"బాహుబలి." | |||||||||||||||
తెలుగు చలనచిత్ర దర్శక
దిగ్గజం., కాదు కాదు, ప్రపంచ చలనచిత్ర దార్శనిక దిగ్గజం రాజమౌళి అద్భుత సృష్టి. |
|||||||||||||||
హాలీవుడ్ కూడా సినిమాలు
తీయమని రాజమౌళిని అహ్వానిస్తుందనడంలో అతిశయోక్తి లేదని రాజమౌళి తీయగలరని నిరూపించిన చిత్రం బాహుబలి. |
|||||||||||||||
అందుకే ప్రపంచదర్శకుడన్నది. | |||||||||||||||
టిక్కెట్లు దొరకకపోవడంతో
ఈ సినిమాను కొంచెం ఆలస్యంగా, విడుదల అయిన ౩వ రోజున చూడటం జరిగింది. |
|||||||||||||||
చూశాక మనోభావాలను తెలియజేయకుండా ఉండలేక ఇలా... | |||||||||||||||
నిజంగానే బాహుబలి
"విజువల్ వండర్." దీనికి తెలుగుపదం వాడడం కంటే ఇదే సమంజసం. |
|||||||||||||||
వండర్స్ గుఱించి తర్వాత చెప్పుకొందాం. | |||||||||||||||
ఫ్లాష్ బాక్ కథ - రివ్యూ | :- | ||||||||||||||
కథ చిన్నదే. కథనాన్ని
అనుసరించి, మూడవతరం నుంచి కథ మొదటితరానికి వెళ్తుంది. ఫ్లాష్ బాక్ ప్రకారం |
|||||||||||||||
(ఫొటోలో
మాత్రం కనబడే) ప్రభాస్ మొదటితరం. ఈ మొదటి ప్రభాస్ అన్నగారు బిజ్జలదేవుడు(నాజర్). |
|||||||||||||||
ఇతనికి
శారీరక అవకరం ఉండడంవల్ల పెద్దవాడైనప్పటికీ అతనికి రాజ్యాధికారం ఇవ్వకుండా తమ్ముడైన ప్రభాస్ ని |
|||||||||||||||
మహిష్మతీ
రాజ్యానికి రాజును చేస్తారు. (ఎవరు చేస్తారో?) ఇది మూలమైన పాయింట్ - అని రచయిత దర్శకులు |
|||||||||||||||
అనుకున్నట్లున్నారు.
కానీ శారీరక అవకరం వల్ల రాజ్యాధికారం ఇవ్వకూడదని ఎక్కడుంది? మహాభారతమే దీనికి ప్రమాణం. |
|||||||||||||||
గ్రుడ్డివాడైన
ధృతరాష్ట్రునికి మఱి రాజ్యాధికారం రాలేదా? రాజు కాలేదా? గ్రుడ్డితనం కంటె సొట్టచెయ్యి నయం కదా! |
|||||||||||||||
అన్నగారు రాజవటం. తమ్ముడు
కుట్ర చేయడం. పాతకథ అనుకొన్నట్లున్నారు. అందువల్ల క్రొత్తగా ఉంటుందను |
|||||||||||||||
కొని
రివర్స్ చేసినట్లున్నారు. కానీ మహాభారతాన్నిమర్చిపోయారు. రాజరికం ప్రకారం పెద్దవాడిదే రాజ్యం. వాడొద్దంటే తప్ప. |
|||||||||||||||
నిజానికి
భారతీయదర్శకులందఱూ రామాయణ భారత భాగవతాల్ని అధ్యయనం చేయడం వల్ల ఎన్నో |
|||||||||||||||
మంచి
సినిమాల్ని ప్రమాణయుక్తంగా తీయవచ్చు. అవి భక్తినో, మతాన్నో బోధించే పుస్తకాలు కావు. |
|||||||||||||||
మానవ జీవితాల్ని ప్రతిబింబించే గ్రంథరాజాలవి. వాటిలో లేని విషయాలు లేవు. | |||||||||||||||
సరే, ఇక సినిమాలోకి
వస్తే, అందువల్ల సహజంగానే బిజ్జలదేవునికి కోపం వస్తుంది. రగిలిపోతూంటాడు. |
|||||||||||||||
"బి.దే" భార్య శివగామి (రమ్యకృష్ణ). | |||||||||||||||
"బి.దే"
అన్నగారు హఠాత్తుగా కాలం చేస్తాడు. అప్పటికి భార్య గర్భవతి. (ఈవిడను చూపించలేదు). |
|||||||||||||||
మొగబిడ్డను
కని మరణిస్తుంది. ఇతడే అమరేంద్ర బాహుబలి (2వ ప్రభాస్). బి.దే, శివగాముల కొడుకు భళ్లాలదేవుడు. (రానా). |
|||||||||||||||
"అ.రే.బా.బ" ను "భ.దే" ని శివగామి పెంచుతుంది. | |||||||||||||||
ఎవరిని రాజును చేయాలనే
విషయంలో శివగామి తనంతట తానే అధికారాన్ని ప్రదర్శించి, బలంతో పాటు ప్రజలను ప్రేమించే |
|||||||||||||||
స్వభావం
ఉన్నవాణ్ణే రాజును చేస్తానంటుంది. ఇక్కడో విషయం చెప్పాలి. శివగామిని "రాజమాత" అని సంబోధిస్తూంటారు. |
|||||||||||||||
యువరాజు
తల్లిని మాత్రమే రాజమాత అంటారు. దానికంటే ముందు ఆమె భర్త రాజయి ఉండాలి. ఇవేవీ లేకుండానే |
|||||||||||||||
ఆవిడ
రాజమాత ఎలా అయిందో దర్శక రచయితలకే తెలియాలి. రామాయణంలో మంథర కైకతో, |
|||||||||||||||
"రాముడు
రాజయితే కౌసల్య రాజమాత అవుతుంది. గౌరవాదులు లభిస్తాయి. అదే నీ కొడుకు రాజయితే నీవు రాజమాతవు |
|||||||||||||||
అవుతావు" అంటుంది. కాబట్టి యువరాజైనాకే ఆతని తల్లిని రాజమాత అనాలి. | |||||||||||||||
అలా కాకుండానే మఱి శివగామి రాజమాత ఎలా అయిందో తెలీదు. | |||||||||||||||
శాసించే అధికారం ఎవరిచ్చారో తెలీదు. బహుశః ఆవిడే తీసుకొనుంటుందనుకోవాలి. | |||||||||||||||
అసలు అ.రే.బా.బ తండ్రి మరణించాక రాజెవడో తెలీదు. | |||||||||||||||
పెరిగి పెద్దయిన
అ.రే.బా.బ, భ.దే లలో ఎవర్ని రాజును చేయాలనే సమస్యను తీర్చడం కోసం కాలకేయపాత్ర |
|||||||||||||||
(ప్రభాకర్)
ను ప్రవేశపెట్టినట్లున్నారు. అంతకుమించి, వేరొక బలమైన కారణం కనబడదు. కాలకేయుడొక ఆటవికరాజు. |
|||||||||||||||
క్రూరుడు. మహిష్మతిమీద దండయాత్ర ప్రకటిస్తాడు. | |||||||||||||||
"కాలకేయుని నెగ్గినవారే రాజ"ని శివగామి ప్రకటిస్తుంది. | |||||||||||||||
ఇక యుద్ధం. రాజమౌళి కలలు
కన్న యుద్ధం. ఇదొక వండర్. తెలుగు సినిమాల్లో ఊహించలేం. |
|||||||||||||||
రాజమౌళి పడ్డ కష్టం అంతా కనిపిస్తుంది. | |||||||||||||||
బిజ్జలుడు, భళ్లాలునికి ఎక్కువ, బాహుబలికి తక్కువ యుద్ధసౌకర్యాలు కల్పిస్తాడు. |
|||||||||||||||
ఉన్న వనరులతోనే తెలివిగాను, ప్రజలకు నష్టం కలగకుండాను బాహుబలి యుద్ధం చేస్తాడు. |
|||||||||||||||
చివరికి బాహుబలి
కాలకేయుణ్ణి కొట్టి ,తెచ్చాక హఠాత్తుగా భళ్లాలదేవుడు కాలకేయుని హతమారుస్తాడు. |
|||||||||||||||
ఊహించనివిధంగా శివగామి | |||||||||||||||
"నూరుమంది శత్రువులను చంపితే వీరుడంటారు. ఒక్కణ్ణి కాపాడితే దేవుడంటారు. అందువల్ల | |||||||||||||||
బాహుబలే రాజు. భళ్లాలుడు సర్వసైన్యాధిపతి" అని ప్రకటిస్తుంది. | |||||||||||||||
ఈ యుద్ధంలో చిత్రమేమిటంటే
చాలా దూరంలో జరుగుతున్న యుద్ధాన్ని కూడా శివగామి తదితరులు |
|||||||||||||||
క్లియర్
గా చూసేస్తూంటారు. యుద్ధరంగంలో ఉన్నా వారికి ఒక్క బాణం కూడా తగలదు. అలాగే దూరంగా ఉన్న కాలకేయ కూడా. |
|||||||||||||||
అయితే
ఊపిరి తీసుకోనివ్వని ఆ యుద్ధదృశ్యాల్లో కొట్టుకొనిపోయే ప్రేక్షకులు ఇది పెద్దగా పట్టించుకోకపోవచ్చు. |
|||||||||||||||
అసలు
మధ్యలో వారిని చూపించకుండా ఉంటే బాగుండునని దర్శకునికి ఎడిటర్ సలహా ఇస్తే బాగుండేది. |
|||||||||||||||
ఈ ఫ్లాష్ బాక్ అంతా ఆ
రాజకుటుంబానికి బానిసగా సేవచేస్తున్న కట్టప్ప(సత్యరాజ్) మహేంద్రబాహుబలికి (3వ ప్రభాస్ కి) చెప్తాడు. |
|||||||||||||||
ముందువెనుకల్ని సరిచేసి చెప్తే, | |||||||||||||||
రాజైన బాహుబలి దేవసేనను(అనుష్క) వివాహమాడతాడు. | |||||||||||||||
వారికి పుట్టిన బిడ్డే మహేంద్రబాహుబలి. |
|||||||||||||||
(భళ్లాలుడు)మహేంద్రను చంపబోతే శివగామి బిడ్డను ఎత్తుకొని పారిపోయి వచ్చి, నీటిలో మునిగే క్రమంలో |
|||||||||||||||
బిడ్డ, సంగ (రోహిణి) కంటబడి, కాపాడబడుతుంది. శివుడని పేరుపెట్టి పెంచుతుంటారు. | |||||||||||||||
ఇక్కడ జలపాత దృశ్యాలు. న భూతో న భవిష్యతి. | |||||||||||||||
ఈ క్రమంలో శివునికి మనకూ కూడా అవంతిక (తమన్నా) పరిచయం. | |||||||||||||||
భళ్లాలుడు
బంధించిన దేవసేనను విడిపించడానికి అవంతిక బృందం పోరాటం. |
|||||||||||||||
శివుడు అవంతికల ప్రేమ. శివుడు దేవసేన కోసం వెళ్లడం. భళ్లాలుని సైన్యంతో యుద్ధం. ఆ క్రమంలో |
|||||||||||||||
తన జననీ జనకుల గాధను కట్టప్పద్వారా శివుడు వినడం. ఇదీ కథ. |
|||||||||||||||
సినిమాలో అసహజత్వాలకు లోటులేదు. | |||||||||||||||
శివుణ్ణి చాలా బలవంతునిగా
చూపించడం కోసం జలపాత హిమపాతాది దృశ్యాల్లొ అతి చేసి చూపారు. |
|||||||||||||||
దర్శకునిగా రాజమౌళి | :- | ||||||||||||||
మహాభారతాన్ని సినిమాగా
తీయాలన్న కోరిక ఉన్నట్లు రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. |
|||||||||||||||
దాన్ని దృష్టిలో పెట్టుకొనే పంచపాండవులకు ప్రతీకగా ప్రభాస్ ని, రూపొందించారనిపిస్తుంది. | |||||||||||||||
ధర్మరాజులా ప్రజల్ని ప్రేమించేలా, | |||||||||||||||
భీమునిలా బలపరాక్రమాలు
చూపించేవానిలా ( బండల్ని కూలదోయడం. మనుషుల్ని ఎత్తిపడేయడం లాంటి |
|||||||||||||||
దృశ్యాలే ఎక్కువ సినిమాలో. నిజానికి భీముని స్వభావమే ఎక్కువ శివునిలో. | |||||||||||||||
అర్జునునిలా బాణవిద్య. | |||||||||||||||
నకులునిలా గుఱ్ఱపుస్వారీ. | |||||||||||||||
సహదేవుని ప్రశంస మహిష్మతీ
రాజ్యం విషయంలో. సహదేవుడు మహిష్మతీ మీద దండయాత్ర చేస్తాడు భారతంలో. |
|||||||||||||||
ఇక రానాని వందమంది
కౌరవులకు పెట్టు అన్నట్టుగా చిత్రీకరించారు. గద కూడా పెట్టారు. |
|||||||||||||||
పైగా ఇద్దరూ అన్నదమ్ముల బిడ్డలు కూడా. | |||||||||||||||
మహాభారతంలో
యుద్ధదృశ్యాలను చిత్రీకరించగలనా లేదా అని చూసుకోవటానికా అన్నట్లు రాజమౌళి కాలకేయునితో యుద్ధాన్ని |
|||||||||||||||
చిత్రీకరించినట్లు తోస్తుంది. | |||||||||||||||
కృష్ణుడు కూడా అర్జునుడు
కౌరవులతో యుద్ధం చేయగలడా లేదా అని రిహార్సల్స్ కోసం గయోపాఖ్యానాన్ని సృష్టించినట్లు |
|||||||||||||||
రాజమౌళి కూడా కాలకేయోపాఖ్యానాన్ని సినిమాలో అతికించినట్లుంది. | |||||||||||||||
గయోపాఖ్యానమూ ఊహే. బాహుబలీ ఊహే. | |||||||||||||||
సరే భారతం సినిమాగా
తీయాల్సి వస్తే బాహుబలి చూశాక అనిపించిదేమంటే భారతాన్ని తీయడం రాజమౌళికి మాత్రమే |
|||||||||||||||
సాధ్యం అని. | |||||||||||||||
అయితే మదీయ సలహా ఏంటంటే
18 పర్వాల్ని ఒకో సినిమాగా గంటా పదినుంచి, రెండుగంటల ఇరవైనిమిషాలలోపు |
|||||||||||||||
18 సినిమాలుగా కానీ లేదంటే కనీసం రెండు
పర్వాల్ని కల్పి 9 సినిమాలుగా తీయమని. (ఇది అసాధ్యమేమో) |
|||||||||||||||
భావోద్వేగాలు అంటూ
దర్శకుడు పదే పదే అన్నా, శివగామి శత్రువును చంపిన చేత్తోనే బిడ్డను లాలించడం సీన్ మినహా |
|||||||||||||||
ఊరించినంత భావోద్వేగ దృశ్యాలు కనిపించలేదు. (నాకు మాత్రం) | |||||||||||||||
ఇక దృశ్యపరంగా | |||||||||||||||
హాలీవుడ్ సినిమాల్లో కూడా ఇంత పెద్ద జలపాతం చూపించబడలేదేమో. అత్యద్భుతం. | |||||||||||||||
కొన్ని ఇంగ్లీషు
సినిమాల్లో హిమపాతదృశ్యాలున్నా తెలుగుసినిమాల్లో మాత్రం అపూర్వం. |
|||||||||||||||
జలపాత హిమపాత దృశ్యాలకే డబ్బులిచ్చేయచ్చు. | |||||||||||||||
మహిష్మతి కోట ఒకటి ఇంకో పరమాద్భుతం. నోళ్లు తెలియకుండానే తెరుచుకొంటాయి. "వావ్" అంటూ. | |||||||||||||||
ఇవన్నీ రాజమౌళి & టీం వర్క్స్ అయినా రాజమౌళిని బట్టే కదా టీం తయారవుత. | |||||||||||||||
అందరికీ హాట్సాఫ్. (నిజానికిది చిన్నపదం) | |||||||||||||||
నటీనటులు :- | |||||||||||||||
ప్రభాస్ రానాలు పోటీ పడ్డారు. | |||||||||||||||
అందం + అభినయం రెండూ
కావాలంటే మాత్రం శివగామిగా రమ్యకృష్ణ తప్ప మరొక ఛాయిస్ లేదు. |
|||||||||||||||
అనుష్క సంగతి రెండో పార్ట్ లో కానీ తెలీదు. | |||||||||||||||
తమన్నా అందంగా ఉంది తప్ప బలంగా లేదు. | |||||||||||||||
కట్టప్ప గా సత్యరాజ్ జీవించారు. ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్ర. | |||||||||||||||
నాజర్ కు కొట్టిన పిండి. | |||||||||||||||
ప్రభాకర్ నిజంగానే కాలకేయుడు. భయపెట్టాడు. | |||||||||||||||
కెమెరా | ఒకే మాట. అద్భుతం. | ||||||||||||||
ఆర్ట్ | ఇదీ ఒకే మాటలో - సినిమాకు ప్రాణం. | ||||||||||||||
సంగీతం | ఇంకా మనసుపెడితే బాగుండనిపిస్తుంది. | ||||||||||||||
మిగతా డిపార్ట్ మెంట్స్ | |||||||||||||||
అందరి కష్టం కనిపిస్తుంది. పచ్చబొట్టు పాటలో సెట్టింగ్స్ ఎంత చెప్పినా తక్కువే. |
|||||||||||||||
ముగింపు | |||||||||||||||
సినిమాను 3 భాగాలుగా తీస్తే బాగుండుననిపిస్తుంది. | |||||||||||||||
మొదటి ప్రభాస్ నాజర్ లది ఒక కథ గాను. | |||||||||||||||
అమరేంద్ర బాహుబలి రానాలది ఒక కథ గాను | |||||||||||||||
మహేంద్రబాహుబలి రానా
కొడుకులది ఒక కథ గానూ దేనికదే end అయ్యేలాగ తీసి ఉంటే సరిపోయేదేమో. |
|||||||||||||||
సెట్టింగ్స్ అవే కాబట్టి. ఇక వేరే ఖర్చు ఉండదు. కథ నడుపుకు పోవడమే. | |||||||||||||||
బాహుబలిని ధియేటర్ లోనే
చూడాలి. బాహుబలిని ధియేటర్ లోనే చూడండి. |
|||||||||||||||
చూసిన వారిని ఈ సినిమా వెంటాడుతుంది. | |||||||||||||||
మర్చిపోలేరు. | |||||||||||||||
ప్రభాస్ అభిమానిగా బాహుబలి-2 కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తూ......... | |||||||||||||||
సతతం(రావెమ్మెస్సారెల్) |
14, జులై 2015, మంగళవారం
" బాహుబలి " - " రాజమౌళి "
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
SUNDARAKANDA సుందరకాండ 36
రామసుందరం - షట్త్రింశస్సర్గః భూయ ఏవ మహాతేజా హనూమాన్మారుతాత్మజః | అబ్రవీత్ప్రశ్రితం వాక్యం సీతాప్రత్యయకారణాత్ || 1 || సీతక...
-
రామసుందరం - షట్త్రింశస్సర్గః భూయ ఏవ మహాతేజా హనూమాన్మారుతాత్మజః | అబ్రవీత్ప్రశ్రితం వాక్యం సీతాప్రత్యయకారణాత్ || 1 || సీతక...
-
తత్రావశ్యం వలయకులిశోద్ఘట్టనోద్గీర్ణతోయం నేష్యంతి త్వాం సురయువతయో యంత్రధారాగృహత్వం , తాభ్యో మోక్షస్తవ యది సఖే ఘర్మలబ్ధస్య న స్యాత్ క్రీడాలోల...
-
రామసుందరం 1-4 త్వమేషాం జాతవీర్యాణాం పునరేవోత్పతిష్యతాం | పాతళస్యాప్రమేయస్య ద్వారమావృత్య తిష్ఠసి || 93 || వీరులైన వా...