25, ఏప్రిల్ 2011, సోమవారం

మేఘసందేశం 33 వ శ్లోకం

హారాంస్తారాం స్తరళగుటికా న్కోటిశః శంఖశుక్తీః
ఘాసశ్యామాన్మరకతమణీనున్మయూఖప్రరోహా౯,
దృష్ట్వా యస్యాం విపణిరచితాన్విద్రుమాణాం చ భంగా౯
సంలక్ష్యంతే సలిలనిధయ స్తోయమాత్రావశేషాః.



భావం:



ఆ విశాలాపట్టణంలోని అంగడివీథుల్లో,

కోట్లకొలది శుద్ధములైన నాయకరత్నాలను,

ముత్యాలహారాలను,

శంఖాలను,

ముత్యపుచిప్పలను,

పచ్చికలా ఆకుపచ్చవర్ణం కల్గిన మరకతమణులను,

పగడపుఖండాలను, చూచి, ప్రజలు,

"సముద్రాలలో ఇక నీరుమాత్రమే మిగిలింది.

రత్నాలు లేవు.

ఎందుకంటే అన్ని సముద్రాల్లోని రత్నాలు

ఇక్కడ చేరాయి కదా!." ~ అని భావిస్తారు.

విశాలాపట్టణం రత్నసంపదకు ఆలవాలం అని భావం.



మంగళం మహత్




ప్రేమావతారుడైన భగవాన్ శ్రీసత్యసాయిబాబావారి
దివ్యచరణారవిందాలకు సజల నయనాలతో నమస్సులు.



మంగళం మహత్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

SUNDARAKANDA సుందరకాండ 36

  రామసుందరం - షట్త్రింశస్సర్గః   భూయ ఏవ మహాతేజా హనూమాన్మారుతాత్మజః | అబ్రవీత్ప్రశ్రితం వాక్యం సీతాప్రత్యయకారణాత్ || 1 || సీతక...