9, జూన్ 2020, మంగళవారం

Sundarakanda సుందరకాండ 22


రామసుందరం
ద్వావింశస్సర్గః
సీతాయా వచనం శ్రుత్వా పరుషం రాక్షసాధిపః
ప్రత్యువాచ తత స్సీతాం విప్రియం ప్రియదర్శనామ్‌ ॥ 1
రావణుడు, పరుషమైన సీతావచనాలను విని, ప్రియదర్శిని సీతతో అప్రియంగా, ఇలా, అన్నాడు.
యథా యథా సాంత్వయితా వశ్యః స్త్రీణాం తథా తథా
యథా యథా ప్రియం వక్తా పరిభూత స్తథా తథా ॥ 2
పురుషుడు స్త్రీలను ఎంతెంత బుజ్జగిస్తాడో, వాళ్లకు, అంతంత వశుడవుతాడు. మఱి ఎంతెంత ప్రియాలు పల్కుతాడో, వారిచే, అంతంత అవమానింపబడతాడు.
సన్నియచ్ఛతి మే క్రోధం త్వయి కామ స్సముత్థితః
ద్రవతోమార్గ మాసాద్య హయా నివ సుసారథిః 3
నీమీద నాకు కలిగిన కామం, సమర్థుడైన సారథి, దారితప్పి పరుగెత్తే, గుఱ్ఱాల్ని, లాగి పట్టే విధంగా, నా కోపాన్ని అణచివేస్తోంది.
వామః కామో మనుష్యాణాం యస్మిన్‌ కిల నిబధ్యతే
జనే తస్మిం స్త్వనుక్రోశ స్స్నేహశ్చ కిల జాయతే ॥ 4
కామం అనేది మనుష్యులకు చెడ్డది. అది ఎవ్వరిమీద గట్టిగా ఏర్పడుతుందో, వారిమీద దయ, స్నేహం మాత్రమే కల్గుతూంటాయి కదా!.
ఏతస్మా త్కారణా న్న త్వాం ఘాతయామి వరాననే ।
వధార్హా మవమానార్హాం మిథ్యాప్రవ్రజితే రతామ్‌ ॥ 5
ఓ వరాననా! నీపై నాకున్న ఈ మోహకారణం వల్ల, అవమానించడానికి, చండానికి,గినదానవైనా, పటవానప్రస్థవ్రతం చేస్తున్నవానిపై ఆసక్తి ఉన్న నిన్ను, చంపటం లేదు.
పరుషా ణీహ వాక్యాని యాని యాని బ్రవీషి మాం
తేషు తేషు వధో యుక్త స్తవ మైథిలి దారుణః ॥ 6
సీతా! నీవు, నన్ను, ఏయే పరుషపుమాటలు పలికావో, వాటిలో ఒక్కొక్క మాటకూ, నిన్ను ఊరకేకాక భయంకరంగా, చంపవచ్చు.”  
ఏవ ముక్త్వా తు వైదేహీం రావణో రాక్షసాధిపః ।
క్రోధసంరంభసంయుక్త స్సీతా ముత్తరమబ్రవీత్‌ ॥ 7
రావణుడు, లా సీతకు చెప్పి, క్రోధాతిశయాలు పురికొనగా, మరల ఆమెతో, ఇలా అన్నాడు.
ద్వౌ మాసౌ రక్షితవ్యౌ మే యోవధిస్తే మయా కృతః ।
తత శ్శయన మారోహ మమ త్వం వరవర్ణిని ॥ 8
నీకు పెట్టిన గడువులో, ఇంకా నేను వేచి ఉండవలసింది, రెండునెలలే. ఆ పిమ్మట, వరవర్ణినీ! నీవు నా సెజ్జనెక్కు.
ఊర్ధ్వం ద్వాభ్యాం తు మాసాభ్యాం భర్తారం మా మనిచ్ఛతీమ్‌
మమ త్వాం ప్రాతరాశార్థ మాభంతే మహానసే ॥ 9
ఆ రెండుమాసాలు అయ్యాక మాత్రం నీవు నన్ను భర్తగా ఇష్టపడకపోతే, ఆ మఱునాడే, నా ప్రాతఃకాలభోజనానికై, వంటింట్లో, నిన్ను, చంపి, వండుతారు”.
తాం తర్జ్యమానాం సంప్రేక్ష్య రాక్షసేంద్రేణ జానకీమ్‌ ।
దేవగంధర్వకన్యా స్తా విషేదు ర్వికృతేక్షణాః 10
రావణుడలా సీతను బెదరిస్తూండగా, రావణుని కూడా ఉన్న, దేవగంధర్వకాంతలు, వగపువల్ల ఎఱ్ఱనై, వికారాలైన, కండ్లతో, దుఖించారు.
ఓష్టప్రకారై రపరా వక్త్రనేత్రై స్తథాఽపరాః ।
సీతా మాశ్వాసయామాసు స్తర్జితాం తేన రక్షసా ॥ 11
కొంతమంది పెదవుల్ని కదలించి, కొందఱు, ముఖసంజ్ఞలచేత, కనుసైగలచేత, సీతను ఊఱడించారు.
తాభి రాశ్వాసితా సీతా రావణం రాక్షసాధిపమ్‌
ఉవా చాత్మహితం వాక్యం వృత్తశౌండీర్యగర్వితమ్‌ 12
లా వారిచేత ఊఱడింపబడ్డ సీత, రావణుని చూసి, పాతివ్రత్యబలగర్వంతో, తనకు హితమైన వాక్యాల్ని చెప్పింది.
నూనం న తే జనః కశ్చి దస్తి నిశ్శ్రేయసే స్థితః
నివారయతి యో న త్వాం కర్మణోస్మాద్విగర్హితాత్‌ 13
“నీ మేలు గట్టిగా కోరెవాడెవ్వఁడూ ఇక్కడ లేడు. ఈ అనిందితకార్యంనుండి నిన్ను మరల్చేవాడు ఎవడూ లేడు. ఇది నిజం.
మాంహి ధర్మాత్మనః పత్నీం శచీమివ శచీపతేః ।
త్వదన్య స్త్రిషు లోకేషు ప్రార్థయే న్మనసాపి కః ॥ 14
ఇంద్రునికి శచీదేవిలా, ధర్మాత్ముడు రామునికి పత్నినై న్ననన్ను, ముల్లోకాల్లో నీవొక్కడు తప్ప మఱి ఎవ్వడూ, ఇలా, మనస్సులో కూడా కోరడు.
రాక్షసాధమ రామస్య భార్యా మమితతేజసః ।
ఉక్తవా నసి యత్పాపం క్వ గత స్తస్య మోక్ష్యసే 15
రాక్షసాధమా! అమితతేజస్వి రాముని ల్లాలిని, నన్ను,ఇలాంటి పాపపుమాటలాడావే! నీ వెక్కడికి పోయి, ఈ పాపంనుండి తప్పించుకోగలవు! ఏ లోకానికి పోయినా నిన్నది విడువదు.
యథా దృప్తశ్చ మాతంగః శశశ్చ సహితౌ వనే ।
తథా ద్విరదవ ద్రామ స్త్వం నీచశశవత్‌ స్మృతః ॥ 16
అడవిలో మత్తిల్లిన ఏనుగు, కుందేలు (పోరాటానికి) కూడితే, ఎలా ఉంటుందో, అలా, రాముడు, నీవు, యుద్ధంలో తారసిల్లితే, రాముడు, మదగజంలా, నీవు, నీచమైన కుందేలులా అవుతారు.
సత్వ మిక్ష్వాకునాథం వైక్షిపన్నిహన లజ్జసే
చక్షుషో ర్విషయం తస్య న తావ దుపగచ్ఛసి 17
క్షుద్రమైన కుందేలులాంటి నీవు, ఇక్కడ, రామప్రభువును నిందిస్తున్నావు, సిగ్గులేకుండా, దొంగతనంగా, నన్ను అపహరించి, తెచ్చి, బింకపుమాట లాడుతున్నావు. నీవింతకూ రాముని కంటబడలేదు. పడితే తెలిసేది.
ఇమే తే నయనే క్రూరే విరూపే కృష్ణపింగళే
క్షితౌ న పతితే కస్మా న్మా మనార్య నిరీక్షతః 18
దుష్టుడా! నన్ను, మరులుగొని చూస్తున్న, నీ క్రూర, విరూప, కృష్ణపింగళ (నల్లని గోరోచపువన్నె) నేత్రాలు, ఏల వీడి, నేలపై, పడవు?
తస్య ధర్మాత్మనః పత్నీం స్నుషాం దశరథస్య చ ।
కథం వ్యాహరతో మాంతేన జిహ్వా వ్యవశీర్యతే 19
ధర్మాత్ముడు రామునిపత్నిని. దశరథమహారాజు కోడల్ని.లాంటి నన్నుగూర్చి, అనరాని మాటలు అంటున్నావే! ఏల నీనాలుక, చీలికలై పడలేదు?
అసందేశాత్తు రామస్య తపస శ్చానుపాలనాత్‌
న త్వాం కుర్మి దశగ్రీవ భస్మ భస్మార్హతేజసా 20
దశగ్రీవా! నీవు, భస్మం చేయతగినవాడవైనా, రాముని ఆదేశం లేనందువల్లా, పాతివ్రత్యరూపమైన నా తపస్సు, తఱుగుతుంది కదా! అని, నిన్ను, భస్మం చేయలేకున్నాను.
నాపహర్తు మహం శక్యా త్వయా రామస్య ధీమతః !
విధి స్తవ వధార్థాయ విహితో నాత్ర సంశయః ॥ 21
బుద్ధిమంతుడగు రామునొద్ద నేనుండగా, నన్ను, అపహరించడం, నీ తరం కాదు. నీ చావుకోసం, రాముడు దూరంగా పోయేలా, విధి, ఘటించింది. ఇందుకు సందేహం లేదు.
శూరేణ ధనదభ్రాత్రా బలై స్సముదితేన చ
అపోహ్య రామం కస్మాద్ధి దారచౌర్యం త్వయా కృతమ్‌ 22
శూరుణ్ణి, కుబేరుని తమ్ముణ్ణి, బలవంతుణ్ణి అని చెప్పుకొంటున్నావే. మఱి అలాంటివాడివి, రాముని దూరంగా పంపి, ఆయన భార్య నేల దొంగిలించి, తెచ్చావు? ఆయన ఎదుట పడలేదేమి?” అంది.
సీతాయా వచనం శ్రుత్వా రావణో రాక్షసాధిపః ।
వివృత్య నయనే క్రూరే జానకీ మన్వవైక్షత ॥ 23
సీత వచనాలను విని, రావణుడు, ఉగ్రుడై, ఆమె వైపు, గ్రుడ్లుఱుమి, చూశాడు.
నీలజీమూతసంకాశః మహాభుజశిరోధరః ।
సింహసత్త్వగతి శ్రీమాన్‌ దీప్తజిహ్వాగ్రలోచనః ॥ 24
అప్పుడు, నీలజీమూతసంకాశుడు, మహాభుజశిరోధరుడు, సింహసత్త్వతుడు, శ్రీమంతుడు, దీప్తజిహ్వాగ్రలోచనుడు,   
చలాగ్రమకుటప్రాంశు శ్చిత్రమాల్యానులేపనః
రక్తమాల్యాంబరధర స్తప్తాంగదవిభూషణః 25
చలాగ్రమకుటప్రాంశుడు, చిత్రమాల్యానులేపనుడు, రక్తమాల్యాంబరధరుడు, ప్తాంగదవిభూషణుడు,
శ్రోణిసూత్రేణ మహతా మేచకేన సుసంవృతః
అమృతోత్పాదనద్ధేన భుజగేనేవ మందరః ॥ 26
అమృతాన్ని పుట్టించటానికి, సర్పంతో చుట్టబడిన, మందరపర్వతంలా, నల్లని నిడుద మొలనూలు, చుట్టుకొన్నవాడు,  
తాభ్యాం స పరిపూర్ణాభ్యాం భుజాభ్యాం రాక్షసేశ్వరః
శుశుభేచలసంకాశ శ్శృంగాభ్యామివ మందరః ॥ 27
రెండు శిఖరాల మందరపర్వతంలా, నిండుగా ఉన్న, ప్రసిద్దికెక్కిన, రెండు బాహువులతో, శోభిల్లు, రాక్షసేశ్వరుడు,
తరుణాదిత్యవర్ణాభ్యాం కుండలాభ్యాం విభూషితః
రక్తపల్లవపుష్పాభ్యా మశోకాభ్యా మివాచలః ॥ 28
రక్తపల్లవపుష్పాలతో నిండి, రెండు అశోకవృక్షాలు కల పర్వతంలా, తరుణాదిత్యవర్ణకుండలవిభూషితుడు,
స కల్పవృక్షప్రతిమో వసంత ఇవ మూర్తిమాన్‌
శ్మశానచైత్యప్రతిమో భూషితోపి భయంకరః ॥ 29
కల్పవృక్షసమానుడు, మూర్తీభవించిన వసంతుడు, భూషితుడైనా, శ్మశానచైత్యప్రతిమాభయంకరుడు,
అవేక్షమాణో వైదేహీం కోపసంరక్తలోచనః ।
ఉవాచ రావణ స్సీతాం భుజంగ ఇవ నిశ్శ్వసన్‌ ॥ 30
కోపసంరక్తలోచనుడు, ఆ రావణుడు, సీతను చూస్తూ, పాములా బుసలు కొడుతూ, ఆమెతో, ఇలా అన్నాడు.
అనయే నాభిసంపన్న మర్థహీన మనువ్రతే
నాశయా మ్యహ మద్య త్వాం సూర్య స్సంధ్యామివౌజసా ॥ 31
“అనయాలతో కూడుకొన్నవాడు, అర్థహీనుడు, రాముని అనుసరిస్తున్నదానివి. సూర్యుడు, తన తేజస్సుతో, ప్రాతః సంధ్యను, నాశనం చేసినట్లు, నిన్ను, ఇపుడు, నాశనం చేస్తా”
ఇత్యుక్త్వా మైథిలీం రాజా రావణ శ్శత్రురావణః ।
సందిదేశ తత స్సర్వా రాక్షసీ ర్ఘోరదర్శనాః 32
ఏకాక్షీ మేకకర్ణాం చ కర్ణప్రావరణాం తథా ।
గోకర్ణీం హస్తికర్ణీం చ లంబకర్ణీ మకర్ణికామ్‌ ॥ 33
హస్తిపాద్యశ్వపాద్యౌ చ గోపాదీం పాదచూళికామ్‌ ।
ఏకాక్షీ మేకపాదీం చ పృథుపాదీ మపాదికామ్‌ ॥ 34
అతిమాత్రశిరోగ్రీవా మతిమాత్రకుచోదరీం
అతిమాత్రాస్యనేత్రాం చ దీర్ఘజిహ్వా మజిహ్వికామ్‌
అనాసికాం సింహముఖీం గోముఖీం సూకరీముఖీమ్‌ ॥ 35
అని సీతతో పల్కి, తర్వాత,  ఏకాక్షి, ఏకకర్ణి,  ప్రావరణకర్ణి, గోకర్ణి,స్తికర్ణి, లంబకర్ణి, అకర్ణి, హస్తిపాద, అశ్వపాద, గోపాద, పాదచూళిక, ఏకాక్షి, ఏకపాది, పృథుపాది, అపాది, అతిమాత్రశిరోగ్రీవాతిమాత్రకుచోదరులు, అతిమాత్రాస్యనేత్రి, దీర్ఘజిహ్విక, అజిహ్విక, అనాసిక, సింహముఖి, గోముఖి, సూకరీముఖి – ఇలాంటి ఘోరదర్శనులైన, రాక్షస స్త్రీలను, ఇలా, ఆదేశించాడు.
యథా మద్వశగా సీతా క్షిప్రం భవతి జానకీ ।
తథా కురుత రాక్షస్య స్సర్వాః క్షిప్రం సమేత్య చ 36
సర్వరాక్షసాంగనల్లారా! మీరంతా కలసి, జనకుని కూతురు, సీత, శీఘ్రంగా, నాకు, వశమయ్యేటట్లు, తొందరగా చేయండి.
ప్రతిలోమానులోమైశ్చ సామదానాదిభేదనైః ।
ఆవర్జయత వైదేహీం దండ స్యోద్యమనేన చ ॥ 37
ప్రతికూల, అనుకూల కార్యాలచేతనైనా, సామదానభేదాదులచేతనైనా, వీలు కాకపోతే దండోపాయంచేతనైనా సరే, వైదేహిని, నా వశం చేయండి.”
ఇతి ప్రతిసమాదిశ్య రాక్షసేంద్రః పునః పునః
కామమన్యుపరీతాత్మా జానకీం పర్యతర్జయత్‌ ॥ 38
రావణుడు, ఈ రీతిగా, ఆదేశించి, కామక్రోధాదులు, మనసులో, పురిగొనగా, మాటిమాటికి, సీతను, అదలించాడు.
ఉపగమ్య తతః క్షిప్రం రాక్షసీ ధాన్యమాలినీ ।
పరిష్వజ్య దశగ్రీవ మిదం వచన మబ్రవీత్‌ ॥ 39
అప్పుడు, రావణుని కడగొట్టు భార్య, ధాన్యమాలిని అనే రాక్షసి, తొందరగా దగ్గరకు వచ్చి, రావణుని, కౌగిలించుకొని, ఇలా అంది.
మయా క్రీడ మహారాజ సీతయా కిం త వానయా ।
వివర్ణయా కృపణయా మానుష్యా రాక్షసేశ్వర 40
“మహారాజా! నాతో, క్రీడించు. వివర్ణ, దీనురాలు, మానవకాంత, సీత, నీకేల?
నూన మస్యా మహారాజ న దివ్యాన్‌ భోగసత్తమాన్‌
విదధా త్యమరశ్రేష్ఠ  స్తవ బాహుబలార్జితాన్‌ ॥ 41
బాహుబలంతో, నీవు, ఆర్జించిన, దివ్యభోగాలను అనుభవించే భాగ్యం, ఈమెకు, బ్రహ్మదేవుడు, నిశ్చయంగా, విధించలేదు.
అకామాం కామయానస్య శరీరముపతప్యతే ।
చ్ఛంతీం కామయానస్య ప్రీతి ర్భవతి శోభనా ॥ 42
కామేచ్ఛ లేనిదాన్ని, కామిస్తే, దేహానికి, వట్టి పరితాపమే, కానీ, ప్రయోజనం లేదు. తన్ను, వలచే, ఇంతిని, కోరేవానికి. మంచి సంతోషం కల్గుతుంది.”
ఏవ ముక్తస్తు రాక్షస్యా సముత్ క్షిప్త స్తతో బలీ
ప్రహస న్మేఘసంకాశో రాక్షస స్స న్యవర్తత ॥ 43
మేఘం లాంటి, మేను కల, ఆ రావణుడు, ధాన్యమాలిని, చెప్పింది, విని, ధాన్యమాలినిచే విడువబడి, నవ్వుతూ, వెనుకకు మఱలాడు.
ప్రస్థిత స్స దశగ్రీవః కంపయ న్నివ మేదినీమ్‌ ।
జ్వలద్భాస్కరవర్ణాభం ప్రవివేశ నివేశనమ్‌ ॥ 44
ఆ దశగ్రీవుడు, భూమి వడకేలా, అడుగులు వేస్తూ, జ్వలిస్తున్న సూర్యప్రకాశంతో సమానంగా, వెల్గుతున్న, నిజగృహంలోకి, ప్రవేశించాడు, 
దేవగంధర్వకన్యాశ్చ నాగకన్యాశ్చ సర్వతః
పరివార్య దశగ్రీవం వివిశు స్తం గృహోత్తమమ్‌ 45
దేవగంధర్వనాగకన్య్హలు దశగ్రీవుని చుట్టూ చేరి, అతనితో కూడా. ఆ గృహంలోకి. ప్రవేశించారు. 
స మైథిలీం ధర్మపరా మవస్థితాం
ప్రవేపమానాం పరిభర్త్స్య రావణః
విహాయ సీతాం మదనేన మోహితః
స్వ మేవ వేశ్మ ప్రవివేశ భాస్వరమ్‌ ॥ 46
ధర్మపరాయణురాలు, దృఢచిత్తురాలు, భయకంపితురాలు, మైథిలిని ఆ రావణుడు ఈ రీతిగా, బెదిరించి, అంత, ఆమెను, విడచి, మన్మథ మోహితుడై, తన గృహానికి, పోయాడు.
----------------------------------------------------------------------------------------------------
రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే | రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః ||27||
ఇత్యార్షే శ్రీమద్వాల్మీకిరామాయణే ఆదికావ్యే సుందరకాండే ద్వావింశస్సర్గః (22)
మంగళం మహత్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

SUNDARAKANDA సుందరకాండ 36

  రామసుందరం - షట్త్రింశస్సర్గః   భూయ ఏవ మహాతేజా హనూమాన్మారుతాత్మజః | అబ్రవీత్ప్రశ్రితం వాక్యం సీతాప్రత్యయకారణాత్ || 1 || సీతక...