18, డిసెంబర్ 2011, ఆదివారం

మేఘసందేశం 63 వ శ్లోకం

తత్రావశ్యం వలయకులిశోద్ఘట్టనోద్గీర్ణతోయం
నేష్యంతి త్వాం సురయువతయో యంత్రధారాగృహత్వం ,
తాభ్యో మోక్షస్తవ యది సఖే ఘర్మలబ్ధస్య న స్యాత్
క్రీడాలోలాః శ్రవణపరుషైర్గర్జితైర్భాయయేస్తాః .



భావం :


ఓ మిత్రుడా!

ఆ కైలాసమందు, వేల్పుటింతులు ( సురయువతులు )

నిన్ను తమ కంకణాల అంచులతో ఒత్తి, నిశ్చయంగా నీ నీటిని పిండుతారు.

ఈ ఎండాకాలంలో వారికి నీవు దొరికినందువల్ల

( నీ నీటి ఆటల్ని మరిగి )

వారు నిన్ను విడువరు.

అప్పుడు క్రీడాలోలురైన ఆ వేల్పుచేడియలను

వినడానికి కఠినాలైన నీ ఉఱుములతో భయపెట్టి, తప్పించుకొనిపో.




వివరణ :



చాల మనోహరమైన భావం కదూ!

మేఘానికి సంబంధించి ఎన్ని ఆలోచనలు చేయాలో అన్నీ చేశాడు కాళిదాసు.


యువతులు కాబట్టి కొంటెపనులు.


ఎండాకాలంలో నీటి ఆటలు అందరికీ ఇష్టమేగా!


కృత్రిమంగా నీటిధారల్ని సృష్టించి ఆనందించడం ఆ కాలంలో ఉందని తెలుస్తుంది.





చిన్న మనవి :

మేఘసందేశాన్ని
తెలుగులో అందించే గొప్ప సాహసాన్ని చేస్తున్నాను.
ఏవైనా తప్పులుంటే పండితులు తెలుప ప్రార్థన.
నేను, కాళిదాసును అర్థం చేసుకోవడంలో లోపాలేవైనా ఉంటే
నాకు తెలియజేస్తే దిద్దుకోగలవాడను.







మంగళం మహత్

2 కామెంట్‌లు:

  1. MIRU CHESTUNNA KRUSHIKI NENU MIKU ELA CHEPPALO TELIKA NA BLOG LO.. MI BLOG FAVORITE BLOG GA ADD CHESANU..
    http://rajachandraphotos.blogspot.in/

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీ రాజాచంద్రగారూ!
      మీ సరసకవితాహృదయానికి నా జోహర్లు.
      నా మేఘసందేశాన్ని మీ బ్లాగ్ లో ఆడ్ చేసుకోవడం మీ సహృదయానికి చిహ్నం.
      మీకు నా హృదయపూర్వక కృతాభివందనాలు.
      మీ బ్లాగ్ నేను ఫాలో అవుతూంటాను.
      ఫోటోలు చూసి , ఆనందిస్తూంటాను.

      మీ కృషి అభినందనీయం.
      రావెమ్మెస్సారెల్

      ఈ బ్లాగ్ చూసి, మీ అభిప్రాయం తెలుపండి.

      http://www.nagaswaram.blogspot.com

      తొలగించండి

Sundarakanda సుందరకాండ 35

                                     రామసుందరం పఞ్చత్రింశస్సర్గః తాం తు రామకథాం శ్రుత్వా వైదేహీ వానరర్షభాత్‌ । ఉవాచ వచనం సాంత్వ మిద...