జగన్మాతవైభవం-3
సౌందర్యలహరి
సౌందర్యలహరి
5
పూర్వం నిన్ను శ్రీహరి ఆరాధించి,
స్త్రీయై,
శివునికి సైతం కామవికారం కల్గించాడు.
మన్మథుడు నిన్ను ఉపాసించి,
జితేంద్రియులకు కూడా కామాభిలాష కల్గించడానికి సమర్థుడయ్యాడు.
నీ ప్రసాదగరిమ (గరిమ=గొప్పదనం) అద్భుతం.
(అమ్మను ఆరాధిస్తే ఎటువంటి కోరికైనా తీరుతుంది.
విష్ణువును మన్మథుడును తండ్రీకొడుకులు.
కొడుకు శివుని తపస్సు భంగంచేయడానికి ప్రయత్నించి, శరీరం లేనివాడయ్యాడు.
తర్వాత ఆయన సతి రతి అమ్మను ప్రార్థించగా, ఆమె అనుగ్రహంవల్ల అమెకు మాత్రం కనిపించే వరం పొందాడు.
శరీరం లేకపోయినా అందఱిలో కామాసక్తి కల్గించే అద్భుతశక్తి అమ్మవారిదయవల్లే వచ్చింది.
తనకొడుకును అలా చేసినందుకు హరి,
శివునికి కాసేపు కామవికారం ఎలా ఉంటుందో చూపించాడు.-ఒక తమాషా భావన.)
6
పూవిల్లు,
తుమ్మెదల అల్లెత్రాడు,
అయిదే అయిదు బాణాలు,
జడుడైన వసంతుడు చెలికాడు,
మలయమారుతం రథం,
ఇలా ఉపయోగరహితపరికరాలు కల్గిన మన్మథుడు,
శరీరం లేనివాడయినప్పటికీ,
నిన్నారాధించి,
నీ కడగంటి చూపుచేత,
చెప్పలేనంత నీ దయను పొంది,
ఈ జగత్తును జయిస్తున్నాడు.
(పువ్వులతో చేసిన విల్లు, దానికి త్రాడు తుమ్మెదలు, బాణాలు అయిదు,
రెండునెలలుండే వసంతుడు సామంతుడు,
మలయమారుతం వాహనం.
నిజానికి సమరానికి ఇవేమీ పనికిరావు.
కానీ పర్వతపుత్రిక దయ ఉంటే కానిదేముంది?
అమ్మ కొండంత అండ.
కనీస శక్తిసామర్థ్యాలు లేనివాళ్లు కూడా అమ్మదయవల్ల జగత్తును జయిస్తారు.
అంతరార్థం: మరుని కోదండం = మనస్సు
తుమ్మెదలు = ఇంద్రియాలు గ్రహించిన విషయాలను మనస్సుకు అందించే నాడులు.
బాణాలు = అరవిందం, అశోకం, చూతం, వనమల్లిక, నీలోత్పలం,
[మోహనం, ఉన్మాదం, సంతాపం, శోషణం, నిశ్చేష్టాకరణం (మన్మథావస్థలు)]
వసంతుడు = ప్రకృతి
మలయమారుతం = [సుగంధం, స్పర్శ, మత్తు మొదలైన] ఆకర్షణ
మంగళం మహత్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి