విశ్రాంతః సన్వ్రజ వననదీతీరజాతాని సించ
న్నుద్యానానాం నవజలకణై ర్యూథికాజాలకాని,
గండస్వేదాపనయనరుజాక్లాంతకర్ణోత్పలానాం
ఛాయాదానాత్క్షణపరిచితః పుష్పలావీముఖానాం.
భావం:
నీవు,
ఆ నీచైర్గిరియందు శ్రమదీర్చుకొంటూ,
వననదీతీర ఉద్యానవనాల్లో,
( అక్కడి అడవులందలి నదుల ఒడ్డుల్లో ఉన్న తోటల్లో ),
పూచిన మొల్లమొగ్గలను,
క్రొత్త నీటిచుక్కలచేత తడుపు.
చెక్కిళ్ల మీద చెమటను,
పోగొట్టి, ఆ బాధతో వాడిన నల్లకలువలు చెవికొనల్లో గల,
పువ్వులు కోస్తున్న స్త్రీల ముఖాలకు,
ఛాయను ఇచ్చి,
కాసేపు పరిచయం గలవాడవై,
పొమ్ము.
అంటే,
అక్కడ పువ్వులు కోస్తున్న స్త్రీలు ఉంటారు.
వారికి ఎండచేత చెమట పట్టకుండా ఛాయను దానం చేయి.
ఇక్కడ ఛాయ అంటే "నీడ" అని "కాంతి" అని రెండు అర్థాలు చెప్పవచ్చు.
నీడను ఇస్తే సంతోషిస్తారు.
మరి కాంతి?
వారి ముఖాలు సహజకాంతివంతాలు.
సూర్యకాంతివల్ల వారి ముఖాల్లోని కాంతి అదృశ్యమైంది.
ఇపుడు మేఘుని నీడ వల్ల సూర్యకాంతి పడకపోవడంతో,
వారి ముఖకాంతి మరల వారి ముఖాలను చేరుతుంది.
అది వారికీ నీకూ సంతోషం కలిగిస్తుంది.
ఆ ఉపకారంచేత వారికీ నీకూ పరిచయం కూడా కలుగుతుంది.
ఇది నీకు ఇంకా సంతోషం కలిగిస్తుంది.
నిజమే కదా!
మగవారికి స్త్రీల పరిచయాన్నిమించిన ఆనందం ఏముంది?
కాని, దురుద్దేశంతో చేసుకొనే పరిచయాలు
పాములై కాటేస్తాయి అంటాడీ రావెమెస్సారెల్.
మంగళం మహత్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
SUNDARAKANDA సుందరకాండ 36
రామసుందరం - షట్త్రింశస్సర్గః భూయ ఏవ మహాతేజా హనూమాన్మారుతాత్మజః | అబ్రవీత్ప్రశ్రితం వాక్యం సీతాప్రత్యయకారణాత్ || 1 || సీతక...
-
రామసుందరం - షట్త్రింశస్సర్గః భూయ ఏవ మహాతేజా హనూమాన్మారుతాత్మజః | అబ్రవీత్ప్రశ్రితం వాక్యం సీతాప్రత్యయకారణాత్ || 1 || సీతక...
-
తత్రావశ్యం వలయకులిశోద్ఘట్టనోద్గీర్ణతోయం నేష్యంతి త్వాం సురయువతయో యంత్రధారాగృహత్వం , తాభ్యో మోక్షస్తవ యది సఖే ఘర్మలబ్ధస్య న స్యాత్ క్రీడాలోల...
-
రామసుందరం 1-4 త్వమేషాం జాతవీర్యాణాం పునరేవోత్పతిష్యతాం | పాతళస్యాప్రమేయస్య ద్వారమావృత్య తిష్ఠసి || 93 || వీరులైన వా...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి