రామసుందరం
ఏకత్రింశస్సర్గః
ఏవం బహువిధాం చింతాం
చింతయిత్వా మహాకపిః ।
సంశ్రవే మధురం వాక్యం
వైదేహ్యా వ్యాజహార హ ॥ 1
మహాకపి హనుమంతుడు, ఇలా, పరిపరివిధాలుగా, ఆలోచించి,
సీతకు, వినపడేటట్లుగా, మధురమైన, మాటల్ని చెప్పాడు.
రాజా దశరథో నామ రథకుంజరవాజిమాన్
।
పుణ్యశీలో మహాకీర్తి రృజు రాసీ న్మహాయశాః ॥
2
రథాలు, ఏనుగులు, గుఱ్ఱాలు కల్గినవాడు, పుణ్యాలు మాత్రమే చేసే స్వభావం కలవాడు, ఋజువర్తనుడు, దానపరాక్రమాలచేత మహాకీర్తి పొందినవాడైన, దశరథుడనే పేరుగల రాజు
ఉన్నాడు.
రాజర్షీణాం గుణశ్రేష్ఠ స్తపసా చర్షిభిస్సమః ।
చక్రవర్తికులే జాతః
పురందరసమో బలే ॥ 3
ఆతడు,
గుణాలచేత రాజర్షుల్లో శ్రేష్ఠుడు. తపస్సులో బుషులతో సమానమమైనవాడు, చక్రవర్తులవంశంలో పుట్టినవాడు, బలంలో దేవేంద్రునికి
సాటియైనవాడు,
అహింసారతి రక్షుద్రో
ఘృణీ సత్యపరాక్రమః ।
ముఖ్య
శ్చేక్ష్వాకువంశస్య లక్ష్మీవాన్ లక్ష్మివర్ధనః ॥ 4
అహింసను ఇష్టపడేవాడు, అల్పస్వభావం లేనివాడు, దయాశాలి, సత్యపరాక్రముడు, ఇక్ష్వాకువంశంలో ముఖ్యుడు,
అధికమైన సంపద
కలవాడు, ఆశ్రితుల సంపదను పెంపొందించేవాడు,
పార్థివవ్యంజనై
ర్యుక్తః పృథుశ్రీః పార్థివర్షభః ।
పృథివ్యాం చతురంతాయాం
విశ్రుత స్సుఖద స్సుఖీ ॥ 5
సకలరాజలక్షణాలు
కలవాడు, గొప్ప దేహకాంతి కలవాడు, రాజులలో మేలుబంతి, చతుస్సముద్రాల నడుమ ఉన్న
భూతలమంతటా ప్రసిద్ధి పొందినవాడు, జనులకు సుఖం
కల్గించేవాడు, సుఖాల్ని అనుభవించేవాడు.
తస్య పుత్త్రః ప్రియో జ్యేష్ఠ స్తారాధిపనిభాననః ।
రామో నామ విశేషజ్ఞః
శ్రేష్ఠ స్సర్వధనుష్మతామ్ ॥
6
ఆతనికి, చంద్రబింబంలాంటి ముఖం కలవాడు, సమస్తధర్మవిశేషాల్ని ఎఱిగినవాడు, విలుకాండ్రందఱిలో శ్రేష్ఠుడు, ఇష్టుడు, రాముడనే, జ్యేష్ఠ పుత్త్రుడు, ఉన్నాడు.
రక్షితా స్వస్య
ధర్మస్య స్వజనస్య చ రక్షితా ।
రక్షితా జీవలోకస్య
ధర్మస్య చ పరంతపః ॥ 7
శత్రువుల్ని తపింపచేసే ఆ రాముడు, స్వధర్మాన్ని(క్షత్రియధర్మం), రక్షించుకొనేవాడు, స్వజనుల్ని, వారిధర్మాన్ని కాపాడేవాడు, సకలప్రాణుల్ని కాచేవాడు, తద్ద్వారా వర్ణాశ్రమధర్మాన్ని పరిరక్షించేవాడు.
తస్య సత్యాభిసంధస్య
వృద్ధస్య వచనా త్పితుః ।
సభార్య స్సహ చ భ్రాత్రా వీరః ప్రవ్రాజితో వనమ్ ॥ 8
సత్యసంధుడు వృద్దుడు తండ్రి దశరథుని ఆజ్ఞను అనుసరించి, వీరుడు ఆ రాముడు, భార్య సీతతో, తమ్ముడు లక్ష్మణునితో కలసి, అడవికి వెళ్లాడు.
తేన తత్ర మహారణ్యే
మృగయాం పరిధావతా ।
రాక్షసా నిహతా శ్శూరా బహవః కామరూపిణః ॥
9
ఆ మహారణ్యంలో వేటకై తిరుగుతూ
ఆ
రాముడు, ఎంతోమంది శూరులు కామరూపులు అయిన రాక్షసుల్ని చంపాడు.
జనస్థానవధం శ్రుత్వా
హతౌ చ ఖరదూషణౌ ।
తత స్త్వమర్షాపహృతా
జానకీ రావణేన తు ।
వంచయిత్వా వనే రామం
మృగరూపేణ మాయయా ॥ 10
జనస్థానంలో, ఖరదూషణులు, ఇతరరాక్షసులందఱూ, రామునిచేతిలో హతమయ్యారని విని,
రావణుడు కోపించి, అడవిలో, మాయామృగరూపంతో, రాముని, మోసపుచ్చి, జానకిని అపహరించాడు.
స మార్గమాణస్తాం
దేవీం రామస్సీతా మనిందితామ్ ।
ఆససాద వనే మిత్రం
సుగ్రీవం నామ వానరమ్ ॥ 11
ఆ రాముడు, దేవి
అనిందిత ఆ సీతను వెదకుతూపోయి, అడవిలో, సుగ్రీవుడనే వానరునితో
చెలిమి చేశాడు.
తత స్స వాలినం హత్వా
రామః పరపురంజయః ।
ప్రాయచ్ఛత్కపిరాజ్యం
తత్సుగ్రీవాయ మహాబలః ॥ 12
ఆ తర్వాత, మహాబలుడు, శత్రుపట్టణాల్ని
జయించేవాడు, ఆ రాముడు, వాలిని
చంపి, ఆతని వానరరాజ్యాన్ని, సుగ్రీవునకు ఇచ్చాడు.
సుగ్రీవేణాపి
సందిష్టా హరయః కామరూపిణః ।
దిక్షు సర్వాసు తాం దేవీం
విచిన్వంతి సహస్రశః ॥ 13
అంత సుగ్రీవుడు, ఆజ్ఞాపించగా, కామరూపధరులైన, వేలకొలది వానరులు, సకలదిక్కులందూ, ఆ సీతను, వెదకుతున్నారు.
అహం సంపాతివచనా చ్ఛతయోజన మాయతమ్ ।
అస్యా హేతో
ర్విశాలాక్ష్యా స్సాగరం వేగవాన్ ప్లుతః ॥ 14
నేను, ఈ విశాలాక్షికోసమే సంపాతిమాటప్రకారం, నూఱు యోజనాల విఱివి కల, సముద్రాన్ని, వేగంగా దాటాను.
యథారూపాం యథావర్ణాం యథాలక్ష్మీం చ
నిశ్చితామ్ ।
అశ్రౌషం రాఘవస్యాహం సేయ
మాసాదితా మయా ॥ 15
రాముడు, నాతో, సీత రూపం వర్ణం శోభ ఎలా ఉంటాయని నిశ్చయించి చెప్పాడో, అలాంటి స్వరూపం రంగు అందం ఉన్నటువంటి సీతయొక్క దర్శనాన్ని పొందాను.
విరరా మైవ ముక్త్వాసౌ వాచం వానరపుంగవః ।
జానకీ చాపి తచ్ఛ్రుత్వా పరం విస్మయ
మాగతా ॥ 16
వానరపుంగవుడు హనుమ, ఇంతవఱకు
చెప్పి, అంత ఊరకున్నాడు. సీతయును, ఆ
మాటల్ని విని, ఎంతో
ఆశ్చర్యపడింది.
తత స్సా వక్రకేశాంతా
సుకేశీ కేశసంవృతమ్ ।
ఉన్నమ్య వదనం భీరు శ్శింశుపావృక్ష మైక్షత ॥
17
తర్వాత, కొనల్లో వంకరలై, సుందరాలైన కురులతో ఒప్పే, భీరువైన సీత, వెండ్రుకలు క్రమ్మి ఉన్న నెమ్మొగాన్ని, పైకెత్తి, శింశుపావృక్షాన్ని చూసింది.
నిశమ్య సీతా వచనం
కపేశ్చ
దిశశ్చ సర్వాః ప్రదిశ
శ్చ వీక్ష్య ।
స్వయం ప్రహర్షం పరమం
జగామ
సర్వాత్మనా రామ
మనుస్మరంతీ ॥ 18
సీతాదేవి, హనుమంతుని మాట విని, అన్నిదిక్కుల్ని,
విదిక్కుల్ని, చూసి (ఎవ్వరినీ కానక),
రామునియందు మనస్సంతా నిలిపి ధ్యానిస్తూ, పరమసంతోషాన్ని పొందింది.
సా తిర్య గూర్ధ్వం చ
తథా ప్యధస్తా
న్నిరీక్షమాణా త
మచింత్యబుద్ధిమ్ ।
దదర్శ పింగాధిపతే
రమాత్యం
వాతాత్మజం సూర్య మి
వోదయస్థమ్ ॥ 19
ఆ సీత, ఆ
శింశుపావృక్షానికి ప్రక్కలా, పైకి, క్రిందికి, వెదకుతూ, ఉదయకాల సూర్యునిలా ఉన్నవాడు, అచింత్యమైన బుద్ధి కలవాడు, సుగ్రీవుని మంత్రి, అయిన ఆ వాయుకుమారుని
హనుమంతుని చూసింది.
-----------------------------------------------------------------------------------------
భర్జనం
భవబీజానా మర్జనం సుఖసమ్పదామ్ | తర్జనం యమదూతానాం రామరా మేతి గర్జనమ్ ||36||
ఇత్యార్షే
శ్రీమద్వాల్మీకిరామాయణే ఆదికావ్యే సుందరకాండే ఏకత్రింశస్సర్గః
మంగళం
మహత్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి