రామసుందరం
ద్వాదశస్సర్గః
స
తస్య మధ్యే భవనస్య మారుతి:
లతాగృహాంశ్చిత్రగృహాన్
నిశాగృహాన్ |
జగామ
సీతాం ప్రతిదర్శనోత్సుకో
న
చైవ తాం పశ్యతి చారుదర్శనామ్ || 1
మారుతి, సీతను దర్శింపగోరి,
పట్టుదలతో రావణుని భవనానికి మధ్యనున్న లతాగృహాల్ని, చిత్రశాలల్ని, నిశామందిరాల్ని, వెదికాడు.
కాని ఆ చక్కని సీత మాత్రం కనబడలేదు.
స
చింతయామాస తతో మహాకపి:
ప్రియామపశ్యన్
రఘునందనస్య తామ్ |
ధ్రువం
న సీతా ధ్రియతే యథా న మే
విచిన్వతో
దర్శనమేతి మైథిలీ || 2
రాముని ప్రియపత్నిజానకిని
చూడలేకపోయిన హనుమ,
ఇలా అనుకొన్నాడు. "ఎంత వెదకినా, మైథిలి
కనబడలేదు. కాబట్టి ఆమె నిశ్చయంగా మరణించి ఉంటుంది.
సా
రాక్షసానామ్ ప్రవరేణ జానకీ
స్వశీలసంరక్షణతత్పరా
సతీ |
అనేన
నూనం ప్రతి దుష్టకర్మణా
హతా
భవేదార్యపథే పరే స్థితా || 3
పాతివ్రత్యరక్షణలో ధర్మనిశ్చయం
కలదైన ఉత్కృష్టమైన సజ్జనులమార్గాన్ని స్వీకరించిన, సీత, రావణుని
కాదన్నందుకు ఆ దుష్టునిచే తప్పక చంపబడే ఉంటుంది.
విరూపరూపా
వికృతా వివర్చసో
మహాననా
దీర్ఘవిరూపదర్శనా:
|
సమీక్ష్య
సా రాక్షసరాజయోషితో
భయాద్వినష్టా
జనకేశ్వరాత్మజా || 4
రావణయోషితలైన రాక్షసస్త్రీలు
విరూపరూపలు. వికృతలు. తేజోహీనదేహులు. మహాననులు. దీర్ఘవిరూపదర్శనులు. వారిని చూచి
భయంతో జానకి ప్రాణాలు విడచి ఉంటుంది.
సీతా
మదృష్ట్వా హ్యనవాప్య పౌరుషం
విహృత్య
కాలమ్ సహ వానరైశ్చిరమ్ |
న
మే౭స్తి సుగ్రీవసమీపగా గతి:
సుతీక్ష్ణదండో
బలవాంశ్చ వానర: || 5
వానరులతో కలసి, ఇంతకాలం వెదికాను.
కాని ఆమె కనపడలేదు. పురుష ప్రయత్నం విఫలమైంది. ఈ స్థితిలో
సుగ్రీవుని వద్దకు వెళ్లరాదు.
వెళ్తే తీక్ష్ణంగా దండిస్తాడు.
దృష్టమంత:పురం సర్వం దృష్టా రావణయోషిత: |
న
సీతా దృశ్యతే సాధ్వీ వృథా జాతో మమ శ్రమ: || 6
రావణాంతఃపురం సర్వం చూశాను. రావణకాంత లందఱూ
కనబడ్డారు. సీతాసాధ్వి కనబడలేదు. నా శ్రమంతా వృథా
అయింది.
కిం
ను మాం వానరాస్సర్వే గతం వక్ష్యంతి సంగతా: |
గత్వా
తత్ర త్వయా వీర కిం కృతం తద్వదస్వ న: || 7
నేను తిరిగి వెళ్తే, వానరులందఱూ, నా చుట్టూ చేరి, ఏమంటారో? "వీరా! లంకకు వెళ్లి ఏం చేశావు? మాకు
చెప్పు". అంటారు.
అదృష్ట్వా
కిం ప్రవక్ష్యామి తామహం జనకాత్మజామ్ |
ధ్రువం
ప్రాయముపైష్యంతి కాలస్య వ్యతివర్తనే || 8
జానకిని చూడకుండా నేను ఏం సమాధానం ఇవ్వగలను?
సమయం మించిపోతే వాళ్లు ప్రాయోపవేశం చేస్తారు.
కిం
వా వక్ష్యతి వృద్ధశ్చ జాంబవానంగదశ్చ స: |
గతం
పారం సముద్రస్య వానరాశ్చ సమాగతా: || 9
వానరుల్ని కలుసుకొంటే, జాంబవంతుడు, అంగదుడు, తక్కినవారు
ఏమంటారో ఏమో?
అనిర్వేదశ్శ్రియో
మూలమ్ అనిర్వేద:
పరం సుఖమ్ |
భూయస్తత్ర
విచేష్యామి న యత్ర విచయ:
కృత: || 10
వేదన లేకుండా ఉత్సాహంతో ఉంటే, శ్రేయోసిద్ధి, పరమసుఖం కల్గుతాయి. కాబట్టి ఇంతవఱకు
వెదకని ప్రదేశాలన్నీ వెదకుతాను.
అనిర్వేదో
హి సతతం సర్వార్థేషు ప్రవర్తక: |
కరోతి
సఫలం జంతో:
కర్మ
యత్ తత్ కరోతి స:
|| 11
సర్వార్థాల్లో అనిర్వేదంగా ఉండటమే
శ్రేయస్కరం. అది పనుల్ని
సఫలం చేస్తుంది.
