14, మే 2014, బుధవారం

soundarya lahari - 2

జగన్మాతవైభవం-2
సౌందర్యలహరి
3

భావం: నీ పాదరేణువు
         
        అజ్ఞానం అనే చీకటికి సూర్యుడు. (ధర్మం)

        జడులకు జ్ఞానం అనే మకరందం. (అర్థం)

        దరిద్రులకు కోరిన కోరికలను తీర్చే చింతామణి. (కామం)

        సంసారులకు ఆదివరాహస్వామి కోఱ. (మోక్షం)

        నీపాదరేణువు త్రిమూర్తులకే కాదు. సర్వులకూ దిక్కు.

(అజ్ఞానం అంటే అవిద్య. తెలుసుకోవలసినదాన్ని ఎఱుగకపోవడమే అవిద్య. 
(దేన్ని తెలుసుకోవాలి? పరమాత్మను.)

తెలుసుకోవడమే జ్ఞానం.

జడులంటే ఏ ప్రయత్నాలూ చేయనివారు.
ఏదో ఒక ఆశ పెడ్తేగానీ ప్రయత్నం చేయనివారికి మకరందం లాంటిది అని చెప్పాలి మఱి.

ధనం లేనివాడే దరిద్రుడని లోకంలో వాడుక.
కాదు, కోరుకొనే ప్రతివాడూ దరిద్రుడే. 
కోరికలు లేనివాడే భాగ్యవంతుడు.
అయినా లోకవ్యవహారం సాగాలి కాబట్టి 
అమ్మ పాదరేణువు చింతామణిలా కోరిన కోరికలను తీరుస్తుంది.

ఆదివరాహస్వామి తన కోఱతో సముద్రంలో మునిగిన భూమిని ఎత్తి కాపాడాడు.
అలాగే సంసారజలధిలో మునిగిపోయేవార్ని 
అమ్మవారి పాదరేణువు వరాహస్వామికోఱలాగ కాపాడుతుంది.


4

భావం: ఇంద్రాదిదేవతాగణాలు అభయవరదముద్రలను ధరిస్తారు.

         నీవు మాత్రం అలా హస్తాల్లో అభయవరదముద్రలను ధరించవు.

         ఎందుకంటే నీ పాదాలే అభయాన్ని, వరాలను ఇవ్వగల సామర్థ్యం కలవి.


(అమ్మవారి పాదమహిమ ఇంకా ఈ శ్లోకంలో కూడా వర్ణింపబడుతోంది.

వ్రేళ్లు పైకి ఉండేలా అరచెయ్యిని పైకి ఎత్తిపట్టడాన్ని అభయముద్ర అంటారు.
భయం లేకుండా చేస్తాను అని చెప్పడం.

వ్రేళ్లు క్రిందికి ఉండేలా అరచెయ్యిని ఉంచడం వరదముద్ర అంటారు.
కోరినవి ఇస్తాను అని అర్థం.

అమ్మవారి పాదాలే ఈ రెండు పనులూ చేయగలవు కాబట్టి
తల్లికి అభయవరదముద్రలను వెల్లడించే అవసరం లేదు.
తల్లి పాదాలే సర్వులకూ శరణ్యం.)


మంగళం మహత్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

SUNDARAKANDA సుందరకాండ 36

  రామసుందరం - షట్త్రింశస్సర్గః   భూయ ఏవ మహాతేజా హనూమాన్మారుతాత్మజః | అబ్రవీత్ప్రశ్రితం వాక్యం సీతాప్రత్యయకారణాత్ || 1 || సీతక...