రామసుందరం
అష్టావింశస్సర్గః
సా రాక్షసేంద్రస్య
వచో నిశమ్య
త ద్రావణ స్యాప్రియ
మప్రియార్తా ।
సీతా వితత్రాస యథా
వనాంతే
సింహాభిపన్నా
గజరాజకన్యా ॥ 1
రావణుని అప్రియవచనాల్ని విని, అప్రియవిషయాలవల్ల దుఃఖంతో
పీడింపబడుతున్న, ఆ జనకరాజకన్య సీత, అడవినడుమ, సింహం చేతిలో చిక్కిన, గజరాజకన్యలా భీతిల్లింది.
సా రాక్షసీమధ్యగతా చ
భీరు
ర్వాగ్భి ర్భృశం రావణతర్జితా
చ ।
కాంతారమధ్యే విజనే
విసృష్టా
బాలేవ కన్యా విలలాప
సీతా ॥ 2
పిఱికిదైన ఆ సీత, రాక్షసస్త్రీల నడుమ చిక్కి, రావణుని పరుషమైన బెదిరింపులకు, భయపడి, నిర్జనమైన అడవినడుమ,
ఒంటరిగా
విడువబడ్డ, చిన్నకన్యలా, ఏడ్చింది.
సత్యం బతేదం ప్రవదంతి
లోకే
నాకాలమృత్యు ర్భవతీతి
సంతః ।
య త్రాహ మేవం పరిభర్త్స్యమానా
జీవామి కించిత్క్షణ మ ప్యపుణ్యా ॥ 3
‘అపుణ్యనైన నేను,ఇలా
భయంకరంగా బెదిరింపబడుతూ కూడా, క్షణకాలమైనా బ్రతికున్నాను.
అందువల్ల, (కోరినంతమాత్రాన) అకాలంలో, మృత్యువు కల్గదని, పెద్దలు, చెప్పేమాట, సత్యం.
సుఖా ద్విహీనం
బహుదుఃఖపూర్ణ
మిదం తు నూనం హృదయం
స్థిరం మే ।
విశీర్యతే యన్న
సహస్రధాఽద్య
వజ్రాహతం శృంగ మి
వాచలస్య ॥ 4
సుఖమన్నదే లేక, పెక్కుదుఃఖాలతో నిండిపోయిన, ఈ నా హృదయం, నిజానికి, వజ్రాయుధపువ్రేటుకు, పర్వతశిఖరంలా, వేయిముక్కలు కావాలి,
కానీ, కావట్లేదు. అందువల్ల,
నిశ్చయంగా, ఈ గుండె, స్థిరమైనది.
నై వాస్తి దోషం మమ
నూన మత్ర
వధ్యాహ మస్యాఽ ప్రియదర్శనస్య ।
భావం న చాస్యాహ
మనుప్రదాతు
మలం ద్విజో మంత్ర మి
వాద్విజాయ ॥ 5
చూసేవారికి రోత కల్గించే
రావణుడు, ఎలాగైనా, నన్ను, చంపుతాడు. కాబట్టి, నేనే ప్రాణాలు విడిస్తే, నిశ్చయంగా
దోషం ఏమీ ఉండదు. అయితే, ఆతని అనుసరించవచ్చుగా, అంటే, బ్రాహ్మణుడు, మంత్రాన్ని, అబ్రాహ్మణునికి
ఇవ్వజాలనట్లు, నేను, నా మనసును, ఈతనికి ఇవ్వలేను.
నూనం మమాంగాన్యచిరా
దనార్య
శ్శస్త్రై శ్శితై శ్ఛేత్స్యతి రాక్షసేంద్రః
।
తస్మి న్ననాగచ్ఛతి లోకనాథే
గర్భస్థజంతో రివ
శల్యకృంతః ॥ 6
లోకనాథుడు రాముడు, ఇక్కడికి రాకపోతే, ఈ దుర్మార్గుడు, రావణుడు, శస్త్రచికిత్సకుడు, కడుపునుండి వెలువడని శిశువు అవయవాల్ని
ముక్కలు చేసినట్లు, నిశ్చయంగా, త్వరలోనే, నా అవయవాల్ని, వాడియైన ఆయుధాలతో, తుండు
తుండుగా, ఖండిస్తాడు.
దుఃఖం బతేదం మమ
దుఃఖితాయా
మాసౌ
చిరాయాధిగమిష్యతో ద్వౌ ।
బద్ధస్య వధ్యస్య తథా
నిశాంతే
రాజాపరాధా దివ
తస్కరస్య ॥ 7
రాజద్రోహం చేసి, తెల్లవారగానే చంపబడ్డానికి, బద్ధుడై ఉన్న
దొంగ
దుఃఖంలా, చిరకాలదుఃఖితయైన, నాకు, రెండునెలల గడువు, సమీపిస్తున్నదే
అని, దుఃఖం కల్గుతోంది.
హా రామ హా లక్ష్మణ హా
సుమిత్రే
హా రామమాత స్సహ మే
జనన్యా ।
ఏషా విపద్యా మ్యహ మల్పభాగ్యా
మహార్ణవే నౌ రివ మూఢవాతా ॥ 8
అయ్యో రామా! లక్ష్మణా!, సుమిత్రా!, జననీ!, రామమాతా!, మహా సముద్రంలో, పెనుగాలికి చిక్కిన, నౌకలా,
అల్పభాగ్యనైన, నేను, ఇక్కడ నశిస్తున్నాను.
తరస్వినౌ ధారయతా
మృగస్య
సత్త్వేన రూపం
మనుజేంద్రపుత్రౌ
।
నూనం విశస్తౌ మమ కారణా త్తౌ
సింహర్షభౌ ద్వా వివ
వైద్యుతేన ॥ 9
లేడి రూపాన్ని ధరించిన ప్రాణిచేతిలో, బలవంతులైన, ఆ
రాజకుమారు లిద్దఱూ, నిశ్చయంగా, నా కారణంగానే, పిడుగుపాటుకు గుఱైన, రెండు సింహవృషభాల్లా, ఆపదపాలయ్యారు.
నూనం స కాలో
మృగరూపధారీ
మా మల్పభాగ్యాం లులుభే
తదానీమ్ ।
య త్రార్యపుత్త్రం విససర్జ మూఢా
రామానుజం
లక్ష్మణపూర్వజం చ ॥ 10
అప్పుడు, నిశ్చయంగా
కాలుడే, జింకరూపు దాల్చి, అల్పభాగ్యనైన
నన్ను, ప్రలోభపెట్టి ఉంటాడు. అందువల్ల,
మూఢురాలనై నేను, నా భర్త రాముని, రాముని తమ్ముడు లక్ష్మణుని, ఆ జింకకై పంపి, చేజేతులా
వారిని దూరం చేసుకొన్నాను.
హా రామ సత్యవ్రత దీర్ఘబాహో
హా
పూర్ణచంద్రప్రతిమానవక్త్ర ।
హా జీవ లోకస్య హితః
ప్రియ శ్చ
వధ్యాం న మాం వేత్సి
హి రాక్షసానామ్ ॥ 11
అయ్యో రామా! సత్యవ్రతుడా!, ఆజానుబాహూ!, నిండు చందురుని పోలు ముఖం కలవాడా! సకలజీవులకు, హితుడవు, ప్రియుడవు, నేను,
రాక్షసులచేతిలో, చావబోతున్నట్లు, ఎఱుగకున్నావు కదా!
అనన్యదైవత్వ మియం
క్షమా చ
భూమౌ చ శయ్యా నియమ
శ్చ ధర్మే ।
పతివ్రతాత్వం విఫలం మ
మేదం
కృతం కృతఘ్నే ష్వివ మానుషాణామ్ ॥ 12
పెనిమిటిని తప్ప, అన్యదైవాన్ని
కొలువకపోవడం, రాక్షసబాధల్ని
ఓర్చుకోవడం, నేలమీద పండుకోవడం, ఈ నియమపూర్వక ధర్మాచరణం, ఈ పాతివ్రత్యం, అంతా, కృతఘ్నునకు చేసిన ఉపకారంలా విఫలమైంది.
మోఘో హి ధర్మ శ్చరితో
మయాఽయం
త థైకపత్నీత్వ మిదం నిరర్థమ్ ।
యా త్వాం న పశ్యామి
కృశా వివర్ణా
హీనా త్వయా సంగమనే
నిరాశా ॥ 13
నిన్ను కల్సుకుంటాననే ఆశ లేదు. భాగ్యహీనురాలను, కృశించి, వివర్ణనై ఉన్న
నేను, నిన్ను
చూడలేని
దాన్ని అయ్యాను. నా ధర్మాచరణం, వ్యర్థమే
కదా! పాతివ్రత్యధర్మం కూడా, నిరర్థకమే అయ్యింది.
పితు ర్నిదేశం నియమేన
కృత్వా
వనా న్నివృత్త శ్చరితవ్రతశ్చ ।
స్త్రీభి స్తు మన్యే విపులేక్షణాభి
స్త్వం రంస్యసే
వీతభయః కృతార్థః ॥ 14
రామా! నీవు, నియమంతో, తండ్రి ఆజ్ఞను నేఱవేర్చి, వ్రతం పూర్తిచేసి, అడవిని విడచి, అయోధ్య చేరి, కృతార్థుడవై, నిర్భయుడవై, విశాలనేత్రులైన
స్త్రీలతో, క్రీడించగలవు, అని,
అనుకొంటున్నాను.
అహం తు రామ త్వయి
జాతకామా
చిరం వినాశాయ
నిబద్ధభావా ।
మోఘం చరిత్వా చ తపో
వ్రతం చ
త్యక్ష్యామి ధి
గ్జీవిత మల్పభాగ్యా ॥ 15
రామా!, నేను మాత్రం, నీ యందే
అనురక్తనై, చిరకాలం లగ్నమైనట్టి హృదయం కలదాననై, తపోవ్రతాలను ఆచరించి, వ్యర్థమైన, ప్రాణాల్ని
విడుస్తాను. ధిక్. (నిన్ను దర్శించలేని) నేను, అల్పభాగ్యను.
సా జీవితం క్షిప్ర
మహం త్యజేయం
విషేణ శస్త్రేణ శితేన వాపి ।
విషస్య దాతా న హి మేఽస్తి కశ్చి
చ్ఛస్త్రస్య వా వేశ్మని రాక్షసస్య ॥
16
అట్టి నేను, విషంచేత కానీ, నిశితమైన ఆయుధంచేత కానీ, శీఘ్రంగా, జీవితాన్ని, విడిచిపెడతాను. ఈ రాక్షసునింట, నాకు, విషం కానీ, ఆయుధం కానీ, ఇచ్చే దాత, ఎవ్వడూ లేడు కదా!’
ఇతీవ దేవీ బహుధా
విలప్య
సర్వాత్మనా రామ మనుస్మరంతీ ।
ప్రవేపమానా పరిశుష్కవక్త్రా
నగోత్తమం పుష్పిత మాససాద ॥ 17
సీతాదేవి, ఇలా పెక్కువిధాల విలపించి, హృదయంలో రాముని ధ్యానిస్తూ, వణకుతూ,
నోరెండగా, పూచిన ఆ శింశుపా వృక్షాన్ని,
చేరింది.
శోకాభితప్తా బహుధా
విచింత్య
సీతాఽథ వేణ్యుద్గ్రథనం గృహీత్వా ।
ఉద్బధ్య వేణ్యుద్గ్రథనేన శీఘ్ర
మహం గమిష్యామి యమస్య
మూలమ్ ॥ 18
అంత, ఆ సీత, దుఃఖంతో పరితపిస్తూ, పలువిధాల చింతిస్తూ, జడను, మెడకు చుట్టుకొని, ‘నేను ఈ జడముడితో, ఉరిపోసికొని, ప్రాణాలు విడచి, వెంటనే, యమలోకానికి చేరతాను’.
ఉపస్థితా సా
మృదుసర్వగాత్రీ
శాఖాం గృహీత్వా౨థ
నగస్య తస్య ।
తస్యాస్తు రామం
ప్రవిచింతయంత్యా
రామానుజం స్వం చ కులం
శుభాంగ్యాః ॥ 19
శోకానిమిత్తాని తథా
బహూని
ధైర్యార్జితాని
ప్రవరాణి లోకే ।
ప్రాదు ర్నిమిత్తాని
తదా బభూవుః
పురాపి సిద్ధా
న్యుపలక్షితాని ॥ 20
మృదువైన అవయవాలు కల సీత, అలా
తలపోసి, ఆ శింశుపా వృక్షము కొమ్మను, పట్టుకొని, నిలిచింది.
అనంతరం రామలక్ష్మణుల గూర్చి, (అంతటి వీరులున్నా
తనకీ అవస్థ కల్గిందే అని) తన వంశాన్ని
గూర్చి, (పుణ్యవంశంలో పుట్టిన తనకు
ఈ దుర్మరణమేమిటా అని) చింతిస్తున్న, ఆ శుభాంగికి సీతకు, అప్పుడు, శుభసూచకాలు, ధైర్యం
కల్గించేవి, లోకప్రసిధ్ధాలు, ఇదివఱకు పెక్కుమాఱులు సత్ఫలితమిచ్చినవని పరీక్షింపబడి, నిర్ణయింపబడిన, అనేక శుభశకునాలు, కనబడ్డాయి.
---------------------------------------------------------------------------------------
మనోజవం మారుతతుల్యవేగం, జితేన్ద్రియం బుద్ధిమతాంవరిష్ఠమ్
| వాతాత్మజం వానరయూధముఖ్యం, శ్రీరామదూతం
శరణం ప్రపద్యే ||33||
ఇత్యార్షే శ్రీమద్వాల్మీకిరామాయణే ఆదికావ్యే సుందరకాండే అష్టావింశస్సర్గః
(28)
మంగళం
మహత్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి