20, జూన్ 2020, శనివారం

Sundarakanda సుందరకాండ 33


రామసుందరం - త్రయస్త్రింశస్సర్గః
సోవతీర్య ద్రుమా త్తస్మా ద్విద్రుమప్రతిమాననః ।
వినీతవేషః కృపణః ప్రణిప త్యోపసృత్య చ ॥ 1
తా మబ్రవీ న్మహాతేజా హనూమా న్మారుతాత్మజః ।
శిర స్యంజలి మాధాయ సీతాం మధురయా గిరా ॥ 2
పగడంలా ఎఱ్ఱని ముఖం కలవాడు వినీతవేషుడు మహాతేజుడు వాయుపుత్త్రుడు హనుమంతుఁడు, ఆ వృక్షంనుండి, నేల కుఱికి, సీత దుఃఖాన్ని చూసి దీనుడై,స్కరించి, ఆమె సమీపానికి పోయి, శిరస్సుపై చేమోడ్పు కీలించి, మధురవచనాలతో, ఇలా అన్నాడు.
కా ను పద్మపలాశాక్షి క్లిష్టకౌశేయవాసిని ।
ద్రుమస్య శాఖా మాలంబ్య తిష్ఠసి త్వ మనిందితే 3
తామరఱేకుల్లాంటి కండ్లతో ఒప్పుతూ, మాసి, నలగిన పట్టువస్త్రం కట్టుకొని, చెట్టుకొమ్మను ట్టుకొని నిలిచిన, ఓ అనిందితా!, నీ వెవవు?
కిమర్థం తవ నేత్రాభ్యాం వారి స్రవతి శోకజమ్‌ ।
పుండరీకపలాశాభ్యాం విప్రకీర్ణ మి వోదకమ్‌ ॥ 4
అలలు ఎగజల్లగా తెల్ల తామరఱేకుల్లో డిన నీళ్లు, వాటినుండి కాఱినట్లు, నీకండ్లనుండి, శోకంవల్ల కన్నీరు ఎందుకు కాఱుతోంది?
సురాణా మసురాణాం వా నాగగంధర్వరక్షసామ్‌ ।
యక్షాణాం కిన్నరాణాం వా కా త్వం భవసి శోభనే ॥ 5
మంగళకరీ!, నీవు, దేవకన్యవా?, సురాంగనవా?, నాగభామినివా?, గంధర్వకాంవా?, రాక్షసస్త్రీవా?, యక్షతరుణివా?, కిన్నరనారివా?, వీరిలో ఎవరవు?  
కా త్వం భవసి రుద్రాణాం మరుతాం వా వరాననే
వసూనాం వా వరారోహే దేవతా ప్రతిభాసి మే ॥ 6
వరాననా!, రుద్రులు, మరుత్తులు, వసువులు, వీరిలో, నీవు, ఏ గణానికి  చెందినదానవు? వరారోహా! నీవు, దేవత వని, నాకు, తోస్తోంది.
కిన్ను చంద్రమసా హీనా పతితా విబుధాలయాత్‌
రోహిణీ జ్యోతిషాం శ్రేష్ఠా శ్రేష్ఠ సర్వగుణాన్వితా
కాత్వం భవసి కల్యాణి త్వ మనిందితలోచనే 7
నీవు, చంద్రుని విడిచి, దేవలోకంనుండి, భూమిపై పడ్డ, నక్షత్రశ్రేష్ఠ, శ్రేష్ఠసర్వగుణాన్విత రోహిణివా మి?
మంగళస్వరూపిణీ!, అనిందితలోచనా!, నీ వెవ్వతెవు?
కోపా ద్వా యది వా మోహాద్భర్తార మసితేక్షణే
వసిష్ఠం కోపయిత్వా త్వం నాసి కల్యా ణ్యరుంధతీ 8
అసితేక్షణా!, కళ్యాణీ!, నీవు, కోపంతో కానీ, తెలియక కానీ, పెనిమిటి వసిష్ఠుని కోపానికి గుఱై,  భూమికి వచ్చిన, రుంధతివి కావు కదా!
కో ను పుత్రః పితా భ్రాతా భర్తా వా తే సుమధ్యమే ।
అస్మాల్లోకాదముం లోకం గతం త్వ మనుశోచసి ॥ 9
సుమధ్యమా! నీ కొడుకు, తండ్రి, సహోదరుడు, పెనిమిటి, వీరిలో పరలోకగతుడైన ఎవరిని గూర్చి శోకిస్తున్నావు?
రోదనా దతినిశ్శ్వాసా ద్భూమిసంస్పర్శనాదపి
నత్వాం దేవీ మహం మన్యే రాజ్ఞ స్సంజ్ఞావధారణాత్‌ 10
డ్వడంవల్లా, నిట్టూర్పు విడువడంవల్లా, నేలను స్పృశించడంవల్లా, రాజలక్షణాలు కనపడడంవల్లా, నీవు దేవతాస్త్రీవి కావని తలుస్తున్నాను. అయితే రాజస్త్రీవి కావచ్చు.
వ్యంజనాని తే యాని లక్షణాని చ లక్షయే ।
మహిషీ భూమిపాలస్య రాజకన్యాసి మే మతా ॥ 11
నీ వయవాల ఉనికీ, మంగళకరాలైన సాముద్రికలక్షణాల్ని బట్టి చూస్తే, నీవు, రాజుపట్టపురాణివి, రాచకొమార్తెవు అని నాకు తోస్తోంది.
రావణేన జనస్థానా ద్బలా దపహృతా యది ।
సీతా త్వమసి భద్రం తే తన్మమాచక్ష్వ పృచ్ఛతః ॥ 12
రావణుడు, జనస్థానంనుండి, బలాత్కారంగా అపహరించిన సీతవు నీవైతే, ఆ సంగతిని అడుగుతున్నాను. శీఘ్రంగా చెప్పు. నీకు భద్ర మగుగాక!.
యథా హి తవ వై దైన్యం రూపం చాప్యతిమానుషమ్‌ ।
తపసా చాన్వితో వేషస్త్వం రామమహిషీ ధ్రువమ్‌ ॥ 13
నీ ముఖంలో దైన్యాన్ని, మనుష్యస్త్రీలకు కల్గని నీ సౌందర్యాన్ని, నీ తాపసవేషాన్ని చూడగా, నీవు రామునిభార్యవే అని తోస్తోంది.”
సా తస్య వచనం శ్రుత్వా రామకీర్తనహర్షితా ।
ఉవాచ వాక్యం వైదేహీ హనుమంతం ద్రుమాశ్రితమ్‌ ॥ 14
సీత, హనుమంతుని మాటలు విని, రాముని సంగతిని విన్నందుకు సంతోషాన్ని పొంది, చెట్టును ఆశ్రయించిన హనుమంతుని చూసి, ఇలా అంది.
పృథివ్యాం రాజసింహానాం ముఖ్యస్య విదితాత్మనః
స్నుషా దశరథ స్యాహం శత్రు సైన్య ప్రతాపినః ॥ 15
“నేను భూమిపై ఉన్న రాజసింహుల్లో ముఖ్యుడు విదితాత్ముడు శత్రుసైన్యాన్ని తపింపచేసే దశరథమహారాజు కోడల్ని.
దుహితా జనక స్యాహం వైదేహస్య మహాత్మనః ।
సీతేతి నామ నామ్నాహం భార్యా రామస్య ధీమతః ॥ 16
మహాత్ముడు విదేహరాజు జనకుని కొమార్తెను. నన్ను సీత అనే పేరుతో పిలుస్తారు. ధీమంతుడు రాముని భార్యను.
సమా ద్వాదశ తత్రాహం రాఘవస్య నివేశనే
భుంజానా మానుషాన్‌ భోగాన్‌ సర్వకామసమృద్ధినీ ॥ 17
నేను, వివాహమైన పిదప,దశరధునింట, పండ్రెండు సంవత్సరాలు, మానుషభోగాలు నుభవిస్తూ, సమస్తకామితపదార్థాల్ని సమృద్ధిగా పొందాను.
త్ర త్రయోదశే వర్షే రాజ్యే నేక్ష్వాకునందనమ్‌
అభిషేచయితుం రాజా సోపాధ్యాయః ప్రచక్రమే ॥ 18
పదుమూఁడవసంవత్సరంలో, దశరథమహారాజు, ఉపాధ్యాయుఁడు వసిష్ఠునితో కల్సి, ఇక్ష్వాకునందనుడు రామునకు, పట్టాభిషేకం చేయడానికి, ఉపక్రమించాడు.
తస్మిన్‌ సంభ్రియమాణే తు రాఘవ స్యాభిషేచనే ।
కైకేయీ నామ భర్తారం దేవీ వచన మబ్రవీత్‌ ॥ 19
లా, రాముని పట్టాభిషేకానికై, సంభారాలు కూర్చుతూండగా, కైకేయి అనే దశరథునిభార్య కతె, పెనిమిటితో, ఇలా అంది.
న పిబేయం న ఖాదేయం ప్రత్యహం మమ భోజనమ్‌ ।
షమే జీవితస్యాంతో రామో య ద్యభిషిచ్యతే 20
రామునకు, ట్టాభిషేకం చేస్తే కనుక, ఇక ఎన్నటికీ, నేను, నీళ్లు త్రాగను, భోజనం తినను. ఈ పట్టాభిషేకమే, నా జీవితానికి ముగింపు.
యత్తదుక్తం త్వయా వాక్యం ప్రీత్యా నృపతిసత్తమ ।
తచ్చేన్న వితథం కార్యం వనం గచ్ఛతు రాఘవః ॥ 21
రాజశ్రేష్ఠుఁడా! నీవే, నాకు, ప్రీతితో, వరం ఇచ్చానని, చెప్పావు. ఆ వరం, అసత్యం కాకూడదంటే, ఇప్పుడే, రాముడు, అడవికి పోవాలి.  
స రాజా సత్యవాగ్దేవ్యా వరదాన మనుస్మరన్‌ ।
ముమోహ వచనం శ్రుత్వా కైకేయ్యాః క్రూర మప్రియమ్‌ ॥ 22
ఆ దశరథమహారాజు, కైకేయి చెప్పిన, అప్రియమైన క్రూరంపుమాటను విని, తాను, ఆమె కిచ్చిన, వరదానాన్ని తలచి, సత్యవాది కాబట్టి, బదులాడలేక, మూర్ఛపోయాడు.
తతస్తు స్థవిరో రాజా సత్యే ధర్మే వ్యవస్థితః
జ్యేష్ఠం యశస్వినం పుత్త్రం రుద న్రాజ్యమయాచత ॥ 23
తర్వాత,త్యర్మాల్ని నియతి తప్పకుండా కాపాడే, ముసలివాడైన దశరథమహారాజు, కన్నీరు కారుస్తూ, తన జ్యేష్ఠపుత్రుడు యశస్వి రామునితో, "నీ కిస్తా న్న రాజ్యం తిరిగి నా కిమ్ము" అని, యాచించాడు.
స పితు ర్వచనం శ్రీమా నభిషేకా త్పరం ప్రియమ్‌ ।
మనసా పూర్వ మాసాద్య వాచా ప్రతిగృహీతవాన్‌ 24
ఆ శ్రీమంతుడు రాముఁడు, పట్టాభిషేకంకంటె, తనకు మిక్కిలి ప్రియమైన, తండ్రిమాటను  మనఃపూర్వకంగా అంగీకరించాడు.
దద్యా న్న ప్రతిగృహ్ణీయాన్న బ్రూయాత్కించిదప్రియమ్
అపి జీవితహేతో ర్వా రామ స్సత్యపరాక్రమః ॥ 25
సత్యపరాక్రముడు రాముడు, ఎవరు, దేన్ని, అడిగినా, ఇస్తాడు. ప్రాణసంకటం సంభవించినా, ఎవరినీ, ఏదీ, యాచించడు. ఎవరితోనూ, కొంచెమైనా, అప్రియం, పల్కడు.
స విహా యోత్తరీయాణి మహార్హాణి మహాయశాః
విసృజ్య మనసా రాజ్యం జనన్యై మాం సమాదిశత్‌ ॥ 26
మహాకీర్తిశాలి రాముఁడు, మనసునుండి రాజ్యకాంక్షను, ధరించిన శ్రేష్ఠవస్త్రాల్ని(శరీరంనుండి) విడచి, నారచీరలు ట్టుకొని,నానికి పోవటానికి నిశ్చయించి, నన్ను, కౌసల్య ఒద్ద, ఉండమన్నాడు.  
సాహం త స్యాగ్రత స్తూర్ణం ప్రస్థితా వనచారిణీ
నహి మే తేన హీనాయా వాస స్స్వర్గేపి రోచతే ॥ 27
అయితే, నేను, అడవిలో చరించటానికి నిశ్చయించి, రామునికంటె ముందుగా, యనమయ్యాను. ఎందుకంటే, నేను, ఆ రాముని విడిచి, స్వర్గంలో ఉండటానికైనా ఇష్టపడను.
ప్రాగేవ తు మహాభాగ స్సౌమిత్రి ర్మిత్రనందనః
పూర్వజ స్యానుయాత్రార్థే ద్రుమచీరై రలంకృతః ॥ 28
అంతకుముందే, రామకైంకర్యమనే మహాభాగ్యానికి నోచినవాడు మిత్రనందనుడు సుమిత్రానందనుడు లక్ష్మణుఁడు, అన్న రాముని వెంబడించడానికై నారచీరల్ని కట్టుకొన్నాడు.
తే వయం భర్తు రాదేశం బహుమాన్య దృఢవ్రతాః
ప్రవిష్టాః స్మ పురాదృష్టం వనం గంభీరదర్శనమ్‌ ॥ 29
అలా, మేము మువ్వురం, ప్రభువైన దశరథుని జ్ఞకు బద్ధులమై, దృఢచిత్తంతో, ఇదివఱకెన్నడూ మే మెఱుఁగని గంభీరమైన అడవిలోకి, ప్రవేశించాం.
వసతో దండకారణ్యే త స్యాహ మమితౌజసః
రక్షసాపహృతా భార్యా రావణేన దురాత్మనా ॥ 30
దండకారణ్యంలో నివసిస్తూండగా, అమితపరాక్రమవంతుఁడు రాముఁని భార్యనైన నన్ను, కూళ రాక్షసుఁడు రావణుఁడు, అపహరించాడు.
ద్వౌ మాసౌ తేన మే కాలో జీవితానుగ్రహః కృతః ।
ర్ధ్వం ద్వాభ్యాం తు మాసాభ్యాం తత స్త్యక్ష్యామి జీవితమ్‌ 31
రెండుమాసాలుమాత్రం, నన్ను బ్రతుకనిస్తానని, రావణుఁడు, చెప్పాడు. ఆ రెండుమాసాల పైన, నేను, ప్రాణాలు విడుస్తాను.”
-------------------------------------------------------------------------------------------------
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే | సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ||38||
ఇత్యార్షే శ్రీమద్వాల్మీకిరామాయణే ఆదికావ్యే సుందరకాండే త్రయస్త్రింశస్సర్గః (33)
మంగళం మహత్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

SUNDARAKANDA సుందరకాండ 36

  రామసుందరం - షట్త్రింశస్సర్గః   భూయ ఏవ మహాతేజా హనూమాన్మారుతాత్మజః | అబ్రవీత్ప్రశ్రితం వాక్యం సీతాప్రత్యయకారణాత్ || 1 || సీతక...