24, మే 2020, ఆదివారం

Sundarakanda సుందరకాండ 6

                    
రామసుందరం
షష్ఠస్సర్గః
స నికామం విమానేషు విషణ్ణః కామరూపధృక్ |
విచచార పునర్లంకాం లాఘవేన సమన్వితః || 1
హనుమంతుడు, రావణుని గృహాల్లో ఎక్కడా సీత జాడ కానక, ఎంతో విచారించాడు. మరల జాగరూకుడై, లాఘవంతో లంకంతా వెదకడం మొదలుపెట్టాడు.
ఆససాదాథ లక్ష్మీవాన్ రాక్షసేంద్రనివేశనమ్ |
ప్రాకారేణార్కవర్ణేన భాస్వరేణాభిసంవృతమ్ || 2
సూర్యకాంతితో ప్రకాశిస్తున్న ప్రాకారం కల రావణుని ప్రాసాదాన్ని సమీపించాడు.
రక్షితం రాక్షసైర్ఘోరైః సింహైరివ మహద్వనమ్ |
సమీక్షమాణో భవనం చకాశే కపికుంజరః || 3
సింహరక్షితవనంలా, భయంకరరాక్షసుల కాపలాలో ఉన్న ఆ భవనాన్ని చూచి, ఆశ్చర్యపడ్డాడు.
రూప్యకోపహితైశ్చిత్రైః తోరణైర్హేమభూషితైః |
విచిత్రాభిశ్చ కక్ష్యాభిః ద్వారైశ్చ రుచిరైర్వృతమ్ || 4
దానికి వెండిబంగారాలతో నిర్మించిన తోరణాలు, చిత్రవిచిత్ర అంతస్తులు, అందమైన ద్వారాలు ఉన్నాయి.
గజాస్థితైర్మహామాత్రైః శూరైశ్చ విగతశ్రమైః |
ఉపస్థితమసంహార్యైః హయైస్స్యందనయాయిభిః || 5
ఆ భవనసమీపంలో మదపుటేనుగులపై శూరులున్నారు. అశ్వారూఢులు, రథారూఢులు సర్వసన్నద్ధులై ఉన్నారు.
సింహవ్యాఘ్రతనుత్రాణైః దాంతకాంచనరాజతైః |
ఘోషవద్భిర్విచిత్రైశ్చ సదా విచరితం రథైః || 6
దంతాలు, వెండి, బంగారాలతో నిర్మింపబడిన రథాలు అటూ ఇటూ తిరుగుతున్నాయి. వాటిలో సింహవ్యాఘ్రచర్మాలతో చేసిన కవచాలున్నాయి.
బహురత్నసమాకీర్ణం పరార్థ్యాసనభాజనమ్ |
మహారథసమావాసం మహారథమహాస్వనమ్ || 7
రత్నాలంకృతమైన ఆ భవనంలో ఆసనాలు, పాత్రలు ఉన్నాయి. మహారథులున్నారు. మహారథాలు చేస్తున్న ధ్వనులున్నాయి.
దృశ్యైశ్చ పరమోదారైః తైస్తైశ్చ మృగపక్షిభిః |
వివిధైర్బహుసాహస్రైః పరిపూర్ణం సమంతతః || 8
వేలసంఖ్యలో, గంభీరాలై, చూడముచ్చట గొల్పే, అందమైన జింకలు, పక్షులు ఉన్నాయి.
వినీతైరంతపాలైశ్చ రక్షోభిశ్చ సురక్షితమ్ |
ముఖ్యాభిశ్చ వరస్త్రీభిః పరిపూర్ణం సమంతతః || 9
ఆ భవనం, సుశిక్షితులతో రక్షింపబడుతోంది. వరస్త్రీలతో పరిపూర్ణమై ఉంది.
ముదితప్రమదారత్నం రాక్షసేంద్రనివేశనమ్ |
వరాభరణసంహ్రాదైః సముద్రస్వననిస్స్వనమ్ || 10
రావణనివాసంలో వనితలు ఆనందంలో ఓలలాడుతున్నారు. వారి ఆభరణాల మంజుల రవాలు సముద్రపుటలలధ్వనుల్లా మనోజ్ఞంగా ఉన్నాయి.
తద్రాజగుణసంపన్నం ముఖ్యైశ్చాగరుచందనైః
మహాజనై స్సమాకీర్ణం సింహైరివ మహద్వనమ్ || 11
ఆ భవనం, ఛత్రాచామరాది రాజచిహ్నాలతో, అగరుచందనాదుల పరిమళాలతో అలరారుతోంది. బలిష్ఠులతో సింహవనంలా ఉంది.
భేరీమృదంగాభిరుతం శంఖఘోషనినాదితమ్ |
నిత్యార్చితం పర్వహుతం పూజితం రాక్షసైస్సదా || 12
భేరీమృదంగధ్వనులు, శంఖనాదాలతో మారుమ్రోగుతూ, రాక్షసులతో సర్వపర్వకాలాల్లో హోమం చేయబడుతూ, (అందఱికీ సుఖకరమైంది) ఆ భవనం పూజింపబడుతోంది. (కావలి ఉండటం వల్ల దుష్ప్రవేశమైంది)
సముద్రమివ గంభీరం సముద్రమివ నిస్స్వనమ్ |
మహాత్మనో మహద్వేశ్మ మహారత్నపరిచ్ఛదమ్ || 13
ఆ భవనం సముద్రంలా గంభీరమైనది. (రావణభయంతో) నిశ్శబ్దమైనది. దాని పైకప్పును గొప్పరత్నాలతో చేశారు.
మహారత్నసమాకీర్ణం దదర్శ స మహాకపిః |
విరాజమానం వపుషా గజాశ్వరథసంకులమ్ || 14
భవనం నిండా రత్నాలే. అటువంటి రావణుని గృహాన్ని ఆంజనేయుడు చూశాడు. గజాశ్వరథాలు, మధురాకృతి గల
లంకాభరణమిత్యేవ సో౭మన్యత మహాకపిః |
చచార హనుమాంస్తత్ర రావణస్య సమీపతః || 15
ఆ భవనం, లంకకే ఆభరణమనుకొన్నాడు. దాని సమీపంలో సంచరించాడు.
గృహాద్గృహం రాక్షసానామ్ ఉద్యానాని చ వానరః |
వీక్షమాణో హ్యసంత్రస్తః ప్రాసాదాంశ్చ చచార సః || 16
రాక్షసగృహాలను, ప్రాసాదాలను, ఉద్యానవనాలను క్రమక్రమంగా వీక్షిస్తూ, నిర్భయంగా సంచరించాడు.
అవప్లుత్య మహావేగః ప్రహస్తస్య నివేశనమ్ |
తతో౭న్యత్ పుప్లువే వేశ్మ మహాపార్శ్వస్య వీర్యవాన్ || 17
ఆయన అతివేగంతో, ప్రహస్తుని ఇంటికి, అక్కడినుండి  మహాపార్శ్వుని ఇంటికి వెళ్లాడు.
అథ మేఘప్రతీకాశం కుంభకర్ణనివేశనమ్ |
విభీషణస్య చ తదా పుప్లువే స మహాకపిః || 18
మేఘంలాంటి కుంభకర్ణుని ఇంటికి, విభీషణుని ఇంటికి వెళ్లాడు.
మహోదరస్య చ గృహం విరూపాక్షస్య చైవ హి |
విద్యుజ్జిహ్వస్య భవనం విద్యున్మాలేస్తథైవ చ || 19
తర్వాత ఆయన, మహోదరుడు, విరూపాక్షుడు, విద్యుజ్జిహ్వుడు, విద్యున్మాలుడు
వజ్రదంష్ట్రస్య చ తథా పుప్లువే స మహాకపిః |
శుకస్య చ మహాతేజాః సారణస్య చ ధీమతః || 20
వజ్రదంష్ట్రుడు, శుకుడు, సారణుడు - వీరిండ్లకు వెళ్లాడు.
తథా చేంద్రజితో వేశ్మ జగామ హరియూథపః |
జంబుమాలే స్సుమాలేశ్చ జగామ హరిసత్తమః || 21
ఇంద్రజిత్తు, జంబుమాలి, సుమాలి ఇండ్లకు వెళ్లాడు.
రశ్మికేతోశ్చ భవనం సూర్యశత్రోస్తథైవ చ |
వజ్రకాయస్య చ తథా పుప్లువే స మహాకపిః || 22
రశ్మికేతువు, సూర్యశత్రువు, వజ్రకాయుడు,
ధూమ్రాక్షస్య చ సంపాతే: భవనం మారుతాత్మజ: |
విద్యుద్రూపస్య భీమస్య ఘనస్య విఘనస్య చ || 23
ధూమ్రాక్షుడు, సంపాతి, విద్యుద్రూపుడు, భీముడు, ఘనుడు, విఘనుడు,
శుకనాసస్య వక్రస్య శఠస్య వికటస్య చ |
హ్రస్వకర్ణస్య దంష్ట్రస్య రోమశస్య చ రక్షస: || 24
శుకనాసుడు, వక్రుడు, శఠుడు, వికటుడు, హ్రస్వకర్ణుడు, దంష్ట్రుడు రోమశుడు,
యుద్ధోన్మత్తస్య మత్తస్య ధ్వజగ్రీవస్య నాదిన: |
విద్యుజ్జిహ్వేంద్రజిహ్వానాం తథా హస్తిముఖస్య చ || 25
యుద్ధోన్మత్తుడు, మత్తుడు, ధ్వజగ్రీవుడు, నాది, విద్యుజ్జిహ్వుడు, ఇంద్రజిహ్వుడు, హస్తిముఖుడు
కరాళస్య పిశాచస్య శోణితాక్షస్య చైవ హి |
క్రమమాణ: క్రమేణైవ హనుమాన్ మారుతాత్మజ: || 26
కరాళుడు, పిశాచుడు, శోణితాక్షుడు మొదలైన రాక్షసుల ఇండ్లకు వరుసగా వెళ్లి, శోధించాడు.
తేషు తేషు మహార్హేషు భవనేషు మహాయశా: |
తేషామ్ ఋద్ధిమతామ్ ఋద్ధిం దదర్శ స మహాకపి: || 27
ఆ యా గృహాల్లో సంచరిస్తూ, వారి సంపదలను వీక్షించాడు.
సర్వేషాం సమతిక్రమ్య భవనాని సమంతత: |
ఆససాదాథ లక్ష్మీవాన్ రాక్షసేంద్రనివేశనమ్ || 28
అన్ని భవనాలను పూర్తిగా శోధించాక, రావణుని ఇంటికి వెళ్లాడు.
రావణస్యోపశాయిన్యో దదర్శ హరిసత్తమ: |
విచరన్ హరిశార్దూలో రాక్షసీర్వికృతేక్షణా: || 29
రావణుని సమీపంలో శయనించిన, వికృతచూపులుగల రాక్షసస్త్రీలను చూశాడు.
శూలముద్గరహస్తాశ్చ శక్తితోమరధారిణీ: |
దదర్శ వివిధాన్ గుల్మాన్ తస్య రక్ష:పతేర్గృహే || 30
వారు శూలాలు, గుదియలు, శక్తి, తోమరాలు ధరించి ఉన్నారు. ఇంకా అక్కడ నానావిధసేనావిభాగాలను కూడా చూశాడు.
రాక్షసాంశ్చ మహాకాయాన్ నానాప్రహరణోద్యతాన్ |
రక్తాన్ శ్వేతాన్ సితాంశ్చైవ హరీంశ్చాపి మహాజవాన్ || 31
వివిధాయుధాల్ని ధరించిన మహాకాయుల్ని, బంధించి ఉంచిన ఎఱ్ఱని, తెల్లని, గొప్ప గమనవేగం కల గుఱ్ఱాల్ని చూశాడు.
కులీనాన్ రూపసంపన్నాన్ గజాన్ పరగజారుజాన్ |
నిష్ఠితాన్ గజశిక్షాయామ్ ఐరావతసమాన్ యుధి || 32
ఉత్తమజాతి, చక్కని ఆకారం, శత్రుగజాలను పీడించే సామర్థ్యం, యుద్ధవిద్యలలో సుశిక్షణ, ఐరావతసామ్యం కలిగిఉండి,
నిహంతౄన్ పరసైన్యానాం గృహే తస్మిన్ దదర్శ స: |
క్షరతశ్చ యథా మేఘాన్ స్రవతశ్చ యథా గిరీన్ || 33
శత్రుసైన్యాల్ని హతమార్చేవి, వర్షిస్తున్న మేఘాల్లా ప్రవాహం కలిగిన గిరుల్లా మదజలం స్రవించేవి,
మేఘస్తనితనిర్ఘోషాన్ దుర్ధర్షాన్ సమరే పరై: |
సహస్రం వాహినీస్తత్ర జాంబూనదపరిష్కృతా: || 34
మేఘగర్జనల్లా ఘీంకరించేవి, ఎదిరించ వీలులేనివి అయిన మదపుటేనుగుల్ని చూశాడు. బంగారు అలంకారాలు
హేమజాలపరిచ్ఛన్నా: తరుణాదిత్యసన్నిభా: |
దదర్శ రాక్షసేంద్రస్య రావణస్య నివేశనే || 35
బంగారు ఆభరణాలు కలిగి, మధ్యాహ్నసూర్యునిలాంటి వేలసేనలను చూశాడు.
శిబికా వివిధాకారా: స కపిర్మారుతాత్మజ: |
లతాగృహాణి చిత్రాణి చిత్రశాలాగృహాణి చ || 36
వివిధపల్లకీలు, చిత్రమైన పొదరిళ్లు, చిత్రశాలలు,
క్రీడాగృహాణి చాన్యాని దారుపర్వతకానపి |
కామస్య గృహకం రమ్యం దివాగృహకమేవ చ |
దదర్శ రాక్షసేంద్రస్య రావణస్య నివేశనే || 37
క్రీడామందిరాలు, దేవదారు వృక్షాలున్న క్రీడాపర్వతాలు, కామగృహాలు, దివాగృహాలు చూశాడు. (వెతికాడు)
స మందరగిరిప్రఖ్యం మయూరస్థానసంకులమ్ || 38
ఆ రావణుని భవనం, మందరగిరిలా బంగారుమయమై ఉంది. క్రీడామయూరాలు,
ధ్వజయష్టిభిరాకీర్ణం దదర్శ భవనోత్తమమ్ |
అనేకరత్నసంకీర్ణం నిధిజాలం సమంతత: || 39
ధ్వజపతాకాలు, రత్నాలు, నిధులు కలది.
ధీరనిష్ఠితకర్మాంతం గృహం భూతపతేరివ |
అర్చిర్భిశ్చాపి రత్నానాం తేజసా రావణస్య చ || 40
సదాశివునికైలాసంలా దృఢవ్రతుల తపఫలం అనదగ్గ (కష్టపడి నిపుణులు తయారుచేశారనుట) రత్నకాంతులతో, రావణుని తేజస్సుతో
విరరాజాథ తద్వేశ్మ రశ్మిమానివ రశ్మిభి: |
జాంబూనదమయాన్యేవ శయనాన్యాసనాని చ |
భాజనాని చ ముఖ్యాని దదర్శ హరియూథప: || 41
వెలుగుతూ, చండకిరణుడైన సూర్యునిలా ఉంది. హనుమంతుడు చూసిన ఆ రావణభవనాన తల్పాలు, ఆసనాలు, ముఖ్యపాత్రలు అన్నీ కాంచనమయమే.
మధ్వాసవకృతక్లేదం మణిభాజనసంకులమ్ |
మనోరమమసంబాధం కుబేరభవనం యథా || 42
ఆ భవనం తేనె మద్యాలతో తడిసింది. మణులు పొదిగిన పాత్రలు కలది. కుబేరప్రాసాదంలా విశాలంగా మనోహరంగా ఉంది.
నూపురాణాం చ ఘోషేణ కాంచీనాం నినదేన చ |
మృదంగతలఘోషైశ్చ ఘోషవద్భిర్వినాదితమ్ || 43
కాలి అందెల సవ్వడులు, ఒడ్డాణాల రవళులు, మృదంగనాదాలతో మార్మ్రోగుతోంది.
ప్రాసాదసంఘాతయుతం స్త్రీరత్నశతసంకులమ్ |
సువ్యూఢకక్ష్యం హనుమాన్ ప్రవివేశ మహాగృహమ్ || 44
పెక్కు మేడలు, పెక్కువేలమంది ఉత్తమస్త్రీలు, మిక్కిలి విశాలమైన తొట్టికట్లు(లోగిళ్లు)తో ఒప్పే, ఆ రావణుని మహాగృహంలోకి హనుమంతుడు ప్రవేశించాడు.
-------------------------------------------------------------------------------------------------------------------------------
             
పాతాళ భూతల వ్యోమచారిణ శ్ఛద్మచారిణః | న ద్రష్టు మపి శక్తాస్తే రక్షితం రామనామభిః ||11||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే షష్ఠస్సర్గః (6)

మంగళం మహత్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

SUNDARAKANDA సుందరకాండ 36

  రామసుందరం - షట్త్రింశస్సర్గః   భూయ ఏవ మహాతేజా హనూమాన్మారుతాత్మజః | అబ్రవీత్ప్రశ్రితం వాక్యం సీతాప్రత్యయకారణాత్ || 1 || సీతక...