వీచిక్షోభస్తనితవిహగశ్రేణికాంచీగుణాయాః
సంసర్పంత్యాః స్ఖలితసుభగం దర్శితావర్తనాభేః,
నిర్వింధ్యాయాః పథి భవ రసాభ్యంతరః సన్నిపత్య
స్త్రీణామాద్యం ప్రణయవచనం విభ్రమో హి ప్రియేషు.
భావం:
నీవు ఉజ్జయినీ పట్టణానికి పోతున్నప్పుడు,
మార్గమధ్యంలో,
"నిర్వింధ్య " అనే నదిని కలుసుకోగలవు.
( ఈ నది, వింధ్య పర్వతానికి ఉత్తరంగా ప్రవహించే నది. )
ఆ నది అలల కదలికలకు,
( హంసాది ) పక్షులు, ధ్వనులు చేస్తూంటాయి.
ఆ పక్షుల పంక్తులు కనులకింపుగా ఉంటాయి.
ఆ నది తొట్రుపాటు పడుతూ,
సుందరంగా ప్రవహిస్తూ పోతూంటుంది.
సుడులు తిరుగుతూ ఉంటుంది.
ఆ నదిని కలిసి, ( ఆ నదీజలాలను తీసుకొని, )
రసాంతరంగుడివి కా. ( రసాంతరంగుడు = జలము లోపల కలవాడు. )
విశేషాలు:
పై భావం శ్లోకంలోని మూడు పాదాలకు.
దీనిలో ఒక అంతరార్థం ఉంది.
అది వివరించాక, నాలుగవ పాదభావం తెలుసుకొందాం.
నిర్వింధ్యను స్త్రీతో పోలిస్తే,
పైన పేర్కొన్న పక్షుల వరుసలు ఆమె మొలనూలు.
సుడి ఆమె నాభి.
తొట్రుపాటు ప్రవాహం , స్త్రీ సహజసుందరగమనం.
ఆమె నుండి మేఘుడు గ్రహించే రసం శృంగార రసం.
రసం అనే పదానికి ఉన్న అనేక అర్థాల్లో
జలం అనే అర్థాన్ని,
శృంగారరసార్థాన్ని,
కాళిదాసు ఇలా అందంగా ఉపయోగించుకొన్నాడు.
ఇక నాల్గవపాదానికి భావం:
స్త్రీలకు ప్రియులయందు, విలాసమే మొదటి ప్రణయవచనం అవుతోంది.
అంటే,
ఆడువారు, తమ విలాసాలచేతనే,
తమ మనోభిప్రాయాలను ప్రియులకు తెలుపుతారు.
గ్రహించినవాడు శ్రీనాథుడవుతాడు. - శృంగారి.
గ్రహించనివాడు వేమన అవుతాడు. - విరాగి.
మంగళం మహత్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
SUNDARAKANDA సుందరకాండ 36
రామసుందరం - షట్త్రింశస్సర్గః భూయ ఏవ మహాతేజా హనూమాన్మారుతాత్మజః | అబ్రవీత్ప్రశ్రితం వాక్యం సీతాప్రత్యయకారణాత్ || 1 || సీతక...
-
రామసుందరం - షట్త్రింశస్సర్గః భూయ ఏవ మహాతేజా హనూమాన్మారుతాత్మజః | అబ్రవీత్ప్రశ్రితం వాక్యం సీతాప్రత్యయకారణాత్ || 1 || సీతక...
-
తత్రావశ్యం వలయకులిశోద్ఘట్టనోద్గీర్ణతోయం నేష్యంతి త్వాం సురయువతయో యంత్రధారాగృహత్వం , తాభ్యో మోక్షస్తవ యది సఖే ఘర్మలబ్ధస్య న స్యాత్ క్రీడాలోల...
-
రామసుందరం 1-4 త్వమేషాం జాతవీర్యాణాం పునరేవోత్పతిష్యతాం | పాతళస్యాప్రమేయస్య ద్వారమావృత్య తిష్ఠసి || 93 || వీరులైన వా...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి