17, మే 2011, మంగళవారం

మేఘసందేశం 55 వ శ్లోకం

తం చేద్వాయౌ సరతి సరళస్కంధసంఘట్టజన్మా
బాధేతోల్కాక్షపితచమరీవాలభారో దవాగ్నిః,
అర్హస్యేనం శమయితుమలం వారిధారాసహస్రైః
రాపన్నార్తిప్రశమనఫలాః సంపదో హ్యుత్తమానాం.


భావం:


గాలివల్ల దేవదారువృక్షాల బోదెలు ఒరుసుకొని దావాగ్ని పుట్టి,

దాని నిప్పురవ్వలు చమరీమృగాల తోకవెంట్రుకలను కాల్చి,

హిమవత్పర్వతాన్ని బాధించెనేని,

వేలజలధారలతో ఆ దావాగ్నిని, చల్లార్చు.

ఆపన్నుల ( ఆపదనొందినవారి ) కష్టాన్ని తీర్చడమే కదా!

ఉత్తముల సంపదలకు ఉన్న ఫలం.



వివరణ :


ఉత్తములు, ఉపకర్తలు, సజ్జనులు, పరోపకారులు, మహాత్ములు, బుధులు

వీరివద్ద సంపద ఉంటే దాన్ని తిరిగి

అవసరమై, అడిగినవారికోసమే ఉపయోగిస్తారు.

తమకోసం దాచుకోరు.

అర్థించకపోయినా అవసరం తెలుసుకొని మరీ సహాయం చేస్తారు.



"కమలాలు అడిగాయనే సూర్యుడు వాటిని వికసింపజేస్తున్నాడా!

కలువలు ప్రార్థించాకే చంద్రుడు వాటికి సంతోషం కలిగిస్తున్నాడా!" అంటాడు భర్తృహరి.



పరోపకారాయ ఫలంతి వృక్షాః

పరోపకారాయ వహంతి నద్యః,

పరోపకారాయ చరంతి గావః

పరోపకారార్థ మిదం శరీరం.



మంగళం మహత్

1 కామెంట్‌:

Sundarakanda సుందరకాండ 35

                                     రామసుందరం పఞ్చత్రింశస్సర్గః తాం తు రామకథాం శ్రుత్వా వైదేహీ వానరర్షభాత్‌ । ఉవాచ వచనం సాంత్వ మిద...