రామసుందరం
చతుర్థస్సర్గః
స నిర్జీత్య పురీం
శ్రేష్ఠాం లంకాం తాం కామరూపిణీమ్ |
విక్రమేణ మహాతేజా హనూమాన్ కపిసత్తమః || 1
హనుమంతుడు, శ్రేష్ఠపట్టణస్వరూపమైన లంకాధిదేవతను జయించాడు.
అద్వారేణ మహాబాహుః ప్రాకారమభిపుప్లువే |
ప్రవిశ్య నగరీం లంకాం కపిరాజహితంకరః || 2
ముఖ్యద్వారంనుండి కాక
ప్రాకారంపైనుండి దుమికి,
లంకలోకి అడుగు పెట్టాడు.
చక్రే౭థ పాదం సవ్యం చ శత్రూణాం స తు మూర్ధని |
ప్రవిష్ట
స్సత్త్వసంపన్నోనిశాయాం మారుతాత్మజః || 3
ఆ నిశివేళ, శత్రు శి(బి)రాన మొదట ఎడమపాదం మోపి,
ప్రవేశించాడు.
స మహాపథమాస్థాయ ముక్తాపుష్పవిరాజితమ్ |
తతస్తు తాం పురీం లంకాం రమ్యామభియయౌకపిః || 4
ముక్తాపుష్పాలతో విరాజిల్లే రాజమార్గాన,
పురంలోకి వెళ్లాడు.
హసితోత్కృష్టనినదైః తూర్యఘోషపురస్సరైః |
వజ్రాంకుశనికాశైశ్చ వజ్రజాలవిభూషితైః || 5
చక్కని నవ్వులతో,
వాద్యఘోషలతో, వజ్రాంకుశంలా వజ్రఖచితగృహాలతో
గృహమేఘైః పురీ రమ్యా బభాసే ద్యౌరివాంబుదైః |
ప్రజజ్వాల తదా లంకా రక్షోగణగృహైశ్శుభైః || 6
ఆ లంక, మేఘాలతో నిండిన ఆకాశంలా ఉంది.
ఆ రాక్షసుల శుభగృహాలతో
వెలుగుతోంది.
సితాభ్రసదృశైశ్చిత్రైః పద్మస్వస్తికసంస్థితైః |
వర్ధమానగృహైశ్చాపి సర్వతస్సువిభూషితైః || 7
అంతటా, పద్మం, స్వస్తికం, వర్ధమానం అనే నిర్మాణవిశేషాలతో
కట్టిన తెల్లని మేఘాల్లాంటి గృహాలతో
విభూషితమై ఉంది.
తాం చిత్రమాల్యాభరణాం కపిరాజహితంకరః |
రాఘవార్థం చరన్
శ్రీమాన్ దదర్శ చ ననంద చ || 8
చిత్రమాల్యాభరణాలతో
అలంకృతమైన ఆ లంకను చూచి,
హనుమంతుడు, (సీతను
చూడబోతున్నానని) ఆనందించాడు.
భవనాద్భవనం గచ్ఛన్ దదర్శ పవనాత్మజః |
వివిధాకృతిరూపాణి భవనాని తతస్తతః || 9
ఆ పవనాత్మజుడు, ప్రతి
ఇంటిని చూస్తూ,
ముందుకు వెళ్తున్నాడు. ఆ భవనాలు ఒకదానిమించి మఱొకటి వివిధాకృతులలో ఉన్నాయి.
శుశ్రాన మధురం గీతం త్రిస్థానస్వరభూషితమ్ |
స్త్రీణాం మదసమృద్ధానాం దివి చాప్సరసామివ || 10
మదవతులైన స్త్రీలు,
మూడుస్థాయిల్లోనూ,
అప్సరసల్లా చేస్తున్న మధుర గానాన్ని మారుతి విన్నాడు.
శుశ్రాన కాంచీనినదం నూపురాణాం చ నిస్వనమ్ |
సోపాననినదాంశ్చైవ భవనేషు మహాత్మనామ్ || 11
స్త్రీల ఒడ్డాణపు సవ్వడులను,
వారి కాలి అందెల ధ్వనులను,
మెట్లపై నడిచేటప్పుడు కలిగే రవాలను విన్నాడు.
ఆస్ఫోటితనినాదాంశ్చ క్ష్వేళితాంశ్చ తతస్తతః |
శుశ్రాన జపతాం తత్ర మంత్రాన్ రక్షోగృహేషు వై || 12
అక్కడక్కడ
జబ్బలు / చేతులు చఱచు ధ్వనులు,
వేదమంత్రధ్వనులు విన్నాడు.
స్వాధ్యాయనిరతాంశ్చైవ యాతుధానాన్ దదర్శ స: |
రావణస్తవసంయుక్తాన్ గర్జతో
రాక్షసానపి || 13
వేదాధ్యాయరతులను,
సంయుక్తంగా రావణుని స్తుతిస్తున్నవారిని, గర్జిస్తున్నవారిని చూశాడు.
రాజమార్గం సమావృత్య స్థితం రక్షోబలం మహత్|
దదర్శ మధ్యమే గుల్మే రావణస్య చరాన్ బహూన్ || 14
రాజమార్గం చుట్టూ చేరిన
రాక్షససైన్యాన్ని,
వారిమధ్యలో
పెక్కు గూఢచారుల్ని చూశాడు.
దీక్షితాన్ జటిలాన్
ముండాన్ గో౭జినాంబరవాసస: |
దర్భముష్టిప్రహరణాన్ అగ్నికుండాయుధాంస్తథా || 15
హనుమంతుడి చూసినవారిలో, (యజ్ఞ) దీక్షితులు, జడధారులు, శిరోముండనం
చేయించుకొన్నవారు,
ఎద్దుతోలు కట్టుకొన్నవారు,
పిడికిలిలో ధరించిన దర్భలతో అనిష్టం
నివారించేవారు,
హోమం చేసి, పొందిన
కృత్యాదిశక్తులను శత్రువులపైకి ప్రయోగించేవారు,
కూటముద్గరపాణీంశ్చ దండాయుధధరానపి |
ఏకాక్షానేకకర్ణాంశ్చ లంబోదరపయోధరాన్ || 16
కూట ముద్గర దండాయుధధరులు,
ఏకకర్ణులు, లంబోదరపయోధరులు,
కరాళాన్
భుగ్నవక్త్రాంశ్చ వికటాన్ వామనాంస్తథా |
ధన్విన: ఖడ్గినశ్చైవ శతఘ్నీముసలాయుధాన్ || 17
వికృతశరీరులు, భుగ్నవక్త్రులు,
వికటులు, వామనులు,
ధనుః ఖడ్గ శతఘ్నీ ముసలాయుధధారులు,
పరిఘోత్తమహస్తాంశ్చ విచిత్రకవచోజ్జ్వలాన్ |
నా౭తిస్థూలాన్ నాతికృశాన్
నా౭తిదీర్ఘాతిహ్రస్వకాన్ || 18
పరిఘహస్తులు, విచిత్రకవచులు, నాతిస్థూలురు, నాతికృశులు,
నాతిదీర్ఘులు, నాతిహ్రస్వులు,
నా౭తిగౌరాన్
నాతికృష్ణాన్ నా౭తికుబ్జాన్ న వామనాన్|
విరూపాన్ బహురూపాంశ్చ సురూపాంశ్చ సువర్చసః || 19
నాతిగౌరులు, నాతికృష్ణులు,
నాతికుబ్జులు, అవామనులు,
విరూపులు, బహురూపులు,
సురూపులు, సువర్చులు,
ఉన్నారు.
ధ్వజీన్ పతాకినశ్చైవ దదర్శ వివిధాయుధాన్ |
శక్తివృక్షాయుధాంశ్చైవ పట్టిశాశనిధారిణః |
క్షేపణీపాశహస్తాంశ్చ దదర్శ స మహాకపిః || 20
ధ్వజాలు, పతాకాలు, వివిధాయుధాలను చూశాడు. ఈటెలు, వృక్షాలు, పట్టిసాలు, వజ్రాయుధాలు, తెడ్లు, పాశాలు ధరించినవారిని చూశాడు.
స్రగ్విణస్త్యనులిప్తాంశ్చ వరాభరణభూషితాన్ || 21
పూలమాలలు, సుగంధద్రవ్యాలు,
ఆభరణాలు ధరించినవారిని,
నానావేషసమాయుక్తాన్ యథా స్వైరగతాన్ బహూన్ |
తీక్ష్ణశూలధరాంశ్చైవ వజ్రిణశ్చ మహాబలాన్ || 22
నానావిధవేషధారుల్ని,
పదునైన శూలాలు, వజ్రాయుధాలు ధరించిన, మహాబలుల్ని చూశాడు.
శతసాహస్రమవ్యగ్రమ్ ఆరక్షం మధ్యమం కపిః |
రక్షో౭ధిపతినిర్దిష్టం దదర్శాంతఃపురాగ్రతః || 23
రావణుని ఆదేశానుసారం
పట్టణం లోపలిభాగంలో
కావలి ఉన్న వేలమంది సైనికులను చూశాడు.
స తదా తద్గృహం దృష్ట్వా మహాహాటకతోరణమ్ |
రాక్షసేంద్రస్య
విఖ్యాతమ్ అద్రిమూర్ధ్ని ప్రతిష్టితమ్ || 24
విశాలమైన స్వర్ణసింహద్వారంతో,
త్రికూటపర్వతశిఖరాన
ప్రతిష్టితమై,
పుండరీకావతంసాభిః పరిఖాభిరలంకృతమ్ |
ప్రాకారావృతమత్యంతం దదర్శ స మహాకపిః || 25
తామరపూవులున్న అగడ్తలు,
చుట్టూ ప్రాకారం ఉన్నరావణుని గృహాన్ని చూశాడు.
త్రివిష్టపనిభం దివ్యం దివ్యనాదనినాదితమ్ |
వాజిహేషితసంఘుష్టం నాదితం భూషణైస్తదా || 26
స్వర్గంతో సమానమై,
దివ్యమై, దివ్యనాదాలతో
ప్రతిధ్వనిస్తూ,
గుఱ్ఱాల సకిలింపులతో,
(అక్కడివారు
ధరించిన) ఆభరణాలతో ధ్వనిస్తూ,
రథైర్యానైర్విమానైశ్చ తథా హయగజైశ్శుభైః |
వారణైశ్చ చతుర్దంతైః శ్వేతాభ్రనిచయోపమైః || 27
రథాలు, పల్లకీలు, విమానాలతో, శుభలక్షణాలుకల గుఱ్ఱాలు, ఏనుగులు, తెల్లనిమేఘాల్లాంటి నాలుగుదంతాల భద్రగజాలతో,
భూషితం రుచిరద్వారం మత్తైశ్చ మృగపక్షిభిః |
రక్షితం సుమహావీరైః యాతుధానైస్సహస్రశః |
రాక్షసాధిపతేర్గుప్తమ్ ఆవివేశ గృహం కపిః || 28
మత్తిల్లిన మృగపక్షులతో
భూషితమైన మనోహరద్వారంతో,
మహావీరులైన రాక్షసులతో
రక్షింపబడుతున్న
రావణుని గృహంలోకి ఆంజనేయుడు ప్రవేశించాడు.
స హేమజాంబూనదచక్రవాళం
మహార్హముక్తామణిభూషితాంతమ్ |
పరార్ధ్యకాలాగరుచందనాక్తం
స రావణాంతఃపురమావివేశ || 29
తప్తకాంచనప్రాకారాలతో విలసిల్లుతూ,
ముత్యాలు, మణులతో అలంకృతమైన లోపలిభాగాలలో, కాలాగరుచందనపరిమళాలు వెదజల్లే, రావణాంతఃపురంలోకి, ఆంజనేయుడు అడుగుపెట్టాడు.
------------------------------------------------------------------------------------------------------------
జానునీ
సేతుకృత్ పాతు జంఘే దశముఖాంతకః |
పాదౌ విభీషణ శ్రీదః పాతు రామ౭ఖిలం
వపుః ||9||
ఇత్యార్షే
శ్రీమద్రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే చతుర్థస్సర్గః (4)
మంగళం మహత్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి