రామసుందరం 1-2
తేన పాదపముక్తేన పుష్పౌఘేణ సుగంధినా |
సర్వతస్సంవృతశ్శైలో బభౌ పుష్పమయో యథా || 13 ||
రాలిన, సుగంధభరితమైన ఆ పూలతో పర్వతమంతా నిండిపోయి, ఒక పూలకొండలా ప్రకాశించింది.
తేన చోత్తమవీర్యేణ పీడ్యమానస్స పర్వతః |
సలిలం సంప్రసుస్రావ మదం మత్త ఇవ ద్విపః || 14 ||
(మావటివానిచే) పీడింపబడిన ఏనుగు ఎక్కువ మదజలం* విడిచినట్లు, హనుమచే పీడింపబడిన ఆ పర్వతం తన సెలయేళ్ల వల్ల ఎక్కువ జలాన్ని
విడిచింది.
పీడ్యమానస్తు బలినా మహేంద్ర స్తేన పర్వతః |
రీతీ ర్నిర్వర్తయామాస కాంచనాంజనరాజతీః || 15 ||
బంగారు ఱాళ్లు, నీలంపు ఱాళ్లు, వెండి ఱాళ్లు పగిలి, వాని రేఖలు కనిపించాయి.
ముమోచ చ శిలాశ్శైలో విశాలాస్సమనశ్శిలాః |
మధ్యమేనార్చిషా జుష్టో ధూమరాజీరివానలః || 16 ||
సప్తజ్వాల*ల్లో మధ్యదైన ధూమ్రవర్ణ అనే జ్వాలతో కూడిన
నిప్పు*నుండి
పొగలు
వెలువడినట్లు ఆ పర్వతం నుండి
పొగలాంటి
(నల్లని) ఱాళ్లు బయటపడ్డాయి.
గిరిణాపీడ్యమానేన పీడ్యమానానిసర్వతః |
గుహావిష్టాని భూతాని వినేదుర్వికృతైస్స్వరైః || 17
||
గిరిగుహల్లో నివసిస్తున్న భూతాలు (ప్రాణులు) వికృతస్వరాలతో గగ్గోలు పెట్టాయి.
స మహాసత్వ్తసన్నాద శ్శైలపీడానిమిత్తజః |
పృథివీం పూరయామాస దిశశ్చోపవనాని చ || 18 ||
శైలపీడానిమిత్తాలైన ఆ ఆక్రందన ధ్వనులు భూమి అంతా నిండాయి. దిశ*లందూ, ఉపవనాలందూ వ్యాపించాయి.
శిరోభిః పృథుభిస్సర్పా
వ్యక్తస్వస్తికలక్షణైః |
వమంతః పావకం ఘోరం దదంశు ర్దశనైశ్శిలాః || 19 ||
సర్పాలు* కలతపడి, (కోపంతో) విషాగ్నులను క్రక్కుతూ శిలలను కాటువేశాయి.
తా స్తదా సవిషైర్దష్టాః కుపితైస్తైర్మహాశిలాః |
జజ్వలుః పావకోద్దీప్తా బిభిదుశ్చ సహస్రథా || 20 ||
కాటుకులోనైన ఆ గండశిలలు విషాగ్నికీలలతో మండుతూ, వేయి తునకలుగా పగిలాయి.
యాని చౌషధజాలాని తస్మిన్ జాతాని పర్వతే |
విషఘ్నాన్యపి నాగానాం న శేకు శ్శమితుం విషమ్ ||21||
(అన్నిరకాల) విషాలను హరించే ఔషధాలు ఆ పర్వతం మీద ఉన్నా, ఆ సర్పాల ఘోరవిషాన్ని మాత్రం హరింపలేకపోయాయి.
