ఉత్పశ్యామి త్వయి తటగతే స్నిగ్ధభిన్నాంజనాభే
సద్యః కృత్తద్విరదరదనచ్ఛేదగౌరస్య తస్య ,
శోభా మద్రేః స్తిమితనయనప్రేక్షణీయాం భవిత్రీ
మంసన్యస్తే సతి హలభృతో మేచకే వాససీవ .
భావం :
ఏనుగుదంతంలా తెల్లగా ఉన్న ఆ కైలాసపర్వతసానువు మీద
నున్నగా నూఱబడిన కాటుకకాంతి లాంటి కాంతి కలిగిన నీవు నిలిచితివేని
బలరాముడు తన భుజం మీద నల్లని పట్టువస్త్రం ధరిస్తే, ఎలా ఉంటుందో
అలా చూసేవారికి కన్నుల పండువులా ఉంటావు.
హిత్వా తస్మి౯ భుజగవలయం శంభునా దత్తహస్తా
క్రీడాశైలే యది చ విహరేత్పాదచారేణ గౌరీ ,
భంగీ భక్త్యా విరచితవపుః స్తంభితాంతర్జలౌఘః
సోపానత్వం కురు మణితటారోహణాయాగ్రయాయీ .
భావం:
ఆ కైలాసాన
శివుడు పార్వతీదేవితో కలసి కాలినడకన విహరిస్తూంటే,
అప్పుడు ముందుగా పోయి,
నీ శరీరాన్ని స్తంభింపచేసుకొని, ( ఘనీభవించి )
ఆ జగన్మాత రత్నాలగట్లను ఎక్కబోయేటప్పుడు
మెట్లవరుసగా ఏర్పడు.
ఆ విధంగా అమ్మవారి అనుగ్రహానికి పాత్రుడవై కృతార్థుడవగుదువు.
వివరణ : విశేషాలు :
శివుడు నాగకంకణాన్ని విడచి, గౌరీదేవి చేయి పట్టుకొంటాడని
కవి వర్ణన.
దానికి కారణం పామును చూసి, ఆవిడ భయపడుతుందని
వ్యాఖ్యాత వివరణ.
మేఘుని శరీరంలో నీటిప్రవాహాన్ని ఘనీభవింపచేసుకోమంటున్నాడు.
తల్లిదండ్రుల విహారాన్ని చూడడం దోషం.
అందువల్ల వారు విహరిస్తున్నారు అని
తెలియగానే అక్కడే నిలబడక
ముందుగా పోయి,
వినమ్రుడవై మెట్లవరుసగా మారితే
నేల మీద మాత్రమే చూపు ఉంటుంది (క్రింది చూపు)
కాన దోషప్రాప్తి ఉండదని,
పైగా అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చని సూచన.
ఇక్కడో విశేషం ఉంది.
మనస్తత్త్వం ప్రకారం
స్త్రీ తన భర్తతో ఉన్నప్పుడు పూర్తి ఏకాంతాన్ని కోరుకొంటుంది.
అందుకు విరుద్ధమైతే ఆగ్రహిస్తుంది.
ఇంతకుముందు శివపార్వతుల ఏకాంత సమయంలోనే
( ఇంద్రుడు పంపగా ) అగ్ని వస్తాడు.
అప్పుడు పార్వతి శివుని నుండి దూరమయ్యి, దుఃఖించి, కోపించి,
క్రిందపడ్డ శివుని వీర్యాన్ని భరించమని శపిస్తుంది.
ఆ వీర్యాన్ని గర్భంలో ధరించిన అగ్ని దాన్ని భరించలేక
గంగకు ఇస్తాడు. ఆవిడ కూడా భరించలేక రెల్లుగడ్డి మీదకు త్రోయగా
శరవణభవుడు జన్మిస్తాడు.
అందువల్ల ఎందుకొచ్చిన గొడవని
మేఘుని యక్షుడు వినమ్రుడవై ఉండమన్నాడు.
అందువల్ల తల్లికి కోపం రాదని, అనుగ్రహిస్తుందని సెలవిస్తున్నాడు.
మంగళం మహత్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
SUNDARAKANDA సుందరకాండ 36
రామసుందరం - షట్త్రింశస్సర్గః భూయ ఏవ మహాతేజా హనూమాన్మారుతాత్మజః | అబ్రవీత్ప్రశ్రితం వాక్యం సీతాప్రత్యయకారణాత్ || 1 || సీతక...
-
రామసుందరం - షట్త్రింశస్సర్గః భూయ ఏవ మహాతేజా హనూమాన్మారుతాత్మజః | అబ్రవీత్ప్రశ్రితం వాక్యం సీతాప్రత్యయకారణాత్ || 1 || సీతక...
-
తత్రావశ్యం వలయకులిశోద్ఘట్టనోద్గీర్ణతోయం నేష్యంతి త్వాం సురయువతయో యంత్రధారాగృహత్వం , తాభ్యో మోక్షస్తవ యది సఖే ఘర్మలబ్ధస్య న స్యాత్ క్రీడాలోల...
-
రామసుందరం 1-4 త్వమేషాం జాతవీర్యాణాం పునరేవోత్పతిష్యతాం | పాతళస్యాప్రమేయస్య ద్వారమావృత్య తిష్ఠసి || 93 || వీరులైన వా...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి