక్షసాం భీమకర్మణామ్‌ ।
నిహతాని జనస్థానే శరై రగ్నిశిఖోపమైః 9
మఱియు జనస్థానంలో భయంకరకర్ములు, పదునాలుగువేల రాక్షసులు, అగ్నిజ్వాలల్లాంటి రామునిబాణాతో నిహతులయ్యారు.
ఖరశ్చ నిహత స్సంఖ్యే త్రిశిరాశ్చ నిపాతితః ।
దూషణశ్చ మహాతేజా రామేణ విదితాత్మనా ॥ 10
విదితాత్ముడు రామునిచే, యుద్ధంలో ఖరుడు, త్రిశిరుడు, మహాతేజుడైన దూషణుఁడు కూల్చబడ్డారు.
ఐశ్వర్యం వానరాణాం చ దుర్లభం వాలిపాలితమ్‌ ।
అస్యా నిమిత్తే సుగ్రీవః ప్రాప్తవాన్‌ లోకసత్కృతమ్‌ 11
ఈమె నిమిత్తంగానే, సుగ్రీవుఁడు దుర్లభం, లో పూజితం, వాలిపాలితం అయిన వానరరాజ్యైశ్వర్యాన్ని పొందాడు.
సాగరశ్చ మయా క్రాంత శ్శ్రీమా న్నదనదీపతిః ।
అస్యా హేతో ర్విశాలాక్ష్యాః పురీ చేయం నిరీక్షితా 12
ఈ విశాలాక్షి నిమిత్తమే, నేను, దనదీపతి, శ్రీమంతుడు, సముద్రుని దాటి వచ్చి లంకాపట్టణాన్ని చూశాను.
యది రామ స్సముద్రాంతాం మేదినీం పరివర్తయేత్‌ ।
అస్యాః కృతే జగచ్చాపి యుక్త మిత్యేవ మే మతిః ॥ 13
ఇట్టి సీకొఱకు, రాముఁడు ముద్రపర్యంతభూతలాన్నంతా, భూమి మాత్రమేనా! సస్తలోకాల్ని కూడా తల క్రిందుగా చేసినా, అదీ యుక్తమే అని నాకు తోస్తోంది.
రాజ్యం వా త్రిషు లోకేషు సీతా వా జనకాత్మజా ।
త్రైలోక్యరాజ్యం సకలం సీతాయా నాప్నుయాత్కలామ్‌ ॥ 14
ఇయం సా ధర్మశీలస్య మైథిలస్య మహాత్మనః
సుతా జనకరాజస్య సీతా భర్తృదృఢవ్రతా 15
త్థితా మేదినీం భిత్త్వా క్షేత్రే హలముఖక్షతే
పద్మరేణునిభైః కీర్ణా శుభైః కేదారపాంసుభిః ॥ 16
త్రైలోక్యరాజ్యం హెచ్చా? జనకరాజసుసీత ఎచ్చా? అని పరిశీలిస్తే, త్రైలోక్యరాజ్యమంతా సీతలో దియాఱవపాలికి కూడా సాటి కాదు. ధర్మస్వభావుడు, మిథిలాధిపతి, మహాత్ముడు, జనకమహారాజుకు కూతురై, పెనిమిటియందు దృఢమైన పాతివ్రత్యం కలిగి, తామర పుప్పొళ్లలాంటి మేలైన యాక్షేత్రపుదుమ్ముల్లో మునిగి, నాగటికఱ్ఱుతో దున్నబడ్డ, ఆ క్షేత్రమందు భూమిని భేదించుకొని, ద్భవించిన, ఆ సీత, ఈవిడే.
విక్రాంత స్యార్యశీలస్య సంయుగే ష్వనివర్తినః
స్నుషా దశరథ స్యైషా జ్యేష్ఠా రాజ్ఞో యశస్వినీ 17
ఈవిడే, పరాక్రమశాలి, పూజ్యస్వభావుఁడు, యుద్ధాల్లో వెనుతిరగనివాడు, దశరథమహారాజుకు పొగడ్త కెక్కిన పెద్దకోడలు.
ధర్మజ్ఞస్య కృతజ్ఞస్య రామస్య విదితాత్మనః
ఇయం సా దయితా భార్యా రాక్షసీవశ మాగతా 18
ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, ఆత్మవేది, రాముని గారాము భార్య, ఈ సీత, రాక్షస స్త్రీల చేత చిక్కి ఉంది.
సర్వా న్భోగా న్పరిత్యజ్య భర్తృ స్నేహబలాత్కృతా
అచింతయిత్వా దుఃఖాని ప్రవిష్టా నిర్జనం వనమ్‌ ॥ 19
సంతుష్టా ఫలమూలేన భర్తృశుశ్రూషణే రతా
యా పరాం భజతే ప్రీతిం వనేపి భవనే యథా ॥ 20
సేయం కనకవర్ణాంగీ నిత్యం సుస్మితభాషిణీ ।
సహతే యాతనా మేతా మనర్థానా మభాగినీ 21
పెనిమిటి యందలి స్నేహపుబలిమివల్ల  సమస్తభోగాల్ని పూర్ణంగా దిగవిచి, ఆభోగాల్నే కాక ఆ పై రానున్న డవిలోని దుఃఖాలనైనా ఆలోచించక, నిర్జనమైన వనాన్ని ప్రవేశించి, అడవిలోని పండ్లకు, వేళ్లకు, తృప్తిపడుతూ, భర్త కెప్పుడూ , శుశ్రూష చేస్తూ, గృహంలో ఉన్నట్లే వనంలోనూ మిక్కిలి సంతోషాన్ని పొందుతూ, కనకాంగి, నిత్యసుస్మితభాషిణి, సీత, ఇలాంటి యాతనను సహిస్తున్నదే! ఏమనవచ్చును!.
ఇమాం తు శీలసంపన్నాం ద్రష్టు మర్హతి రాఘవః
రావణేన ప్రమథితాం ప్రపా మివ పిపాసితః ॥ 22
సదాచారసంపన్నయై, ఈవిధంగా రావణునిచే  ఆఱడి పెట్టబడుతున్న ఈ చెలువను, దప్పిగొన్నవాఁడు చలిపందిరిని చూసినట్లు రాముఁడు చూడదగును.
అస్యా నూనం పున ర్లాభా ద్రాఘవః ప్రీతి మేష్యతి
రాజా రాజ్యపరిభ్రష్టః పునః ప్రాప్యేవ మేదినీమ్‌ ॥ 23
రాజ్యాన్ని పోగొట్టుకొన్న రాజు, మరల రాజ్యాన్ని పొంది, సంతోషించినట్లు, రాముఁడు మరల సీతను పొంది, సంతోషించగలడు. ఇది నిజం.
కామభోగైః పరిత్యక్తా హీనా బంధుజనేన చ
ధారయ త్యాత్మనో దేహం తత్సమాగమకాంక్షిణీ ॥ 24
సీత తనకు పువ్వులు గంధాలు మొదలైన భోగపదార్థాలు, బంధుజనులు లేకపోయినా, రామునితో సమాగమానికై  వ్విళులూరుతోంది కాబట్టి,  బ్రతికుంటే ఎప్పుడైనా పతిని చూడవచ్చు, అని ఆలోచించి, మేనియందు ప్రాణాలు ధరించి ఉంది.
నైషా పశ్యతి రాక్షస్యో నేమాన్‌ పుష్పఫలద్రుమాన్‌ ।
ఏకస్థహృదయా నూనం రామ మే వానుపశ్యతి ॥ 25
ఈ సీత ప్పుడీ రాక్షసస్త్రీలను చూడదు. అలాగే రాముని విడచి ఉండడంతో, ఈ వృక్షాలు, ఫలపుష్పాదులతోఁ కూడి ఉన్నా వీటినీ చూడదు. మనసు రామునియందే నెలకొలిపి, రాలన్నీ విడిచి, రామునే ధ్యానిస్తోంది. నిరంతరం రామునే మనస్సులో అనుభవిస్తూండడంవల్ల దాపున న్న వస్తువూ ఆమెకు బడదు. ఇది నిశ్చయం.  
భర్తా నామ పరం నార్యా భూషణం భూషణాదపి ।
ఏషా తు రహితా తేన భూషణార్హా న శోభతే ॥ 26
పెనిమిటి అంటే స్త్రీకి భూషణంకంటే అధికమైనమయిన లంకారం. కాబట్టి భూషణార్హ అయినా, భూషణమైన పెనిమిటి లేకపోవడంతో చెలువ, ఎంమాత్రం ప్రకాశించడం లేదు.
దుష్కరం కురుతే రామో హీనో య దనయా ప్రభుః ।
ధారయ త్యాత్మనో దేహం న దుఃఖే నావసీదతి ॥ 27
రామప్రభువు, లాంటి సీత లేనందుకు, దేహాన్ని విడవాల్సి ఉండగా దేహాన్ని దాల్చి న్నాఁడే! మఱి శోకాన స్రుక్కి చిక్కకున్నాఁడే! ఇది మఱెవ్వరికీ చేయనలవి కాదు. ఇలాంటి దాన్ని రాముడు చేశాడు!
ఇమా మసితకేశాంతాం శతపత్త్రనిభేక్షణామ్‌ ।
సుఖార్హాం దుఃఖితాం దృష్ట్వా మమాపి వ్యథితం మనః ॥ 28
నిగనిగమనే నల్లని నెఱికురులకొనలు, తామరపూరేకుల్లాంటి కన్నుంగవ కల్గి, సుఖాన్ని మాత్రమే నుభవించడానికి తగిన ఈ సీత, దుఃఖాన్ని పొందడం చూస్తే, మె సుఖదుఃఖాలతో ఎంతమాత్రమూ సంబంధం లేని మధ్యస్థుఁడనైన నాబోటివాని మనసుకే దుఃఖం కల్గుతోందే. ఇక ఈమెకు ప్రియుఁడు, పరమదయాళువు, రామునకు దుఃఖం ల్గుతుందని చెప్పడం ఎందుకు?.
క్షితిక్షమా పుష్కరసన్నిభాక్షీ
యా రక్షితా రాఘవలక్ష్మణాభ్యామ్‌ ।
సా రాక్షసీభి ర్వికృతేక్షణాభి
స్సంరక్ష్యతే సంప్రతి వృక్షమూలే 29
భూమిలా ఓర్పును, తామరరేకుల్లాంటి కన్నుగవ కల్గిన ఆ చెలువ, రామలక్ష్మణుచేత రక్షితయైన సీత, ప్పుడు చెట్టు క్రింద, వికృతనేత్రాలతో చూడ్డానికి అహ్యంగా ఉండే రాక్షసస్త్రీల కాఁపుదలలో ఉంది.
హిమహతనళినీవ నష్టశోభా
వ్యసనపరంపరయా నిపీడ్యమానా
హచరరహితేవ చక్రవాకీ
జనకసుతా కృపణాం దశాం ప్రపన్నా ॥ 30
జనకునింట గోముగా పెంచబడిన సీత, ప్పుడు, మంచుచే పొలుపు కుందిన తామరతీఁగలా కాంతి కుందినదై, ఒకటి వెంట కటిగా డతెగక కల్గుతూండే ఆపదలతో, మిక్కిలి పీడింపబడుతూ, మగజక్కవను పాసిన క్కవపెంటిలా ప్రియవిరహాన్ని ఒకక్షణమైనా ఓర్వజాలక, చూసేవాళ్ళకు కూడా దుఃఖాన్ని కల్గిస్తూ, ఇలాంటిది అలాంటిదని చెప్పడానికీ, అనుకోవడానికీ శక్యం కాని దురవస్థ పొంది ఉంది.
అస్యా హి పుష్పావనతాగ్రశాఖా
శ్శోకం దృఢం వై జనయం త్యశోకాః
హిమవ్యపాయేన చ మందరశ్మి
రభ్యుత్థితో నైకసహస్రరశ్శిః ॥ 31
పువ్వుల బరువుతో కొనకొమ్మలు వంగి న్న శోకవృక్షాలూ, సంతర్తువు అవడంతో వేల కిరణాతో వెలుగుతూ,దయించిన చంద్రుడూ, మెకు మిక్కిలి దు:ఖాన్ని కలిగిస్తున్నారు అని నుకొన్నాడు.
ఇ త్యేవ మర్థం కపి రన్వవేక్ష్య
సీతేయ మిత్యేవ నివిష్టబుద్ధిః
సంశ్రిత్య తస్మి న్నిషసాద వృక్షే
బలీ హరీణా మృషభ స్తరస్వీ 32
బలవంతుఁడు, వానరులకు మేలుబంతి, వేగవంతుఁడు అయిన హనుమంతుఁడు, ఇట్లీ విషయాన్ని తనలో తాను రిశీలించి, మె 'సీతే' ని నిశ్చబుద్ధిని పొంది,శింశుపావృక్షంపై కూర్చొని ఉన్నాడు.

---------------------------------------------------------------------------------------

సన్నద్ధః కవచీ ఖడ్గీ చాపబాణధరో యువా | గచ్ఛన్ మనోరథా న్నశ్చ రామః పాతు సలక్ష్మణః ||21||

ఇత్యార్షే శ్రీమద్వాల్మీకిరామాయణే ఆదికావ్యే సుందరకాండే షోడశస్సర్గః (16)

మంగళం మహత్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

SUNDARAKANDA సుందరకాండ 36

  రామసుందరం - షట్త్రింశస్సర్గః   భూయ ఏవ మహాతేజా హనూమాన్మారుతాత్మజః | అబ్రవీత్ప్రశ్రితం వాక్యం సీతాప్రత్యయకారణాత్ || 1 || సీతక...