భిద్యతే౭యం గిరిర్భూతై రితి మత్వా తపస్వినః |
త్రస్తా విద్యాధరా స్తస్మా దుత్పేతుః స్త్రీగణైస్సహ || 22
||
(పంచ) భూతాలచే ఈ కొండ పగులకొట్టబడుతోంది అని తలచి, తాపసులు కలతచెందారు. విద్యాధరులు* భయపడి, తమ స్త్రీలతో ఆకాశానికి ఎగిరిపోయారు.
పానభూమిగతం హిత్వా హైమమాసవభాజనం |
పాత్రాణి చ మహార్హాణి కరకాంశ్చ హిరణ్మయాన్ || 23 ||
ఆ విద్యాధరులు, బంగారంతో చేసిన పాన,
భోజన పాత్రలను,
కలశాలను
లేహ్యానుచ్చావచాన్భక్ష్యాన్ మాంసాని వివిధాని చ |
ఆర్షభాణి చ చర్మాణి ఖడ్గాంశ్చ
కనకత్సరూన్ || 24 ||
లేహ్యా*లను, భక్ష్యా*లను,
పలాలను, ఎద్దుచర్మపుడాళ్లను, బంగారు పిడులు గల ఖడ్గాలను అక్కడే
విడిచిపెట్టి ఎగిరిపోయారు.
కృతకంఠగుణాః క్షీబా రక్తమాల్యానులేపనాః |
రక్తాక్షాః పుష్కరాక్షాశ్చ గగనం ప్రతిపేదిరే || 25 ||
కంఠహారాలు, ఎఱ్ఱని
పూలమాలలు, రక్తచందనాలు
ధరించిన, ఎఱ్ఱనికండ్లుగల
ఆ విద్యాధరులు
ఆకాశానికి
చేరారు.
హారనూపుర కేయూర పారిహార్యధరాః స్త్రియః |
విస్మితా స్సస్మితా స్తస్థు రాకాశే రమణైస్సహ || 26 ||
హారాలు, అందెలు,
కేయూరాలు,
కంకణాలు ధరించిన విద్యాధర స్త్రీలు, విస్మితులై, సస్మితులై,
భర్తలతో కూడి,
ఆకాశాన నిలిచారు.
దర్శయంతో మహావిద్యాం విద్యాధరమహర్షయః |
సహితా స్తస్థురాకాశే వీక్షాంచక్రుశ్చ పర్వతమ్ || 27
||
విద్యాధరమహర్షులు నిరాధారంగా
ఆకాశంలో ఉండటం అనే
మహావిద్యను
ప్రదర్శిస్తూ,
పర్వతాన్ని చూస్తూ,
శుశ్రువుశ్చ తదా శబ్ద మృషీణాం భావితాత్మనాం |
చారణానాం చ సిద్ధానాం స్థితానాం విమలే(అ)ంబరే || 28
||
నిర్మలాకాశంలో
భావితాత్ములైన
ఋషుల*,చారణుల,
సిద్ధుల* మాటలను
విన్నారు.
ఏష పర్వతసంకాశో హనూమాన్ మారుతాత్మజః |
తితీర్షతి మహావేగః సముద్రం మకరాలయమ్ || 29 ||
పర్వతాకారుడు, మహావేగం గలవాడు, వాయునందనుడైన హనుమంతుడు మకరాలయమైన (మొసళ్లకు నిలయమైన) సముద్రాన్నిదాట గోరుతున్నాడు.
రామార్థం వానరార్థం చ చికీర్షన్ కర్మ దుష్కరం |
సముద్రస్య పరం పారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్ఛతి ||
30 ||
రామునికొఱకు, వానరుని
(సుగ్రీవుని) ప్రయోజనంకొఱకు ఎవరికీ చేయ నలవిగాని
పని చేయగోరి, దాట నలవిగాని సముద్రపు ఆవలిగట్టుకు చేర
గోరుతున్నాడు.
ఇతి విద్యాధరాశ్శ్రుత్వా వచస్తేషాం మహాత్మనాం |
తమప్రమేయం దదృశుః పర్వతే వానరర్షభమ్ || 31 ||
ఆ మహాత్ముల మాటలను విని, విద్యాధరులు, అప్రమేయుడైన ఆ వానరోత్తముని చూశారు.
దుధువే చ స రోమాణి చకంపే చాచలోపమ: |
ననాద సుమహానాదం సుమహానివ తోయద: || 32 ||
కొండంతటి హనుమంతుడు వెండ్రుకలను
విదిల్చాడు.
అటూ ఇటూ కదిలాడు. గొప్ప మేఘంలా మహానాదం చేశాడు.
ఆనుపూర్వ్యేణ వృత్తం చ లాంగూలం లోమభిశ్చితం |
ఉత్పతిష్యన్ విచిక్షేప పక్షిరాజ ఇవోరగమ్ ||33||
ఎగరడానికి సన్నద్ధుడై, ఆఁదోక*గా ఉండి, వెండ్రుకలతో నిండిన తన
వాలాన్ని(తోకను)
గరుత్మంతుడు
వ్యాళాన్ని(పామును)
విదలించినట్లు
విదిలించాడు.
తస్య లాంగూల మావిద్ధ మాత్తవేగస్య పృష్ఠతః |
దదృశే గరుడేనేవ హ్రియమాణో మహోరగః || 34 ||
ఆ మహావేగవంతుని వెనుక వంకరగా వ్రేలాడే ఆ లాంగూలం(తోక) గరుత్మంతునిచే తీసుకొనిపోయే మహాసర్పంలా కనబడింది.
బాహూ సంస్తంభయామాస మహాపరిఘసన్నిభౌ |
ససాద చ కపిః కట్యాం చరణౌ సంచుకోచ చ || 35 ||
గొప్ప పరిఘ*ల్లాంటి తన బాహువుల్ని స్తంభింపజేసి, ఊపిరిని ఊర్ధ్వముఖంగా బిగపట్టి,
నడుమును సన్నగా
చేసి, పాదాలను
ముడుచుకొని,
సంహృత్య చ భుజౌ శ్రీమాన్ తథైవ చ శిరోధరాం |
తేజస్సత్త్వం తథా వీర్య మావివేశ స వీర్యవాన్ || 36 ||
భుజాలను, మెడను
బిగపట్టి, తనకున్న
తేజం, బలం,
వీర్యం అంతటినీ పూని, (సకల శక్తుల్నీ కేంద్రీకరించి)
మార్గమాలోకయన్ దూరా దూర్ధ్వం ప్రణిహితేక్షణః |
రురోధ హృదయే ప్రాణా నాకాశ మవలోకయన్ || 37 ||
దూరంగా వెళ్లాల్సిన మార్గాన్ని చూస్తూ, ఊర్ధ్వంగా దృష్టిని ఉంచి, ఆకాశాన్ని చూస్తూ, హృదయాన ఉచ్ఛ్వాసనిశ్శ్వాసాలను
బిగపట్టి,
పద్భ్యాం దృఢమవస్థానం కృత్వా స కపికుంజరః |
నికుంచ్య కర్ణౌ హనుమా నుత్పతిష్య న్మహాబలః || 38 ||
పాదాల్ని నేలపై దృఢంగా మోపి, చెవుల్ని రిక్కించి, పై కెగరడానికి సన్నద్ధుడై,
వానరా న్వానరశ్రేష్ఠ ఇదం వచనమబ్రవీత్ |
యథా రాఘవనిర్ముక్తః శరః శ్వసనవిక్రమః || 39 ||
ఆ వానర శ్రేష్ఠుడు, వానరులతో, " రాముడు విడచిన బాణం వాయువేగంతో
వెళ్లినట్లు, మిక్కిలి
వేగంతో
గచ్ఛేత్ తద్వద్గమిష్యామి లంకాం రావణపాలితాం |
నహి ద్రక్ష్యామి యది తాం లంకాయాం జనకాత్మజామ్ || 40 ||
నేను, రావణపాలిత
లంక*కు వెళ్తాను.
అక్కడ జానకిని
చూడనేని,
అనేనైవ హి వేగేన గమిష్యామి సురాలయం |
యది వా త్రిదివే సీతాం న ద్రక్ష్యా మ్యకృతశ్రమ: || 41
||
అదే వేగంతో స్వర్గానికి వెళ్తాను. అక్కడ కూడా సీతను చూడనిచో,
బద్ద్వా రాక్షసరాజాన మానయిష్యామి రావణం |
సర్వథా కృతకార్యో౭హ మేష్యామి సహ సీతయా || 42 ||
రావణుని బంధించి, తీసుకొని వస్తాను. ఏదేమైనా,
ఏవిధంగానైనా
కృతకృత్యుడనై, సీతతో
సహా తిరిగి వస్తాను.
ఆనయిష్యామి వా లంకాం సముత్పాట్య సరావణాం |
ఏవముక్త్వా తు హనుమాన్ వానరాన్ వానరోత్తమః || 43 ||
లేకపోతే, రావణునితో
సహా లంకను పెల్లగించి, తీసుకొని వస్తాను" అని, పలికి,
ఉత్పపాతాథ వేగేన వేగవానవిచారయన్ |
సుపర్ణమివ చాత్మానం మే న స కపికుంజరః || 44 ||
ఎట్టి విచారం లేకుండా, వేగంగా ఆకాశానికి ఎగిరాడు. అపుడు ఆయన
తనను సుపర్ణుని*లా భావించుకొన్నాడు.
సముత్పతతి తస్మిం స్తు వేగాత్తే నగరోహిణః |
సంహృత్య విటపాన్ సర్వాన్ సముత్పేతుస్సమంతతః || 45 ||
ఆయన ఎగరగానే,
ఆ వేగానికి పర్వతంపై గల వృక్షాలన్నీ తమ కొమ్మలతో సహా ఆకాశానికి ఎగిరాయి.
స మత్తకోయష్టిబకాన్ పాదపాన్ పుష్పశాలినః |
ఉద్వహన్నూరువేగేన జగామ విమలే(అ)ంబరే || 46 ||
మదించిన కొక్కెరలు, పుష్పాలు కలిగిన ఆ వృక్షాల్ని తన తొడలవేగంతో వెంట తీసుకొనిపోతూ,
నిర్మలాకాశంలో పురోగమించాడు.
ఊరువేగోద్ధతా వృక్షా ముహూర్తం కపిమన్వయుః |
ప్రస్థితం దీర్ఘమధ్వానం స్వబంధుమివ బాంధవాః || 47 ||
సుదీర్ఘయాత్రకు బయలుదేరిన బంధువును వీడ్కొల్పటానికి
మిగిలినవారు కొంతదూరం అనుసరించినట్లు, వృక్షాలన్నీ ముహూర్తకాలం ఆయనను వెంబడించాయి.
తమూరువేగోన్మథితా స్సాలాశ్చాన్యే నగోత్తమాః |
అనుజగ్ముర్హనూమంతం సైన్యా ఇవ మహీపతిమ్ || 48 ||
ఆయన తొడల వేగపుధాటికి పెల్లగించబడిన సాలవృక్షాలు మొదలైన
మహావృక్షాలు
సైన్యాలు
మహారాజునులా
హనుమంతుని
అనుసరించాయి.
సుపుష్పితాగ్రైర్బహుభిః పాదపైరన్వితః కపిః |
హనుమాన్ పర్వతాకారో బభూవాద్భుతదర్శనః || 49 ||
బాగా పుష్పించిన బహు
వృక్షాలనడుమ ఉండడంతో, పర్వతాకారుడైన
ఆ హనుమంతుడు
చూసేవారికి
అద్భుతంగా కనబడ్డాడు.
సారవంతో౭థ యే వృక్షా న్యమజ్జన్ లవణాంభసి |
భయాదివ మహేంద్రస్య పర్వతా వరుణాలయే || 50 ||
దేవేంద్రునికి భయపడి, పర్వతాలు, సముద్రంలో దాక్కొన్నట్లు*, (ముందుగా) బరువుగల చెట్లన్నీ సముద్రంలో పడి, మునిగిపోయాయి.
స నానాకుసుమైః కీర్ణః కపిస్సాంకురకోరకైః |
శుశుభే మేఘసంకాశః ఖద్యోతైరివ పర్వతః || 51 ||
అనేక రకాల కుసుమా*లతో, మొలకలతో, మొగ్గలతో కప్పబడిన హనుమంతుడు, (రాత్రులందు) మిణుగుఱుపురుగులతో కూడిన
పర్వతంలా దీపించాడు.
విముక్తాస్తస్య వేగేన ముక్త్వా పుష్పాణి తే ద్రుమాః |
అవశీర్యంత సలిలే నివృత్తాస్సుహృదో యథా || 52 ||
ఆయన నుండి విడివడి, ఆత్మీయులను కొంతదూరం* అనుసరించి, వెనుతిరిగిన మిత్రుల్లా, పూలను విడచి, ఆ చెట్లన్నీ నీటిలో పడ్డాయి.
-----------------------------------------------------------------------------------------------------
* ఆఁదోక - ఆవుతోక. మొదట లావుగా, వర్తులాకారంగా నుండి, క్రమక్రమంగా సన్నబడిన ఆకృతి.
* పరిఘ - ఇనుప గుదియ. నాలుగుమూరల నిడివి గల దండం.
* లంక - విశ్వకర్మ అనే దేవశిల్పి, మాల్యవదాదుల కోరిక మీద పసిడిభవనాలతో నిర్మించిన సుందరనగరం. పిదప కుబేరుని
స్వాధీనమైంది. ఆ తరువాత రావణుడు దాన్ని ఆక్రమించుకొన్నాడు.
* సుపర్ణుడు - మంచిఱెక్కలు గలవాడు అని వ్యుత్పత్తి. గరుత్మంతుడు. వినత కశ్యపులకు
జన్మించిన వాడు. పుట్టగానే ఆకాశాని కెగిరి, తిరిగి వచ్చినవాడు. మాతృభక్తి కలవాడు. అనూరుడు ఇతని సోదరుడు. ఇతనికి
విష్ణువే స్వయంగా తనకు వాహనమయ్యేలా వరం ఇచ్చాడు.
* వివరణ - పర్వతాలు ప్రజాపతి సంతానం. వాటికి మొదట ఱెక్కలు ఉండేవి.
అవి తమ ఇచ్ఛవచ్చినచోటుకు ఎగిరిపోయి,
వ్రాలుతూండటంతో ప్రజలకు, భూమికి
బాధలు కలుగుతూండేవి. దాంతో ఇంద్రుడు వాటి ఱెక్కలు తెగగొట్టాడు. ఈ ఱెక్కలే
మేఘాలయ్యాయి.
* కుసుమం - భ్రమరాలతో కూడిన పుష్పాన్ని కుసుమం అనాలి.
* బంధువులు ఇంటికి వచ్చి, తిరిగి పయనమైనప్పుడు వారిని నీటి
సమీపం వఱకు దిగబెట్టాలి. అనగా చెఱువు వఱకు. తరువాత ఇక పోగూడదు. ఇంటికి వచ్చేయాలి.
---------------------------------------------------------------------------------------------------
ధ్యాత్వా నీలోత్పలశ్యామం రామం రాజీవలోచనం | జానకీ లక్ష్మణోపేతం జటామకుట మండితం || 2 ||
మంగళం మహత్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి