26, మే 2014, సోమవారం

soundarya lahari - 5

జగన్మాతవైభవం-5
సౌందర్యలహరి

9


అంబా!
నీవు,
మూలాధారంలోని పృథివీతత్త్వాన్ని,
మణిపూరంలోని ఉదకతత్త్వాన్ని,
స్వాధిష్ఠానంలోని అగ్నితత్త్వాన్ని,
అనాహతంలోని వాయుతత్త్వాన్ని,
విశుద్ధంలోని ఆకాశతత్త్వాన్ని,
ఆజ్ఞాచక్రంలోని మనస్తత్త్వాన్ని వీడి,
సుషుమ్నామార్గాన్ని ఛేదించి,
సహస్రారకమలంలో నీపతి సదాశివునితో కూడి,
రహస్యంగా విహరిస్తున్నావు.

(కుండలిని అనబడే భారతీయయోగసాధన ఇందులో ప్రస్తావించబడింది.

కుండలిని చక్రాల గుఱించి క్రింది లింక్ లో చూడండి.
http://te.wikipedia.org/wiki/కుండలిని

కుండలిని యోగసాధనలో
శక్తి జాగృతమై,
మూలాధారంలోని భూతత్త్వాన్ని ఛేదించి,
అలా వరుసగా పైన భావంలో చెప్పినట్లు
అన్ని చక్రాలలోని తత్త్వాలను ఛేదించి,
చివరగా సహస్రారంలో శివునిచేరి, ఐక్యమవుతుంది.)

10


తల్లీ! సహస్రారాన్ని చేరిన తర్వాత
నీ పాదాలనుండి స్రవించు సుధాధారలతో
ప్రపంచాన్ని తడుపుతూ,
సహస్రారాన్ని వీడి,
మరల భూతత్త్వానికి చెందిన ఆధారచక్రాన్ని చేరి,
అందులో నీస్వరూపాన్ని
సర్పంలా కుండలాకారంగా చేసి,
తామరదుద్దు మధ్యలో సన్నని రంధ్రంలాంటి
మిక్కిలి సూక్ష్మమైన
సుషుమ్నామార్గపు క్రింద గల ఆధారచక్రం క్రింద
కుండలినీశక్తివై నిద్రిస్తావు.


మంగళం మహత్

Sundarakanda సుందరకాండ 35

                                     రామసుందరం పఞ్చత్రింశస్సర్గః తాం తు రామకథాం శ్రుత్వా వైదేహీ వానరర్షభాత్‌ । ఉవాచ వచనం సాంత్వ మిద...