24, ఏప్రిల్ 2011, ఆదివారం

మేఘసందేశం 32 వ శ్లోకం

దీర్ఘీ కుర్వ౯ పటు మదకలం కూజితం సారసానాం
ప్రత్యూషేషు స్ఫుటితకమలామోదమైత్రీకషాయః,
యత్ర స్త్రీణాం హరతి సురతగ్లానిమంగానుకూలః
శిప్రావాతః ప్రియతమ ఇవ ప్రార్థనాచాటుకారః.


భావం:



ఆ విశాలాపట్టణం దగ్గరలో శిప్రానది ఉంది.

ఆ శిప్రానది గాలి,

అంటే ఆ నదిమీదినుండి వీచే ( చల్లని ) గాలి,

బెగ్గురుపక్షుల చక్కని కూజితాలను, దీర్ఘం చేసేది.

అంటే వాటి ధ్వనులను ఎడతెగకుండా చేసేది.

వికసించిన ( శిప్రానదిలోని ) పద్మాల పరిమళంతో కూడినది.

ఇంకా ఆ శిప్రానది గాలి తిన్నగా వీచి, శరీరానికి సుఖంగా సోకేది.

ఈ విధంగా శైత్యం, ( శీతలం )

సౌరభం, ( పరిమళం )

మాంద్యం ( నెమ్మది )

మొదలైన గుణాలతో కూడిన సామర్థ్యంతో

శిప్రానది గాలి,

స్త్రీల రతిశ్రమను పోగొడుతుంది.

తిరిగి అభిలాషను పుట్టిస్తుంది.




అని, శిప్రానది గాలిని యక్షుడు మేఘునికి వర్ణించిచెప్పాడు.



మంగళం మహత్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

SUNDARAKANDA సుందరకాండ 36

  రామసుందరం - షట్త్రింశస్సర్గః   భూయ ఏవ మహాతేజా హనూమాన్మారుతాత్మజః | అబ్రవీత్ప్రశ్రితం వాక్యం సీతాప్రత్యయకారణాత్ || 1 || సీతక...