22, జూన్ 2014, ఆదివారం

soundarya lahari - 7


జగన్మాతవైభవం-7

సౌందర్యలహరి

 13
                                                     


నారాయణీ!

బాగా ముసలివాడైనా, వికారరూపుడైనా,

కామవిషయాల్లో జడుడైనా,

నీ కడగంటిచూపుకు పాత్రమైతే

యువతులు పరవశించి,
 
వాని వెంటపడతారు.


14




జగజ్జననీ!

భూమియందు - 56

నీటియందు - 52

అగ్నియందు - 62

వాయువునందు - 54

ఆకాశమందు - 72

మనస్సునందు - 64

సంఖ్యలుగా గల వెలుగుకిరణములపైన

నీ చరణకమలయుగం ప్రకాశిస్తోంది.



మంగళం మహత్

4, జూన్ 2014, బుధవారం

soundarya lahari - 6

జగన్మాతవైభవం-6
సౌందర్యలహరి

11

జగజ్జననీ!
నలుగురు రుద్రులు ,
శివునికంటె భిన్నులైన ఐదు శక్తులు ,
తొమ్మిది మూలప్రకృతులు ,
అష్టదళం, షోడశదళం, మేఖలాత్రయం, భూపురం
వీనితో కూడి,
నీకు నివాసస్థానమైన శ్రీ చక్రం యొక్క కోణాలు
నలుబదినాలుగు అయ్యాయి.

( శ్రీచక్రం



12

ఓ హైమవతీ!
బ్రహ్మాది కవీంద్రులు
నీ సౌందర్యాన్ని తూచి/ఉపమానాలతో పోల్చి
చెప్పలేకున్నారు.
దేవతాస్త్రీలు నీ సౌందర్యాన్ని దర్శించాలనే కుతూహలురై
తపస్వులకునూ సాధ్యంకాని
శివసాయుజ్యపదవిని మనస్సుతో పొందుతున్నారు.


(సకల సృష్టికర్తయైన బ్రహ్మకును,
తత్సమానులైన మిగిలిన దేవతలకునూ కూడా అమ్మవారిని వర్ణించడం సాధ్యం కాదు.
అన్నదాన్ని బట్టి తల్లి జగదేకసౌందర్యం అసమానమైనదని అర్థమవుతున్నది.

శివుని చెంతనే ఉండే నిన్ను
సదా చూడవచ్చనే కోరికతో
రంభాది దేవతాస్త్రీలు
శివునితో సహయోగాన్ని పొందాలనుకొంటున్నారుట.
నిజానికి వాళ్లు శివసాయుజ్యాన్ని కోరుకొంటున్నారు.
దానికి కారణం ఇది అని కవి, తమాషాగా చెప్పారనుకోవచ్చు.)


మంగళంమహత్

SUNDARAKANDA సుందరకాండ 36

  రామసుందరం - షట్త్రింశస్సర్గః   భూయ ఏవ మహాతేజా హనూమాన్మారుతాత్మజః | అబ్రవీత్ప్రశ్రితం వాక్యం సీతాప్రత్యయకారణాత్ || 1 || సీతక...