21, జూన్ 2020, ఆదివారం

Sundarakanda సుందరకాండ 34


రామసుందరం - చతుస్త్రింశస్సర్గః
 
తస్యా స్తద్వచనం శ్రుత్వా హనుమాన్హరియూథపః
దుఃఖా ద్దుఃఖాభిభూతాయా స్సాంత్వ ముత్తర మబ్రవీత్‌ ॥ 1
వానరయూథపుడు హనుమంతుఁడు, ఏడ్పు మీద ఏడ్పుతో కుములుతున్న సీత మాటలు విని, ఆమెను ఊఱడిస్తూ, ఇలా అన్నాడు.
అహం రామస్య సందేశా ద్దేవి దూత స్తవాగతః ।
వైదేహి కుశలీ రామ స్త్వాం కౌశల మబ్రవీత్‌ ॥ 2
వైదేహీ!, నేను, రాముని సందేశంతో, దూతనై, నీదగ్గరకు చ్చాను. రాముడు, క్షేమంగా ఉన్నానని చెప్పమన్నాడు. నీ కుశలం అడిగాడు.
యో బ్రాహ్మ మస్త్రం వేదాం శ్చ వేద వేదవిదాం వరః
స త్వాం దాశరథీ రామో దేవి కౌశల మబ్రవీత్‌ ॥ 3
బ్రహ్మాస్త్రాన్ని, వేదాల్ని, ఎఱిగిన శ్రేష్ఠవేదవేత్త, దాశరథి, రాముఁడు, నీ క్షేమాన్ని, అడిగాడు.
లక్ష్మణ శ్చ మహాతేజా భర్తు స్తేనుచరః ప్రియః ।
కృతవాన్‌ శోకసంతప్త శ్శిరసా తేభివాదనమ్‌ ॥ 4
నీ భర్త రామునకు, ప్రియుడు, అనుచరుడు, మహాతేజస్వి, లక్ష్మణుఁడు, శోకసంతప్తుడై, శిరస్సు వంచి, నీకు, నమస్కరించాడు.”
సా తయోః కుశలం దేవీ నిశమ్య నరసింహయోః ।
ప్రీతిసంహృష్టసర్వాంగీ హనూమంత మథాబ్రవీత్‌ ॥ 5
పురుషశ్రేష్ఠులైన రామలక్ష్మణులక్షేమాన్ని విని, దేహమంతా పుకించగా, సీత, హనుమంతునితో, ఇలా అంది.
కళ్యాణీ బత గాథేయం లౌకికీ ప్రతిభాతి మా
ఏతి జీవంత మానందో నరం వర్షశతా దపి ॥ 6
మానవుడు బ్రతికుంటే నూఱుసంవత్సరాలకైనా ఆనందం కల్గుతుంది.నే లౌకికగాథ శుభమైంది, సత్యమైందిగా, తోస్తోంది.
యా సమాగతే తస్మిన్‌ ప్రీతిరుత్పాదితాద్భుతా
పరస్పరేణ చాలాపం విశ్వస్తౌ తౌ ప్రచక్రతుః ॥ 7
రాముని వద్దనుండి వచ్చిన హనుమంతునిపై, సీతకు, అద్భుతమైన ప్రీతి కల్గింది. సీత, హనుమంతుఁడు, పరస్పరం మ్మిక కల్గి, ముచ్చటించుకొన్నారు.
తస్యా స్త ద్వచనం శ్రుత్వా హనుమాన్హరియూథపః
సీతాయా శ్శోదీనాయా స్సమీప ముపచక్రమే ॥ 8
వానరయూథపుడు హనుమంతుఁడు, శోకదీనయైన సీత చెప్పిన మాటలు విని, మెల్లగా, ఆమె సమీపానికి, రాసాగాడు.
యథా యథా సమీపం స హనుమా నుపసర్పతి ।
తథా తథా రావణం సా తం సీతా పరిశంకతే ॥ 9
ఆ హనుమంతుడు, దగ్గఱకు వస్తున్నకొద్దీ, సీత, రావణుఁడే వానరవేషం వేసికొని వచ్చాడేమో, అని సందేహపడింది.
అహో ధి గ్దుష్కృత మిదం కథితం హి యదస్య మే
రూపాంతర ముపాగమ్య స వాయం హి రావణః ॥ 10
అయ్యో! ధిక్!, ఇతని దుట, అనుచితంగా ఏమేమో చెప్పానే. రావణుఁడే, ఇలా వానరరూపం ధరించి, వచ్చాడు. అని శంకించి,
తా మశోకస్య శాఖాం సా విముక్త్వా శోకకర్శితా ।
తస్యా మే వానవద్యాంగీ ధరణ్యాం సముపావిశత్‌ 11
దుఃఖంచేత కృశించిసర్వాంగసుందరి సీత, శోకవృక్షం కొమ్మను విడిచి, దాని క్రింది నేలపై కూర్చొంది.
హనుమా నపి దుఃఖార్తాం తాం దృష్ట్వా భయమోహితామ్‌ ।
అవందత మహాబాహు స్తత స్తాం జనకాత్మజామ్‌ ।
సా చైనం భయవిత్రస్తా భూయో నైవాభ్యుదైక్షత ॥ 12
మహాబాహుడు హనుమంతుడు, దుఃఖితయై, యంతో తనను చూసి సంశయిస్తున్న, సీతకు నమస్కరించాడు. ఆమెయపడి,హనుమంతుని మళ్లీ కన్నెత్తి చూడలేదు.
తం దృష్ట్వా వందమానం తు సీతా శశినిభాననా ।
అబ్రవీ ద్దీర్ఘ ముచ్ఛ్వస్య వానరం మధురస్వరా ॥ 13
చంద్రముఖి సీత, దీర్ఘంగా నిట్టూరుస్తూ, ధురస్వరంతో, తనకు నమస్కారం చేస్తున్న హనుమంతునితో ఇలా అంది.
మాయాం ప్రవిష్టో మాయావీ యది త్వం రావణ స్స్వయమ్‌ ।
ఉత్పాదయసి మే భూయ స్సంతాపం త న్నశోభనమ్‌ ॥ 14
“నీవు, మాయావి రావణుఁడవే అయితే,ప్పుడిలా మాయచే వానరరూపం ధరించి వచ్చి, నన్ను,ళ్లీ దుఃఖపెట్టడం, ఎంతమాత్రం మంచిది కాదు.
స్వం పరిత్యజ్య రూపం యః పరివ్రాజకరూపధృత్
జనస్థానే మయా దృష్ట స్త్వం స ఏవాసి రావణః ॥ 15
నిజరూపం విడిచి, సన్న్యాసిరూపం ధరించి, జనస్థానంలో నా ద్దకు వచ్చిన ఆ రావణుఁడవే నీవు.
ఉపవాసకృశాం దీనాం కామరూప నిశాచర ।
సంతాపయసి మాం భూయ స్సంతప్తాం త న్నశోభనమ్‌ ॥ 16
చ్ఛ వచ్చిన రూపం ధరించగల రావణాసురా!, ఉపవాసాలతో కృశించిన దీనను, దుఃఖితురాలను, ఇదివఱకే సంతాపం పొందినదాన్ని, నన్ను, ళ్లీ బాధపెట్టడం మంచిది కాదు.
అథవా నైత దేవం హి య న్మయా పరిశంకితమ్‌
మనసో హి మమ ప్రీతి రుత్పన్నా తవ దర్శనాత్‌ ॥ 17
లేక, నేనిప్పుడు సందేహించింది సరికాదేమో, ఎందుకంటే, నిన్ను చూస్తుంటే, నా మనసుకు, సంతోషం కలుగుతోంది
యది రామస్య దూత స్త్వ మాగతో భద్ర మస్తు తే
పృచ్ఛామి త్వాం హరిశ్రేష్ఠ ప్రియా రామకథా హి మే ॥ 18
నీవు, రాముని దూతగా రావడం నిజమైతే, నీకు, భద్రమగు గాక! వానర శ్రేష్ఠుడా! రామక నాకు ప్రియం. కాబట్టి నిన్ను అడుగుతున్నాను.
గుణాన్ రామస్య కథయ ప్రియస్య మమ వానర ।
చిత్తం హరసి మే సౌమ్య నదీకూలం యథా రయః ॥ 19
సౌమ్యుడవైన వానరుడా!, ప్రియరాముని గుణాల్ని, నాకు చెప్పు. నీళ్ల వేగం, ఏటిగట్టులా, నా మనసును, నీవు, ఆకర్షిస్తున్నావు.
అహో స్వప్నస్య సుఖతా యాహ మేవం చిరాహృతా
ప్రేషితం నామ పశ్యామి రాఘవేణ వనౌకసమ్‌ ॥ 20
బహుకాలంగా రాముని విడిచి, దుఃఖిస్తున్న నేనిప్పుడు, కలలో, రాముఁడు పంపినవారిని, చూశాను. కాబట్టి. కలలో కల్గిన సుఖం, ఇంత అని చెప్ప, తరం కాదు.
స్వప్నేపి యద్యహం వీరం రాఘవం సహలక్ష్మణమ్‌
పశ్యేయం నావసీదేయం స్వప్నోఽపి మమ మత్సరీ 21
ఇలా, కలలోనైనా, వీరుడు రాముఁడు,క్ష్మణుఁడు కనబడితే, నా దుఃఖం పోయి, నేను వినాశాన్ని పొందను. అయితే స్వప్నానికి కూడా, నామీద కోపం ఉంది.
నాహం స్వప్న మిమం మన్యే స్వప్నే దృష్ట్వా హి వానరమ్‌
న శక్యోభ్యుదయః ప్రాప్తుం ప్రాప్త శ్చాభ్యుదయో మమ ॥ 22
నా కిది, కలగా, తోచటం లేదు. ఎందుకంటే, స్వప్నంలో కోతిని చూస్తే, సంతోషం కల్గదు. కానీ, నాకిప్పుడు సంతోషం కల్గింది.
కిన్ను స్యా చ్చిత్తమోహోయం భవే ద్వాతగతి స్త్వియమ్‌ ।
ఉన్మాదజో వికారో వా స్యా దియం మృగతృష్ణికా 23
నా దేమైనా చిత్తభ్రాంతా? లేక వాతప్రకోపమా? లేదా ఉన్మాదవికారంతో ఇలా కనుపడుతోందా? లేక ఎండమావా?
అథవా నాయ మున్మాదో మోహోప్యున్మాదలక్షణః
సంబుధ్యే చాహ మాత్మాన మిమం చాపి వనౌకసమ్‌ 24
అయినా, ఇది ఉన్మాదం కాదు. ఉన్మాదంలాంటి మోహం కూడా కాదు. ఎందుకంటే, నేను, నన్ను,వానరుని కూడా చక్కగా గుర్తిస్తున్నాను కదా!.
ఇత్యేవం బహుధా సీతా సంప్రధార్య బలాబలమ్‌ ।
రక్షసాం కామరూపత్వా న్మేనే తం రాక్షసాధిపమ్‌ ॥ 25
ఇలా సీత, అనేక విధాలా, మోహాదులా, రావణుడా అనే విషయంలో, బలాబలాలు బాగా పర్యాలోచించి, మరల, రాక్షసులు కామరూపులని తలచి, హనుమంతుని, రావణునిగానే భావించింది.
తాం బుద్ధిం తదా కృత్వా సీతా సా తనుమధ్యమా ।
న ప్రతివ్యాజహారాథ వానరం జనకాత్మజా ॥ 26
అప్పుడు, తనుమధ్యమ, జనకాత్మజ, సీత ప్రకారం తలచి, హనుమంతునితో ఏమీ మాట్లాడక ఊఱకుంది.
సీతాయా శ్చింతితం బుద్ధ్వా హనుమా న్మారుతాత్మజః
శ్రోత్రానుకూలై ర్వచనై స్తదా తాం సంప్రహర్షయత్‌ 27
మారుతాత్మాజుడు, హనుమంతుడు సీతమనస్సులోని సంశయాన్ని ఎఱిగి, వీనులవిందైన మాటలతో ఆమెకు సంతోషాన్ని కల్గించాడు.
ఆదిత్య ఇవ తేజస్వీ లోకకాంత శ్శశీ యథా
రాజా సర్వస్య లోకస్య దేవో వైశ్రవణో యథా ॥ 28
“రాముఁడు సూర్యునిలా తేజస్వి. చంద్రునిలా లోకానికంతా మనోహరుఁడు. కుబేరుఁనిలా సర్వలోకాలకు రాజు.
విక్రమే ణోపపన్న శ్చ యథా విష్ణు ర్మహాయశాః ।
సత్యవాదీ మధురవాగ్దేవో వాచస్పతి ర్యథా ॥ 29
రూపవాన్‌ సుభగ శ్శ్రీమాన్‌ కందర్ప ఇవ మూర్తిమాన్‌
స్థానక్రోధః ప్రహర్తా చ శ్రేష్ఠో లోకే మహారథః
బాహుచ్ఛాయా మవష్టబ్ధో యస్య లోకో మహాత్మనః ॥ 30
అపకృ ష్యాశ్రమపదా న్మృగరూపేణ రాఘవమ్‌ ।
శూన్యే యే నాపనీతాసి తస్య ద్రక్ష్యసి యత్ఫలమ్‌ ॥ 31
మహావిష్ణువులా పరాక్రమశాలి. మహాయశుడు. బృహస్పతిలా సత్యవాది. మధురంగా  మాట్లాడేవాడు. రూపవంతుడు. రమణీయుడు. శ్రీమంతుడు. ఆకారం ధరించిన మన్మథుడు. రాముడు యుక్తవిషయాల్లోమాత్రమే కోపిస్తాడు. కోపించిన ప్రహరించగలడు. అతడు లోకంలో అందఱికంటే ఉత్తముఁడు. మహారథుడు. లోకమంతా ఏ మహాత్ముని బాహుచ్ఛాయను ఆశ్రయించి ఉందో, లాంటి రాముని, మాయతో,శ్రమపదంనుండి అవతలికి పోనిచ్చి, అతడు లేనప్పుడు, నిన్ను,పహరించి తెచ్చిన, రావణునకు, కల్గే ఫలాన్ని చూస్తావు.
చిరా ద్రావణం సంఖ్యే యో వధిష్యతి వీర్యవాన్‌
రోష ప్రముక్తై రిషుభి ర్జ్వలద్భిరివ పావకైః ।
తే నాహం ప్రేషితో దూత స్త్వత్సకాశ మిహాగతః ॥ 32
ఇక, అచిరకాలంలోనే, యుద్ధంలో, నిప్పుల్లా క్రాలే బాణాలతో, రావణుని చంపే, వీర్యవంతుడు రాముడు పంపగా, దూతనై నీ ద్దకు వచ్చాను.
త్వద్వియోగేన దుఃఖార్త స్స త్వాం కౌశల మబ్రవీత్‌ 33
నీవు లేకపోవడంతో, దుఖంతో పరితపిస్తూండే, రాముఁడు, నీ కుశలం అడుగుతున్నాడు.
లక్ష్మణ శ్చ మహాతేజా స్సుమిత్రానందవర్ధనః
అభివాద్య మహాబాహు స్స త్వాం కౌశల మబ్రవీత్‌ 34
మహాతేజస్వి  మహాబాహుడు సుమిత్రానందవర్ధనుడు లక్ష్మణుడు, నీకు, మస్కరించి, నీ కుశలం అడిగాడు.
రామస్య చ సఖా దేవి సుగ్రీవో నామ వానరః
రాజా వానరముఖ్యానాం స త్వాం కౌశల మబ్రవీత్‌ 35
సీతాదేవీ! రాముని సఖుడు, వానరులకందఱకు ప్రభువు, సుగ్రీవుడనే వానరుడు నీ క్షేమాన్ని అడుగుతున్నాడు.
నిత్యం స్మరతి రామ స్త్వాం ససుగ్రీవ స్సలక్ష్మణః ॥ 36
రాముఁడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు, ఎల్లప్పుడూ నిన్నే తలఁచుకొంటున్నారు.
దిష్ట్యా జీవసి వైదేహి రాక్షసీవశ మాగతా ।
న చిరా ద్ద్రక్ష్యసే రామం లక్ష్మణం చ మహాబలం
మధ్యే వానరకోటీనాం సుగ్రీవం చామితౌజసమ్‌ ॥ 37
వైదేహీ! నీ విలా, రాక్షసస్త్రీల చేతుల్లో చిక్కి కూడా భాగ్యవశంతో జీవించి ఉన్నావు. నీవు, శీఘ్రంగానే రాముని, మహాబలుడు లక్ష్మణుని, ఎన్నో కోట్ల వానరులమధ్య అమితౌజసుడు సుగ్రీవుని, చూస్తావు.
అహం సుగ్రీవసచివో హనుమా న్నామ వానరః ।
ప్రవిష్టో నగరీం లంకాం లంఘయిత్వా మహోదధిమ్‌ ॥ 38
కృత్వా మూర్ధ్ని పదన్యాసం రావణస్య దురాత్మనః
త్వాం ద్రష్టు ముపయాతోహం సమాశ్రిత్య పరాక్రమమ్‌ 39
నేను సుగ్రీవుని మంత్రిని. హనుమంతు డనేవాఁడను. సముద్రాన్ని దాఁటి లంకలో ప్రవేశించాను. నా పరాక్రమంతో దురాత్ముడు రావణునితలపై పాద ముంచి, నిన్ను చూడ్డానికై ఇక్కడికి వచ్చాను.
నాహ మస్మి తథా దేవి యథా మా మవగచ్ఛసి ।
విశంకా త్యజ్య తా మేషా శ్రద్ధత్స్వ వదతో మమ ॥ 40
సీతాదేవీ! నీవు భ్రమించినట్లు నేను ఎంతమాత్రం మాయావి రావణుని కాను. ఈ సందేహాన్ని వీడి, నామాటలు శ్రద్ధగా విను. నన్ను నమ్ము.”
----------------------------------------------------------------------------------------------------------------------------------------
ఆనందరామాయాణాంతర్గత
శ్రీరామాష్టకం
సుగ్రీవమిత్రం పరమం పవిత్రం సీతాకళత్రం నవమేఘగాత్రం
కారుణ్యపాత్రం శతపత్రనేత్రం శ్రీరామచంద్రం సతతం నమామి 1
ఇత్యార్షే శ్రీమద్వాల్మీకిరామాయణే ఆదికావ్యే సుందరకాండే చతుస్త్రింశస్సర్గః (34)
మంగళం మహత్



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

SUNDARAKANDA సుందరకాండ 36

  రామసుందరం - షట్త్రింశస్సర్గః   భూయ ఏవ మహాతేజా హనూమాన్మారుతాత్మజః | అబ్రవీత్ప్రశ్రితం వాక్యం సీతాప్రత్యయకారణాత్ || 1 || సీతక...