రామసుందరం
అష్టమస్సర్గః
స తస్య మధ్యే భవనస్య సంస్థితం
మహద్విమానం మణివజ్రచిత్రితమ్ |
ప్రతప్తజాంబూనదజాలకృత్రిమం
దదర్శ వీర: పవనాత్మజ: కపి: || 1 ||
ఆ భవనసముదాయానికి
మధ్యలో, మణివజ్రాలతో నిర్మితమైన, పుష్పకవిమానం స్థాపించబడి ఉంది. దానికి మేలిమి బంగారపు కిటికీలున్నాయి.
తదప్రమేయాప్రతికారకృత్రిమం
కృతం స్వయం సాధ్వితి విశ్వకర్మణా |
దివం గతం వాయుపథప్రతిష్ఠితం
వ్యరాజతా౭౭దిత్యపథస్య లక్ష్మవత్ || 2 ||
అందఱూ ప్రశంసించే
విధంగా దాన్నివిశ్వకర్మ నిర్మించాడు. దాని నిర్మాణం సాటిలేనిది, ఊహలకందనిది. ఆకాశమంతా తిరుగులేకుండా తిరుగగలిగినదై, అంతరిక్షంలో ఉంచబడిన ఆ విమానం సూర్యమార్గానికి సూచికలా ఉంది.
న తత్ర కించిన్న కృతం ప్రయత్నతో
న తత్ర కించిన్న మహార్హరత్నవత్ |
న తే విశేషా నియతాస్సురేష్వపి
న తత్ర కించిన్న మహావిశేషవత్ || 3 ||
దాన్ని చక్కగా
నిర్మించారు. మేలుజాతి రత్నాలు పొదిగారు. అందులోని విచిత్రవిశేషాలు దేవతాభవనాల్లోకూడా
లేవు. ఇంతెందుకు? అందులో లేని విశేషమే లేదు.
తపస్సమాధానపరాక్రమార్జితం
మనస్సమాధానవిచారచారిణమ్ |
అనేకసంస్థానవిశేషనిర్మితం
తతస్తతస్తుల్యవిశేషదర్శనమ్ || 4 ||
ఆ విమానం
మహాతపశ్చర్యచేతా, పరాక్రమంచేతా సంపాదింపబడింది. దానిలో ఆసీనులైనవారి ఆలోచనలను అనుసరించి అది సంచరిస్తుంది. దాన్లోని వివిధ (సభాభవనాలు, భోజనశాలలు, వినోదమందిరాలు, గోపురాలు
మొదలైన) భాగాలు ఒక్కొక్క విధంగానూ, అన్ని ప్రదేశాలు, సమానంగానూ నిర్మింపబడ్డాయి.
మనస్సమాధాయ తు శీఘ్రగామినం
దురావరం మారుతతుల్యగామినమ్ |
మహాత్మనాం పుణ్యకృతాం మహర్ధినాం
యశస్వినామగ్ర్యముదామివాలయమ్ || 5 ||
యజమాని మనస్సును
తెలుసుకొని, వాయువేగంతో సంచరిస్తుంది. దాన్నిఎవరూ అడ్డగించలేరు. మహాత్ముల, పుణ్యాత్ముల, తేజస్సంపన్నుల, సుప్రసిద్ధుల భవనాల్లాంటిది. స్వర్గంలాంటిదది.
విశేషమాలంబ్య విశేషసంస్థితం
విచిత్రకూటం బహుకూటమండితమ్ |
మనో౭భిరామం శరదిందునిర్మలం
విచిత్రకూటం శిఖరం గిరేర్యథా || 6 ||
దాన్నివిశిష్టరీతిలో
ఉదాత్తంగా నిర్మించారు. చిత్రవిచిత్రశిఖరాలతో మనోభిరామంగా ఉంది. శరత్కాలచంద్రునిలా నిర్మలంగా, ఆహ్లాదంగా ఉంది.
గిరిశిఖరంలా ఉపశిఖరాలతో
ఉంది.
వహంతి యం కుండలశోభితాననా:
మహాశనా వ్యోమచరా నిశాచరా: |
వివృత్తవిధ్వస్తవిశాలలోచనా:
మహాజనా భూతగణాస్సహస్రశ: || 7 ||
కుండలాలు, పెద్దశరీరాలు, విశాలనేత్రాలు, అతివేగసంచారాలు కల వేలకొలది భూతగణాలు ఆ విమానాన్ని మోస్తున్నట్లు, దాని వెలుపలిభాగంలో శిల్పాలు చెక్కారు.
వసంతపుష్పోత్కరచారుదర్శనం
వసంతమాసాదపి కాంతదర్శనమ్ |
స పుష్పకం తత్ర విమానముత్తమం
దదర్శ తద్వానరవీరసత్తమ: || 8 ||
అది వసంతర్తువులో
పుష్పరాశిలా చూడముచ్చటగా ఉంది. వసంతమాసంకంటే మనోహరంగా ఉంది. అటువంటి శ్రేష్ఠమైన విమానాన్ని ఆ వానరవరేణ్యుడు చూశాడు.
----------------------------------------------------------------------------------------------------------------------------------
జగజ్జైత్రైకమన్త్రేణ రామనామ్నాభిరక్షితమ్ | యః
కణ్ఠే ధారయే త్తస్య కరస్థాః సర్వసిద్ధయః ||13||
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే అష్టమస్సర్గః (8)
మంగళం మహత్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి