1, మే 2011, ఆదివారం

మేఘసందేశం 39 వ శ్లోకం

గచ్ఛంతీనాం రమణవసతిం యోషితాం తత్ర నక్తం
రుద్ధాలోకే నరపతిపథే సూచిభేద్యైస్తమోభిః,
సౌదామిన్యా కనకనికషస్నిగ్ధయా దర్శయోర్వీం
తోయోత్సర్గ స్తనితముఖరో మాస్మభూర్విక్లబా స్తాః.



భావం:


( మహాకాళేశ్వరుని సేవ పూర్తి అయిన తర్వాత తిరిగి నగరసంచారం.)



ఆ ఉజ్జయినిలో కటికచీకట్లో

రమణుల ఇంటికి పోతున్న స్త్రీలకు, ( అభిసారికలకు )

నీ మెఱపులతో దారి చూపు.

ఉఱమవద్దు.

వర్షింపనూ వద్దు.

ఉఱిమినా వర్షించినా

పాపం ఆ యువతులు భయపడతారు.


మంగళం మహత్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sundarakanda సుందరకాండ 38

  రామసుందరం – అష్టత్రింశస్సర్గః తతః స కపిశార్దూల స్తేన వాక్యేన హర్షితః | సీతా మువాచ తచ్ఛ్రుత్వా వాక్యం వాక్యవిశారదః || 1 పిదప , వాక్యవ...