తస్మిన్కాలే నయనసలిలం యోషితాం ఖండితానాం
శాంతిం నేయం ప్రణయిభిరతో వర్త్మ భానోస్త్యజాశు,
ప్రాలేయాస్రం కమలవదనాత్సో౭పి హర్తుం నలిన్యాః
ప్రత్యావృత్తస్త్వయి కరరుధి స్యాదనల్పాభ్యసూయః.
భావం:
ఆ సూర్యోదయసమయం
( కొందఱు ) భర్తలు తమ సతుల కన్నీళ్లు తుడిచే సమయం.
( సతులెందుకు ఏడుస్తారంటే, మఱి రాత్రంతా తిరిగి తెల్లవారాక వస్తే ఏడవరా ? )
రాత్రంతా ఎక్కడ తిరిగారో తెలివైన మీకు తెలుపక్కరలేదు కదా!
అటువంటి సతులను ఖండితలు అంటారు. )
అలాగే సూర్యుడు ఉదయాన రాగానే,
ఖండిత లాంటి పద్మిని ( తామరపువ్వు )
మంచు అనే కన్నీటిని నింపుకొంటే,
ఆ కన్నీటిని తుడువడానికి సూర్యుడు,
కిరణాలు అనే కరాల్ని ( చేతుల్ని ) చాపుతూంటాడు.
అప్పుడు నీవు అడ్డం పోకు.
కోపం వస్తుంది.
అది నీకు మంచిది కాదు.
గంభీరాయాః పయసి సరిత శ్చేతసీవ ప్రసన్నే
ఛాయాత్మాపి ప్రకృతిసుభగో లప్స్యతే తే ప్రవేశం,
తస్మా దస్యాః కుముదవిశదా న్యర్హసి త్వం న ధైర్యా
న్మోఘీకర్తుం చటులశఫరోద్వర్తనప్రేక్షితాని.
భావం:
తర్వాత మనస్సులా నిర్మలమైన
గంభీర అనే నది కనబడుతుంది.
నీవు ఆ నదిని ఇష్టపడకపోయినా,
ఆ నది నీటిలో నీ ఛాయాశరీరమైనా ఉంది కాబట్టి,
ఆ నది నిన్ను మనసులో తలుస్తూనే ఉంటుంది.
అలా ఇష్టపడి, చేపల పొర్లిగింతలనే చూపులతో నిన్ను చూస్తుంది.
ఆ చూపులను నీ ధూర్తత్వంతో వ్యర్థం చేయకు.
తస్యాః కించి త్కరధృతమివ ప్రాప్తవానీరశాఖం
హృత్వా నీలం సలిలవసనం ముక్తరోధోనితంబం,
ప్రస్థానం తే కథమపి సఖే లంబమానస్య భావి
జ్ఞాతాస్వాదో వివృతజఘనాం కో విహాతుం సమర్థః.
భావం:
నీవు ఆ గంభీరానదీజలాలను గ్రోలితే,
నీకు మధురమైన అనుభవం కలుగుతుంది.
వెళ్లడానికి నీకు మనసు రాదు.
మంగళం మహత్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
SUNDARAKANDA సుందరకాండ 36
రామసుందరం - షట్త్రింశస్సర్గః భూయ ఏవ మహాతేజా హనూమాన్మారుతాత్మజః | అబ్రవీత్ప్రశ్రితం వాక్యం సీతాప్రత్యయకారణాత్ || 1 || సీతక...
-
రామసుందరం - షట్త్రింశస్సర్గః భూయ ఏవ మహాతేజా హనూమాన్మారుతాత్మజః | అబ్రవీత్ప్రశ్రితం వాక్యం సీతాప్రత్యయకారణాత్ || 1 || సీతక...
-
తత్రావశ్యం వలయకులిశోద్ఘట్టనోద్గీర్ణతోయం నేష్యంతి త్వాం సురయువతయో యంత్రధారాగృహత్వం , తాభ్యో మోక్షస్తవ యది సఖే ఘర్మలబ్ధస్య న స్యాత్ క్రీడాలోల...
-
రామసుందరం 1-4 త్వమేషాం జాతవీర్యాణాం పునరేవోత్పతిష్యతాం | పాతళస్యాప్రమేయస్య ద్వారమావృత్య తిష్ఠసి || 93 || వీరులైన వా...
రోజూ చదువుతున్నాను కానీనండీ, ఏమి వ్రాయాలో తెలియక ఊరకుంటున్నాను. కనీసం ఈరోజైనా "భాషకు చాలా సేవ చేస్తున్నారు, మీ కృషికి తగిన ఫలితం లభించుగాక" అని చెప్పాలని నిర్ణయించుకున్నానండీ. చాలా బాగుంది.
రిప్లయితొలగించండినమస్సులతో భవదీయుడు.
అలాగే సూర్యుడు ఉదయాన రాగానే,
రిప్లయితొలగించండిఖండిత లాంటి పద్మిని ( తామరపువ్వు )
మంచు అనే కన్నీటిని నింపుకొంటే,
ఆ కన్నీటిని తుడువడానికి సూర్యుడు,
కిరణాలు అనే కరాల్ని ( చేతుల్ని ) చాపుతూంటాడు.
అద్భుతమైన పోలిక.అందుకే ఆయన మహాకవి అయ్యాడు.ఈ కావ్యాన్ని తెలుగులో వివరించే ప్రయత్నం చేస్తున్నందుకు మీకు నా ధన్యవాదాలు