4, జూన్ 2020, గురువారం

Sundarakanda సుందరకాండ 17


రామసుందరం
సప్తదశస్సర్గః
తతః కుముదషండాభో నిర్మలో నిర్మలం స్వయమ్‌ ।
ప్రజగామ నభ శ్చంద్రో హంసో నీల మి వోదకమ్‌ ॥ 1
అటుపిమ్మట, తెల్లలువతంపరలా ళుకొత్తుతూ, నిర్మలుడైన చంద్రుడు,ల్లనైన నిర్మలలానికి హంస పోయినట్లు, నిర్మమైనల్లని కాశంలో చాలవఱకుపోయి, అపరభాగాన్ని(పడమరను) చేరాడు.
సాచివ్య మివ కుర్వన్‌ స ప్రభయా నిర్మల ప్రభః ।
చంద్రమా రశ్మిభి శ్శీతై స్సిషేవే పవనాత్మజమ్‌ ॥ 2
నిర్మలకాంతి తళుకొత్తే ఆ చంద్రుఁడు, హనుమంతునకు తన వెలుగు చూపి, సాహాయ్యం చేసేవాడిలా,న చల్లనికిరణాల్ని, వాయుకుమారునిపై ప్రసరించాడు.
స దదర్శ తత స్సీతాం పూర్ణచంద్రనిభాననామ్‌ ।
శోకభారై రివ న్యస్తాం భారై ర్నావ మి వాంభసి ॥ 3
అంత హనుమంతుఁడు, పున్నమచందురునిలాంటి మొగం ల సీతను, బరువులచే నావ నీట మునిగినట్లు, బహుదుఃఖభారాల్లో మునిగి ఉంగా చూశాడు.  
దిదృక్షమాణో వైదేహీం హనుమా న్మారుతాత్మజః ।
స దదర్శా విదూరస్థా రాక్షసీ ర్ఘోరదర్శనాః ॥ 4
హనుమంతుఁడు, సీతను, చూడకోరినవాడై, పరికించి,మెకు సమీపా, చూసేవారికి వెఱపు పుట్టించే ఆకారాలు ల రాక్షసస్త్రీలను, చూశాడు.
ఏకాక్షీ మేకకర్ణాం చ కర్ణప్రావరణాం తథా ।
అకర్ణాం శంకుకర్ణాం చ మస్తకోచ్ఛ్వాసనాసికామ్‌ ॥ 5
వారిలో, ఏకాక్షి, ఏకకర్ణ, ప్రావరణకర్ణ, అకర్ణ, శంకుకర్ణ, మస్తకోచ్ఛ్వానాసిక,
అతికాయోత్తమాంగీం చ తనుదీర్ఘశిరోధరాం ।
ధ్వస్తకేశీం తథాకేశీం కేశకంబళధారిణీమ్‌ ॥ 6
అతికాయోత్తమాంగి, తనుదీర్ఘశిరోధర, ధ్వస్తకేశి, అకేశి, కేశకంబళధారిణి,
లంబకర్ణలలాటాం చ లంబోదరపయోధరాం ।
లంబోష్ఠం చుబుకోష్ఠీం చ లంబాస్యాం లంబజానుకామ్‌ ॥ 7
లంబకర్ణలలాట, లంబోదరపయోధర, లంబోష్ఠి, చుబుకోష్ఠి, లంబాస్య, లంబజానుక,
హ్రస్వాం దీర్ఘాం తథా కుబ్జాం వికటాం వామనాం తథా ।
కరాళాం భుగ్నవక్త్రాం చ పింగాక్షీం వికృతాననామ్‌ ॥ 8
హ్రస్వ, దీర్ఘ, కుబ్జ, వికట, వామన, కరాళ, భుగ్నవక్త్ర, పింగాక్షీ, వికృతానన,  
  వికృతాః పింగళాః కాళీః క్రోధనాః కలహప్రియాః ।
కాలాయస మహాశూల కూటముద్గరధారిణీః ॥ 9
వికృత, పింగళ, కాళి, క్రోధన, కలహప్రియలు, కాలాయస మహాశూల కూట ముద్గర ధారిణులు,
వరాహమృగ శార్దూల మహిషాజశివాముఖీః ।
గజోష్ట్రహయపాదీశ్చ నిఖాతశిరసోపరాః ॥ 10
వరాహ మృగ శార్దూల మహిష అజ శివా ముఖులు, జ ఉష్ట్ర హయ పాదులు, నిఖాతశిరసులు,
ఏకహస్తైకపాదాశ్చ ఖరకర్ణ్యశ్వకర్ణికాః ।
గోకర్ణ ర్హస్తికర్ణీశ్చ హరికర్ణీ స్తథాపరాః ॥ 11
ఏకహస్త ఏకపాదులు, ఖరకర్ణి,శ్వకర్ణి, గోకర్ణి,స్తికర్ణి, హరికర్ణి,
అనాసా అతినాసాశ్చ తిర్యఙ్నాసా వినాసికాః ।
గజసన్నిభనాసాశ్చ లలాటోచ్ఛ్వాసనాసికాః ॥ 12
అనాసిక, అతినాసిక, తిర్యఙ్నాసిక, వినాసిక, గజసన్నిభనాసిక, లలాటోచ్ఛ్వాసనాసిక,
హస్తిపాదా మహాపాదా గోపాదాః పాదచూళికాః ।
అతిమాత్రశిరోగ్రీవా అతిమాత్రకుచోదరీః ॥ 13
హస్తిపాద, మహాపాద, గోపాద, పాదచూళి, అతిమాత్రశిరోగ్రీవులు, అతిమాత్రకుచోదరులు,
అతిమాత్రాస్యనేత్రాశ్చ దీర్ఘజిహ్వానఖా స్తథా ।
అజాముఖీ ర్హస్తిముఖీ ర్గోముఖీ స్సూకరీముఖీః ॥ 14
అతిమాత్రాస్యనేత్రులు, దీర్ఘజిహ్వానఖులు, అజాముఖి,స్తిముఖి, గోముఖి సూకరీముఖి,
హయోష్ట్రఖరవక్త్రాశ్చ రాక్షసీ ర్ఘోరదర్శనాః ।
శూలముద్గరహస్తాశ్చ క్రోధనాః కలహప్రియాః ॥ 15
య ఉష్ట్ర ఖర వక్త్రులు, శూల ముద్గర హస్తులు, క్రోధ స్వభావులు, కలహప్రియులు,
కరాళా ధూమ్రకేశీశ్చ రాక్షసీ ర్వికృతాననాః ।
పిబంతీ స్సతతం పానం సదా మాంససురాప్రియాః ।
మాంసశోణితదిగ్ధాంగీ ర్మాంసశోణితభోజనాః ॥ 16
మిట్టపండ్లు లవారు, ధూమ్రకేశులు, వికృతాననలు, సదా మద్యపాన ప్రియులు, సదా మద్యమాంసప్రియులు, మాంస శోణిత దిగ్ధాంగులు, మాంస శోణిత భోజనప్రియులు ఉన్నారు.
తా దదర్శ కపిశ్రేష్ఠో రోమహర్షణదర్శనాః ।
స్కంధవంత ముపాసీనాః పరివార్య వనస్పతిమ్‌ ॥ 17
ఇలా చూసేవారికి, గగురు పుట్టిస్తూ, పెద్ద బోదియగల చెట్టును చుట్టుకొని కూర్చుని ఉన్న రాక్షస్త్రీలను చూశాడు.
త స్యాధస్తాచ్చ తాం దేవీం రాజపుత్రీ మనిందితామ్‌ ।
లక్షయామాస లక్ష్మీవాన్‌ హనుమాన్‌ జనకాత్మజామ్‌ ॥ 18
శోభాసంపన్నుడు హనుమంతుఁడు, ఆ చెట్టుక్రింద, అనిందిత రాజకుమారి జనకరాజసుత సీతను, చూశాడు.
నిష్ప్రభాం శోకసంతప్తాం మలసంకులమూర్ధజామ్‌ ।
క్షీణపుణ్యాం చ్యుతాం భూమౌ తారాం నిపతితామివ ॥ 19
చారిత్రవ్యపదేశాఢ్యాం భర్త దర్శనదుర్గతామ్‌ ।
భూషణై రుత్తమై ర్హీనాం భర్తృవాత్సల్యభూషణామ్‌ ॥ 20
రాక్షసాధిపసంరుద్ధాం బంధుభిశ్చ వినాకృతామ్‌ ।
వియూథాం సింహసంరుద్ధాం బద్ధాం గజవధూమివ ॥ 21
ఇంతి, కాంతి తఱిగి, శోకంతో పరితపిస్తూ, సంస్కారం లేనందున తలకురులు ముఱికితో నిండి ఉండి, పుణ్యం నశించడంతో ఆకాశంనుండి జాఱి, భూమిపైన పడిన చుక్కలా కనబడుతూ, మంచినడవడిచేత మిక్కిలి వాసి, వన్నె గాంచి, భర్తృదర్శనం మాలి, త్తమభూషణాలను ధరించక, భర్తయందలి భక్తే భూషణంలా కల్గి, రావణునిచే చెఱపట్టబడడంవల్ల, బంధువులందఱ్నీ పాసి, గజమూహాన్ని వీడి, సింహంబారి చిక్కి, ఎటూ కదలలేకున్న, డుగజంలా కనిపిస్తోంది.
చంద్రరేఖాం పయోదాంతే శారదా భ్రైరివావృతామ్‌ ।
క్లిష్టరూపా మసంస్పర్శా దయుక్తామివ వల్లకీమ్‌ ॥ 22
మఱియు చెలువ వర్షాకాలం గడచాక, శరత్కాలమేఘాలచే కప్పబడిన, చంద్రరేఖ కైవడి, కొంచెం స్పష్టంగా, కొంచెం అస్పష్టంగా కనబడుతూ, దేహ సంస్కారాల లేమిచే రూపు, సొంపు కలగి నలగి ఉండటంవల్ల, తంత్రులు ట్టకపోతే పొలుపు చూ, రాణించని, వీణియలా ఉంది.
సీతాం భర్తృవశే యుక్తా మయుక్తాం రాక్షసీవశే ।
అశోకవనికామధ్యే శోకసాగరమాప్లుతామ్‌ ॥ 23
తాభిః పరివృతాం తత్ర సగ్రహా మివ రోహిణీమ్‌ ।
దదర్శ హనుమాన్‌ దేవీం లతా మకుసుమామివ ॥ 24
మె ఎప్పుడూ పెనిమిటియందే ఉంతగింది కానీ రాక్షసుల బారి చిక్కి ఉంగనిది. అయినా రాముని పాసి, శోకసముద్రాన తేలుతూ, ఆ రాక్షసస్త్రీలు చుట్టూ చుట్టుకొని ఉండగా, క్రూరగ్రహాలతో కూడిన రోహిణిలా కనబడుతూ, ఆభరణాలు విడవడంవల్ల, పువ్వులు లేని పూఁదీగలా, సొంపు తక్కి, ఆ అశోకవనం నడుమ హనుమంతునకు కనిపించింది.
సా మలేనచ దిగ్ధాంగీ వపుషా చాప్యలంకృతా ।
మృణాళీ పంకదిగ్ధేవ విభాతి న విభాతి చ ॥ 25
తాతూడు నిలువెల్ల బురదలో మునిగి, ప్రకాశించకపోయినా, సహజంగా తెల్లనైంది కాబట్టి, ప్రకాశిస్తూ ఉన్నట్లు, ఆ చెలువ, అంగాలన్నీ ముఱికి నిండి ఉన్నా, స్వభావసిద్ధమైన దేహసౌందర్యమే అలంకారంగా ఉండడం వల్ల, ప్రకాశిస్తూ, కనబడుతోంది.
మలినేన తు వస్త్రేణ పరిక్లిష్టేన భామినీమ్‌ ।
సంవృతాం మృగశాబాక్షీం దదర్శ హనుమా న్కపిః ॥ 26
తాం దేవీం దీనవదనా మదీనాం భర్తృ తేజసా ।
రక్షితాం స్వేన శీలేన సీతా మసితలోచనామ్‌ ॥ 27
మలినమై, మిక్కిలి నలగిన లువను ట్టుకొని, జింకకొదమలా బెళుకున్నుగవ ళుక్రొత్తుతూ, మొగాన దైన్యం పొంది, భర్తతేజాన్ని తలచుకొన్నపుడుమాత్రం దైన్యం లేనిదై , తన పాతివ్రత్యమే తనకు కాపుగా, నల్లనికన్నుగవతో చెన్నారే, దేవిని, హనుమంతుఁడు చూశాడు.
తాం దృష్ట్వా హనుమాన్‌ సీతాం మృగశాబనిభేక్షణామ్‌ ।
మృగకన్యా మివ త్రస్తాం వీక్షమాణాం సమంతతః ॥ 28
దహంతీమివ నిశ్శ్వాసై ర్వృక్షాన్‌ పల్లవధారిణః ।
సంఘాతమివ శోకానాం దుఃఖ స్యోర్మి మి వోత్థితామ్‌ ॥ 29
తాం క్షమాం సువిభక్తాంగీం వినాభరణశోభినీమ్‌ ।
ప్రహర్ష మతులం లేభే మారుతిః ప్రేక్ష్య మైథిలీమ్‌ ॥ 30
కొదమలేడిలా, బెదరు న్నుగవ లిగి, బెదరిన లేడిలా, నలువైపులా చూస్తూ, వేడినిట్టూర్పులతో అక్కడి వృక్షాల చిగురుటాకులు దహిస్తున్నట్లు కనిపిస్తూండగా, రూపం దాల్చిన దు:ఖసమూహంలా, పెల్లు రేగిన దుఃఖపుటూర్మిలా,  చార్పు కల్గి, సువిభక్తాంగియై, ఆభరణాలేవీ లేకపోయినా, శోభిస్తున్న,సీతను చూసి, వాయుసుతుడు హనుమంతుఁడు, ఇంతింత నరాని సంతోషాన్ని పొందాడు.
హర్షజాని చ సోశ్రూణి తాం దృష్ట్వా మదిరేక్షణాం ।
ముమోచ హనుమాం స్తత్ర నమశ్చక్రే చ రాఘవమ్‌ ॥ 31
ఆ వనంలో, మదిరేక్షణ సీతాదేవిని చూసి, హనుమంతుఁడు, కన్నుల నందబాష్పాలు విడుస్తూ, రాముని తలచుకొని, నమస్కరించాడు.
నమస్కృత్వా చ రామాయ లక్ష్మణాయ చ వీర్యవాన్‌ !
సీతాదర్శనసంహృష్టో హనుమాన్‌ సంవృతో౭భవత్‌ ॥ 32
వీర్యవంతుఁడు ఆ హనుమంతుఁడు, రామలక్ష్మణులకు నమస్కరించి, సీతను చూసినందుకు మిక్కిలి ప్పొంగి, రాక్షసస్త్రీలు తనను చూడకుండా, ఆ వృక్షపు ఆకుజొంపాలు ప్పికొని ఉన్నాడు.
-------------------------------------------------------------------------------------------------
రామో దాశరథి శ్శూరో లక్ష్మణానుచరో బలీ | కాకుత్స్థః పురుషః పూర్ణః కౌసల్యేయో రఘూత్తమః ||22||
ఇత్యార్షే శ్రీమద్వాల్మీకిరామాయణే ఆదికావ్యే సుందరకాండే సప్తదశస్సర్గః (17)
మంగళం మహత్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sundarakanda సుందరకాండ 35

                                     రామసుందరం పఞ్చత్రింశస్సర్గః తాం తు రామకథాం శ్రుత్వా వైదేహీ వానరర్షభాత్‌ । ఉవాచ వచనం సాంత్వ మిద...