తస్మాదనిర్వేదకృతం
యత్నం చేష్టే౭హముత్తమమ్ |
అదృష్టాంశ్చ
విచేష్యామి దేశాన్ రావణపాలితాన్ || 12
అందువల్ల దిగులు పడకుండా,
గట్టి ప్రయత్నం చేస్తాను. వెదకని
ప్రదేశాలన్నీ వెదకుతాను.
ఆపానశాలా
విచితా:
తథా పుష్పగృహాణి చ |
చిత్రశాలాశ్చ
విచితా భూయ:
క్రీడాగృహాణి చ || 13
పానశాలలు మొదలు పుష్పగృహాలు, చిత్రశాలలు, క్రీడాగృహాలు,
నిష్కుటాంతరరథ్యాశ్చ
విమానాని చ సర్వశ:
|
ఇతి
సంచింత్య భూయో౭పి విచేతుముపచక్రమే || 14
గృహోద్యానాలు, అందలి వీథులు, భవనాల్ని పూర్తిగా గాలించాను. అయినా మళ్లీ
వెదకుతాను" అని ఆలోచించి, మళ్లీ వెదకడం ప్రారంభించాడు.
భూమీ
గృహాంశ్చైత్య గృహాన్ గృహాతిగృహకానపి |
ఉత్పతన్నిష్పతంశ్చాపి
తిష్ఠన్గచ్ఛన్ పునః పునః || 15
అన్ని రకాల గృహాల్నిమళ్లీ మళ్లీ
వెదకాడు. ఆ యా చోట్ల ఎక్కుతూ,
దిగుతూ, నిలబడుతూ,
ముందుకువెళ్తూ,
అపావృణ్వంశ్చ
ద్వారాణి కవాటాన్యవఘాటయన్ |
ప్రవిశన్నిష్పతంశ్చాపి
ప్రపతన్నుత్పతన్నపి || 16
తలుపులు తెరుస్తూ, మూస్తూ, లోపలికి వెళ్తూ, బయటకు వస్తూ, వెదకాడు.
సర్వమప్యవకాశం
స విచచార మహాకపిః |
చతురంగుళమాత్రో2పి నావకాశః స విద్యతే |
రావణాన్తఃపురే
తస్మిన్ యం కపిర్న జగామ సః || 17
ఇలా హనుమ వెదకని స్థలం లేదు. రావణాంతఃపురంలో ప్రతి
అంగుళం గాలించివేశాడు.
ప్రాకరాన్తర
రథ్యాశ్చ వేదికాశ్చైత్య సంశ్రయాః |
దీర్ఘికాః
పుష్కరిణ్యశ్చ సర్వం తేనావలోకితమ్ || 18
వీథుల్ని, కూడళ్లను,
వేదికల్ని, దిగుడుబావుల్ని,
సరస్సుల్ని పరిశీలించాడు.
రాక్షస్యో
వివిధాకారా విరూపా వికృతాస్తథా |
దృష్టా
హనుమతా తత్ర న తు సా జనకాత్మజా || 19
వివిధాకారాల రాక్షసస్త్రీలని
చూశాడు. జానకి మాత్రం కనబడలేదు.
రూపేణాప్రతిమా
లోకే వరా విద్యాధర స్త్రియః |
దృష్టా
హనుమతా తత్ర న తు రాఘవ నన్దినీ || 20
విద్యాధరస్త్రీలు కనిపించారు కానీ రాఘవపత్ని
కనబడలేదు.
నాగ
కన్యా వరారోహాః పూర్ణ చన్ద్ర నిభాననాః |
దృష్టా
హనుమతా తత్ర న తు సీతా సుమధ్యమా || 21
నాగకన్యలు కనిపించారు కానీ సీత
కనబడలేదు.
ప్రమథ్య
రాక్షసేన్ద్రేణ నాగ కన్యా బలాద్ధృతాః |
దృష్టా
హనుమతా తత్ర న సా జనక నన్దినీ || 22
నిర్బంధాల్లో ఉన్న నాగకన్యల్ని
చూశాడు కానీ జానకి కనబడలేదు.
సో2పశ్యంస్తాం మహా బాహుః పశ్యంశ్చాన్యా వర స్త్రియః |
విషసాద
ముహుర్ధీమాన్ హనుమాన్ మారుతాత్మజః || 23
ఎందఱో సుందరీమణుల్నిచూశాడు కానీ
(సీత కనబడకపోవడంతో) ఎంతో విచారగ్రస్తుడయ్యాడు.
ఉద్యోగం
వానరేన్ద్రాణం ప్లవనం సాగరస్య చ |
వ్యర్థం
వీక్ష్యానిలసుత శ్చిన్తాం పునరుపాగమత్ || 24
వానరేంద్రుల ప్రయత్నం, తన సాగరలంఘనం,
వ్యర్థాలైనవికదా! అని చింతించాడు.
అవతీర్య
విమానాచ్చ హనుమాన్ మారుతాత్మజః |
చిన్తాముపజగామాథ
శోకోపహత చేతసః || 25
హనుమ, విమానం నుండి దిగి,
కలవరపాటుకు గురై, ఆలోచనలో పడ్డాడు.
-------------------------------------------------------------------------------------------------------------------------------------
తరుణౌ
రూపసమ్పన్నౌ సుకుమారౌ మహాబలౌ | పుణ్డరీకవిశాలాక్షౌ చీరకృష్ణాజినామ్బరౌ ||17||
ఇత్యార్షే
శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే సున్దరకాణ్డే ద్వాదశస్సర్గః (12)
మంగళం మహత్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి