రామసుందరం
ఏకాదశస్సర్గః
అవధూయ
చ తాం బుద్ధిం బభూ వావస్థిత స్తదా |
జగామ
చాపరాం చింతాం సీతాంప్రతి మహాకపి: || 1
వానరశ్రేష్ఠుడైన ఆ
హనుమ, అప్పుడు (మండోదరే సీత
అనే) ఆ
ఊహను తొలగించుకొని, స్వస్థచిత్తుడై, సీతను
గూర్చి వేఱు ఆలోచన చేశాడు.
న
రామేణ వియుక్తా సా స్వప్తుమర్హతి భామినీ |
న
భోక్తుం నాప్యలంకర్తుం న పాన ముపసేవితుమ్ || 2
రాముని ఎడబాటు పొందిన సీత, నిద్రించగలదా? ఈ పరిస్థితిలో ఆమె అన్నపానాదులు స్వీకరించదు. ఆభరణాల విషయమే
పట్టదు.
నాన్యం
నర ముపస్థాతుం సురాణామపి చేశ్వరమ్ |
న
హి రామసమ:
కశ్చిత్ విద్యతే త్రిదశేష్వపి || 3
సీతాసాధ్వి, పరపురుషు నెవ్వరిని చేర నంగీకరించదు. త్రిలోకాధిపతిని గూడ కన్నెత్తి చూడదు. దేవతలందఱిలో గూడ శ్రీరామునితో సమానమైనవాడు లేడు.
అన్యేయమితి
నిశ్చిత్య భూయస్తత్ర చచార స: |
పానభూమౌ
హరిశ్రేష్ఠ: సీతాసందర్శనోత్సుక:
|| 4
ఇక్కడ నేను చూస్తున్నఈమె
వేఱెవ్వతెయో అయి ఉండునోపు.
అని నిశ్చయించుకొని, హనుమ తిరిగి ఆ పానమందిరంలో తిరుగాడ దొడగెను.
క్రీడితేనాపరా: క్లాంతా గీతేన చ తథా౭పరా: |
నృత్తేన
చాపరా:
క్లాంతా:
పానవిప్రహతాస్తథా || 5
ఆ పానభూమియందు, ఆడి అలసినవారు కొందఱు, పాడి, ఒడలెఱుగక నిద్రించినవారు
మరికొందఱు, నృత్యాన్ని
ప్రదర్శించి అలసినవారు మరికొందఱు,
త్రాగి, ఒడలెఱుగక పడి ఉన్నవారు మరికొందఱు ఉన్నారు.
మురజేషు
మృదంగేషు పీఠికాసు చ సంస్థితా: |
తథా౭౭స్తరణముఖ్యేషు
సంవిష్టాశ్చాపరా: స్త్రియ:
|| 6
కొందఱు స్త్రీలు ఆ
పానమందిరంలో, మురజాలను, మృదంగాలను, పీఠాలను ఆనుకొని
నిద్రిస్తున్నారు. కొందఱు ఉత్తమమైన తివాచీలు మున్నగువానియందు విశ్రమించి ఉన్నారు.
అంగనానాం
సహస్రేణ భూషితేన విభూషణై:
|
రూపసల్లాపశీలేన
యుక్తగీతార్థభాషిణా || 7
వివిధాలంకారభూషితలు, రూపసల్లాపశీలురు, యుక్తగీతార్థభాషిణులు,
దేశకాలాభియుక్తేన
యుక్తవాక్యాభిధాయినా |
రతాభిరతసంసుప్తం
దదర్శ హరియూథప: ||
8
దేశకాలానుగుణవర్తనులు, సందర్భోచితసంభాషణాచతురులు, అయిన పెక్కురు అంగనలతో భోగేచ్ఛ తీరాక, నిద్రిస్తున్న రావణుని హనుమ చూశాడు.
అన్యత్రాపి
వరస్త్రీణాం రూపసంలాపశాలినామ్ |
సహస్రం
యువతీనాం తు ప్రసుప్తం స దదర్శ హ || 9
మరొకచోట రూపసల్లాపశాలినులైన,
శ్రేష్ఠులైన పెక్కుమంది స్త్రీలు
నిద్రిస్తూండగా, హనుమంతుడు చూశాడు.
తాసాం
మధ్యే మహాబాహు:
శుశుభే రాక్షసేశ్వర: |
గోష్ఠే
మహతి ముఖ్యానాం గవాం మధ్యే యథా వృష: || 10
విశాల గోశాలలో, ఉత్తమజాతి ఆవులమధ్య,
ఆంబోతులా
స
రాక్షసేంద్రశ్శుభే తాభి:
పరివృత: స్వయమ్ |
కరేణుభిర్యథారణ్యే
పరికీర్ణో మహాద్విప: || 11
అరణ్యంలో, ఆడఏనుగులతో పరివృతమైన మదపుటేనుగులా, మహాబాహువైన రావణుడు శోభిల్లుతున్నాడు.
సర్వకామైరుపేతాం
చ పానభూమిం మహాత్మన:
|
దదర్శ
హరిశార్దూల: తస్య
రక్ష:పతేర్గృహే || 12
ఆ రావణుని గృహంలో
సర్వభోగ్యవస్తువులతో కూడిన పానభూమిని,
ఆ కపివరుడు తిలకించాడు.
మృగాణాం
మహిషాణాం చ వరాహాణాం చ భాగశ: |
తత్ర
న్యస్తాని మాంసాని పానభూమౌ దదర్శ స: || 13
ఆ పానభూమిలో వేర్వేఱుగా ఉంచిన
లేళ్ళ, దున్నల, అడవిపందుల మాంసాలను,
రౌక్మేషు
చ విశాలేషు భాజనేష్వర్ధభక్షితాన్ |
దదర్శ
హరిశార్దూలో మయూరాన్ కుక్కుటాం స్తథా || 14
సగం తిని వదలివేసిన నెమళ్ల కోళ్ళ
మాంసాలను,
వరాహవార్ధ్రాణసకాన్
దధిసౌవర్చలాయుతాన్ |
శల్యాన్
మృగమయూరాంశ్చ హనుమా నన్వవైక్షత || 15
పెరుఁగుతో, సౌవర్చలం అనే లవణంతో వండిన అడవిపందుల,
వార్ధ్రాణసాల (ఒకజాతిపక్షి. మేకపోతని
కొందఱు, ఖడ్గమృగమని
కొందఱు. వార్ధ్రాణసం అంటే నోరు, చెవులు, ముక్కు, మూడింటితో త్రాగేది, ఇంద్రియాలు క్షీణించి ఉండేది, తెల్లనిది, ముసలిది, ఆడుమేకలకు పెనిమిటి
అయిన మేక. (పరమార్థచంద్రిక)), ముళ్ళపందుల, లేళ్ల, నెమళ్ల, మాంసాలను,
క్రకరాన్
వివిధాన్ సిద్ధాన్ చకోరానర్ధభక్షితాన్ |
మహి
షానేకశల్యాంశ్చ ఛాగాంశ్చ కృతనిష్ఠితాన్ || 16
కొక్కెరల, చకోరాల, మహిషాల, చేపల, మేకల మాంసాలను సగం తిని వదలివేసిన వాటిని,
హనుమ చూశాడు.
లేహ్యానుచ్చావచాన్
పేయాన్ భోజ్యాని వివిధాని చ |
తథా౭౭మ్లలవణోత్తంసై:
వివిధైరాగషాడబై: || 17
వివిధ పచ్చళ్లను, పానీయాలను, భోజ్యపదార్థాలను,
పులుపు ఉప్పు మొదలైనవాటితో చేసినవి,
వివిధ రాగ(పలుచని) షాడవ/బ(చిక్కని) ఫలరసాలను,
హారనూపురకేయూరై:
అపవిద్ధైర్మహాధనై: |
పానభాజనవిక్షిప్తై:
ఫలైశ్చ వివిధైరపి || 18
ధరించి విడచిన అమూల్యహారాలను, నూపురాలను, కేయూరాలను,
ఫలాలతో నిండిన పానపాత్రలను, హనుమ చూశాడు.
కృతపుష్పోప
హారా భూ: అధికం పుష్యతి శ్రియమ్ |
తత్ర
తత్ర చ విన్యస్తై: సుశ్లిష్టై: శ్శయనాసనై: || 19
అక్కడక్కడ బాగా అమర్చిన
శయ్యాసనాలతో, అలంకరించబడి ఉన్నపువ్వులతో,
పానభూమిర్వినా
వహ్నిం ప్రదీప్తేవోపలక్ష్యతే |
బహుప్రకారై
ర్వివిధై: వరసంస్కారసంస్కృతై: || 20
ఆ పానభూమి, శోభిల్లుతూ,
అగ్ని లేకుండగానే
ప్రజ్వరిల్లుతోందా అన్నట్లుంది. శ్రేష్ఠమైన రీతులలో
మాంసై:
కుశలసంపృక్తై: పానభూమిగతై: పృథక్ |
దివ్యా:
ప్రసన్నా వివిధా: సురా: కృతసురా అపి || 21
నిపుణులైన వంటవారితో వండిన బహువిధ
మాంసాహారాలు, ఆ పానభూమియందు ఉన్నాయి. సహజ మద్యాలు
శర్కరా౭౭సవమాధ్వీక పుష్పాసవఫలాసవా: |
వాసచూర్ణైశ్చ
వివిధై: దృష్టాస్తైస్తై: పృథక్ పృథక్ || 22
శర్కరతో, తేనెతో, బహువిధపుష్పాలతో నిర్మింపబడినవి, వివిధ
పరిమళచూర్ణాలతో కలుపబడినవైన కృత్రిమ
మద్యాలను, మారుతి చూశాడు.
సంతతా
శుశుభే భూమి: మాల్యైశ్చ బహుసంస్థితై: |
హిరణ్మయైశ్చ
వివిధై: భాజనై: స్ఫాటికైరపి |
జాంబూనదమయైశ్చాన్యై:
కరకైరభిసంవృతా || 23
అనేకవిధపూలమాలలతో, బంగారుపాత్రలతో, స్ఫటికపాత్రలతో, నిండిన
ఆ పానభూమి ఎంతో శోభిస్తోంది. ఇంకా
బంగారు గిండిచెంబులతో,
ఆ పానభూమి ఎంతో ప్రకాశిస్తోంది.
రాజతేషు
చ కుంభేషు జాంబూనదమయేషు చ
|
పానశ్రేష్ఠం
తదా భూరి కపిస్తత్ర దదర్శ హ || 24
మారుతి, వెండి బంగారు కడవల్లో పూర్తిగా నింపబడిన మేలైన మద్యాన్ని,
సో౭పశ్యచ్ఛాతకుంభాని
శీధోర్మణిమాయాని చ
|
రాజతాని
చ పూర్ణాని భాజనాని మహాకపి:
|| 25
చెఱకురసంతో చేసిన మద్యం నిండిన
మణిమయ బంగారు వెండి పాత్రల్ని,
క్వచిదల్పావశేషాణి
క్వచిత్పీతాని సర్వశ:
|
క్వచిన్నైవ
ప్రపీతాని పానాని స దదర్శ హ || 26
సగం త్రాగినవి,
పూర్తిగా త్రాగినవి,
అసలు త్రాగనివి అయిన కొన్నిమద్యపాత్రల్ని
చూశాడు.
క్వచిద్భక్ష్యాంశ్చ
వివిధాన్ క్వచిత్పానాని భాగశ: |
క్వచిదర్ధావశేషాణి
పశ్యన్ వై విచచార హ || 27
ఒకచోట బహువిధ భక్ష్యాలు,ఇంకొకచో వేర్వేరుగా ఉన్న మద్యాలు,
ఒకచోట సగం మిగిలిన మద్యపాత్రల్ని
చూస్తూ తిరిగాడు.
క్వచిత్
ప్రభిన్నై: కరకై: క్వచిదాలోళితైర్హటై: |
క్వచిత్
సంపృక్తమాల్యాని జలాని చ ఫలాని చ || 28
కొన్ని చోట్ల పగిలిన చిన్న చెంబులు,
దొర్లిన ఘటాలు,
వెదజల్లబడున్న మాలలు, జలాలు, ఫలాలు
(చూశాడు).
శయనాన్యత్ర
నారీణాం శుభ్రాణి బహుధా పున: |
పరస్పరం
సమాశ్లిష్య కాశ్చిత్ సుప్తా వరాంగనా: || 29
శుభ్రంగా ఉన్న స్త్రీల తల్పాలను,వాటిపై పరస్పరం కౌగిలించుకొని పడుకొన్నస్త్రీలను,
కాశ్చిచ్చ
వస్త్రమన్యస్యా: స్వపంత్యా: పరిధాయ చ |
ఆహృత్య
చాబలాస్సుప్తా నిద్రాబలపరాజితా: || 30
ఒళ్ళు మరచిన నిద్రలో నిద్రిస్తున్న
ప్రక్క స్త్రీల వస్త్రాలను లాగి, తమ
మేనికి చుట్టుకొన్నఆడవారిని, చూస్తూ, హనుమంతుడు తిరిగాడు.
తాసాముచ్ఛ్వాసవాతేన
వస్త్రం మాల్యం చ గాత్రజమ్ |
నాత్యర్థం
స్పందతే చిత్రమ్ ప్రాప్య మంద మివానిలమ్ || 31
ఆ వనితల ఉచ్ఛ్వాసనిశ్శ్వాసాలకు,
వారి ఒంటిపై ఉన్న వస్త్రాలు, మాలలు, పిల్లగాలులకు కదలినట్లు చిత్రంగా
కొంచెం కదలుతున్నాయి.
చందనస్య
చ శీతస్య శీధోర్మధురసస్య చ |
వివిధస్య
చ మాల్యస్య ధూపస్య వివిధస్య చ || 32
చల్లని చందనం,
తియ్యని మద్యం, వివిధ పరిమళ మాలలు, ధూపాలు ఉన్నాయి.
బహుధా
మారుత స్తత్ర గంధమ్ వివిధ ముద్వహన్ |
రసానాం
చందనానాం చ ధూపానాం చైవ మూర్ఛిత: || 33
వాయువు (పైన చెప్పిన)
ఆ రస చందన ధూపాదుల వివిధ గంధాలను
అంతటా వ్యాపింపచేస్తున్నాడు.
ప్రసవౌ
సురభిర్గంధో విమానే పుష్పకే తదా |
శ్యామావదాతాస్తత్రాన్యా:
కాశ్చిత్ కృష్ణావరాంగనా: || 34
అప్పుడు ఆ సువాసనలు
పుష్పకం అంతటా వ్యాపించాయి.
అక్కడి స్త్రీలు కొందఱు చామనచాయ
గలవారు.
నల్లని వారు కొందఱు,
కాశ్చిత్
కాంచనవర్ణాంగ్య: ప్రమదా రాక్షసాలయే |
తాసాం
నిద్రావశత్వాచ్చ మదనేన విమూర్ఛితమ్ || 35
బంగారువన్నె గలవారు కొందఱున్నారు.
నిద్రవల్లనూ, కామకేళిలో అలసినందువల్లనూ, నిద్రిస్తున్న వారి రూపాలు,
పద్మినీనాం
ప్రసుప్తానాం రూపమాసీద్యథైవ హి |
ఏవం
సర్వమశేషేణ రావణాంతఃపురం కపి: |
దదర్శ
సుమహాతేజా న దదర్శ చ జానకీమ్ || 36
ముకుళించిన తామరతీగల్లా ఉన్నాయి.
ఆ మారుతి ఈవిధంగా ఉన్న
రావణాంతఃపురంలో
అడుగడుగూ గాలించాడు.
జానకిని మాత్రం చూడలేకపోయాడు.
నిరీక్షమాణశ్చ
తదా తాస్స్త్రియ స్స మహాకపి: |
జగామ
మహతీం శంకామ్ ధర్మసాధ్వసశంకిత: || 37
ఆ స్త్రీలను చూస్తున్నఆ మారుతి, ధర్మలోపం కల్గింది కదా!
అనే సంశయంతో చింతించాడు.
పరదారావరోధస్య
ప్రసుప్తస్య నిరీక్షణమ్ |
ఇదం
ఖలు మమాత్యర్థం ధర్మలోపం కరిష్యతి || 38
“ఈ నిద్రిస్తున్న పరదారలను చూడడం
నాకు ధర్మలోపం కల్గిస్తుంది.
న
హి మే పరదారాణాం దృష్టిర్విషయవర్తినీ |
అయం
చాత్ర మయా దృష్ట: పరదారపరిగ్రహ: || 39
పరసతులమీద
నాకు విషయవాసనాదృష్టే లేదు.
కానీ పరదారను పరిగ్రహించిన రావణుడు
నా కంట పడ్డాడు”.
తస్య
ప్రాదురభూచ్చింతా పునరన్యా మనస్విన: |
నిశ్చితైకాంతచిత్తస్య
కార్యనిశ్చయదర్శినీ || 40
నిశ్చితైకాంతచిత్తుడు,
కార్యనిశ్చయదర్శినుడు,
మనస్వినుడు అయిన ఆ మారుతికి మరో
చింత కలిగింది.
కామం
దృష్టా మయా సర్వా విశ్వస్తా రావణస్త్రియ: |
న
హి మే మనస:కించిత్
వైకృత్యముపపద్యతే || 41
“ఇతరులు చూస్తున్నారనే భయం
లేనందున యథేచ్చగా నిద్రిస్తున్న
రావణాసురుని కాంతలందర్నీ నేను స్వేచ్ఛగా
చూశాను. ఐనా నా మనస్సుకు ఎట్టి
వికారమూ కలగలేదు.
మనో
హి హేతుస్సర్వేషామ్ ఇంద్రియాణాం ప్రవర్తనే |
శుభాశుభాస్వవస్థాసు
తచ్చ మే సువ్యవస్థితమ్ || 42
నాన్యత్ర
హి మయా శక్యా వైదేహీ పరిమార్గితుమ్ |
స్త్రియో
హి స్త్రీషు దృశ్యంతే సదా సంపరిమార్గణే || 43
ఇక్కడ కాక ఇంకెక్కడ సీతను వెదుకను?
ఆడువారిని ఆడువారియందే కదా
వెదకాలి!
యస్య
సత్త్వస్య యా యోని: తస్యామ్ తత్పరిమార్గ్యతే |
నశక్యా
ప్రమదా నష్టా మృగీషు పరిమార్గితుమ్ || 44
ఒక జంతువును, ఆ జాతి జంతువుల మధ్యనే వెదకాలి.
తప్పిపోయిన ఇంతిని వెదకడం
మృగాలమధ్య సాధ్యం కాదు కదా!
తదిదం
మార్గితం తావత్ శుద్ధేన మనసా మయా |
రావణాంత:పురం
సర్వం దృశ్యతే న చ జానకీ ||
45
అందువల్ల శుద్ధమైన మనస్సుతో,
ఈ రావణాంత:పురం మొత్తం గాలించాను.
జానకి మాత్రం కనిపించలేదు”.
దేవగంధర్వకన్యాశ్చ
నాగకన్యాశ్చ వీర్యవాన్ |
అవేక్షమాణో
హనుమాన్ నైవాపశ్యత జానకీమ్ || 46
దేవకన్యలను, గంధర్వకన్యలను నాగకన్యలను చూశాడు కానీ హనుమంతుడు, సీతను మాత్రం చూడలేకపోయాడు.
తామపశ్యన్
కపి స్తత్ర పశ్యంశ్చాన్యా వరస్త్రియ: |
అపక్రమ్య
తదా వీర: ప్రధ్యాతు ముపచక్రమే || 47
మారుతి, సీతను కానక ఎందఱో ఇతర స్త్రీలను చూస్తూ, ఆ చోటు విడచి, ఆలోచనలో పడ్డాడు.
స
భూయస్తు పరం శ్రీమాన్ మారుతి ర్యత్నమాస్థిత: |
ఆపానభూమి
ముత్సృజ్య తాం విచేతుం ప్రచక్రమే || 48
(ఆ తర్వాత) శ్రీమంతుడైన ఆ
హనుమంతుడు ఆ పానభూమిని విడచి, తీవ్రమైన
ప్రయత్నంతో మళ్లీ ఆ
రావణాంతఃపురంలో సీతను వెదకసాగాడు.
-----------------------------------------------------------------------------------------------------------------------------
ఆరామః కల్పవృక్షాణాం విరామః సకలాపదామ్ | అభిరామస్త్రిలోకానాం
రామః శ్రీమాన్ స నః ప్రభుః ||16||
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే ఏకాదశస్సర్గః (11)
మంగళం మహత్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి