31, మార్చి 2011, గురువారం

సద్గుణాభిరాముడు - రాముడు

ప్రశ్న :


శ్రీరాముని మంథర, కైక,వాలి,మొదలైనవారు నిందించినట్లు ,
రాముడు, శంబూకుని వధించడం అన్యాయమని,
ఇలా ఆధునికులు, రాముని రకరకాలుగా నిందిస్తున్నారు. భావ్యమా?


దీనికి "శ్వేతద్వీపం" అనే ఎక్కిరాల కృష్ణమాచార్యులవారి పత్రిక ఇచ్చిన


సమాధానం :


నారదునిచేత, వాల్మీకిచేత, ప్రజలచేత, తల్లులచేత, తమ్ములచేత,
గుహుడు,శబరి మొదలైన గిరిజనులచేత,
 హనుమదాదివానరులచేత,
ఋషులచేత,
విభీషణాది రాక్షసులచేత,
ఇందరిచేత పొగడబడిన సద్గుణాభిరాముడు రాముడు.
( పైన పేర్కొన్నవారు ఎవరికివారే విభిన్నులు. రకరకాల సామాజికవర్గాలు.
ఒకరిచేత (నిజంగా) స్తుతింపబడటమే కష్టం.
మరి ఇన్ని విభిన్నవర్గాలవారి చేత స్తుతింపబడటం, ఎంత అసాధారణం? ఈ ఒక్కటి చాలు)

ఇతరులు పొగిడినా - లేని సద్గుణాలు రావు. నిందించినా - ఉన్నసద్గుణాలు పోవు.

పురుషోత్తమునకు రామునకు ఈ నిందాస్తుతులు సమానం.

ఎవరో నిందిస్తే, రాముని శీలం కళంకితమైందనుకోవడం భావనపుంసకత్వానికి నిదర్శనం.
ఇలాంటి రచనలు చేసేవారు తన అంతరాత్మమీద నమ్మకం లేనివాడు.
తన ప్రవర్తనమీద (తన) కన్న, తనగుఱించి ఇతరులు పలికిన మాటలపై నమ్మకం గలవాడు,
ఆత్మవంచకుడు అవుతాడు.

స్వాతంత్ర్యానంతరమే భారతీయులకు మానసికస్వాతంత్ర్యం సన్నగిల్లింది.
బానిసబుద్ధిపెరిగింది.

భారతీయసంస్కృతికి మూలపురుషులైన మహాపురుషులలో లోపాలను ఎత్తి చూపడం సరదా అయింది. గొప్పతనంగా లెక్కించబడుతోంది.

రామాయణాన్ని విమర్శించడానికి రామాయణాన్ని చదవకపోవడమే మొదటి అర్హతగాగల ఇటువంటివారికి
కొందరు పాశ్చాత్యులు, పాశ్చాత్య మానసపుత్రులు, దేశవిచ్ఛిన్నకారుల మాటలు ప్రమాణాలు.

చిత్రమేమంటే వేలాది పాశ్చాత్యులు,
ఇపుడు రామాయణాదులను చదివి, విని, స్ఫూర్తిపొంది, ఆనందిస్తున్నారు.
తమ తమ భాషలలో రచనలుగా ప్రచురిస్తున్నారు.
నాటకాలుగా ప్రదర్శిస్తున్నారు.
కొందరు గీతాలుగా ఆలపిస్తున్నారు.

భవిష్యత్తులో ఇటువంటి పాశ్చాత్యులు భారతీయులకు గురువులు కావచ్చుకూడా.

పండితులు విషయాలను ముందు తాము సరిగా అవగాహన చేసుకోకుండా చెప్పడం కూడా ఒక కారణం కావచ్చు.

మంథర ఒకే తప్పుమాట అన్నది రాముని గుఱించి,
- "రాముడు రాజైతే నీ కుమారుని తక్కువగా చూస్తాడు."
అది కూడా భరతుని రాజును చేయాలనే దురాశతో.
ఆమె అభిప్రాయం తప్పని తేలింది తరువాత.
రాముడు భరతుని యువరాజు చేశాడు.
ఇది ఎవరూ పట్టించుకోరు.

కైక కూడా రాముని సద్గుణాలు కీర్తించింది. చెడుగా అనలేదెక్కడా.

సినిమాల్లో మాత్రమే పరశురాముడు రాముని "గర్వి" అంటాడు. రామాయణంలో కాదు.
"శివునివిల్లు ఎక్కుపెట్టావు కదా! ఈ విష్ణువువిల్లు కూడా ఎక్కుపెట్టు " అన్నాడు. అంతే.

వాలి కూడా నిందించలేదు.
తనను చంపడానికి కారణం అడిగాడు.
సమాధానం విన్నాక తన కుమారుని అంగదుని రాముని రక్షణకు అప్పజెప్పాడు.
తనను చంపినవారికి తన కుమారుని ఎవరైనా అప్పజెప్తారా?

చివరకు రావణుడు కూడా
" భార్యకు ఐహికసుఖాలు అందించలేని అసమర్థుడు"
అన్న ఒక్కమాట కూడా సీతకు రాజభోగాలను ఎరగా చూపడం కోసమే.
దీనిని సీత తిప్పికొట్టింది.

ఇక రామాయణంలో శంబూకుడే లేడు. ఎవరో కల్పించారు.
వాల్మీకి పేరున ఉత్తరరామాయణంలో.

బాల్యచేష్టకైనా కుశలవులు రాముని నిందింపలేదు.
సినిమాలో చూపినది అధర్మం, అనుచితం.

రావణుడు యుద్ధంలో రాముని మొదటిసారి దర్శించి,
ఆ జానకిరాముని పరాక్రమానికి, దివ్య సౌందర్యానికి నిశ్చేష్టుడయ్యాడు.

సద్గుణాలే సౌందర్యంగా వ్యక్తమవుతాయి.
రాముడు సద్గుణ సౌందర్యవంతుడు.

కాని మురారి అనే సంస్కృతకవీంద్రుడు చెప్పినట్లు
రామునిలో ఒకే దుర్గుణం ఉంది.

అది ఏమిటంటే, ఎందరు ఎంతగా ఎన్నిసార్లు వర్ణించినా తనివి తీరకపోవడం.

మంగళం మహత్

2 కామెంట్‌లు:

  1. చక్కగా వ్రాసారు .


    @అది ఏమిటంటే, ఎందరు ఎంతగా ఎన్నిసార్లు వర్ణించినా తనివి తీరకపోవడం.



    ఇది మీరు ఎక్కడ చదివారు..నేను వినలేదు.అసలు రామునిలో దుర్గుణమే వినలేదు ఇప్పటికి, సినిమాల్లో కూడా హ్మ్.

    మీరు అపార్ధము చేసికోకు౦టె ఇదే అన్ని౦టి కన్నా ఒకరికి ఉ౦డకూడని స్వభావ౦. ఇలా జన౦ లో తనకొక మచ్చ వస్తు౦దని సీతను ప౦పి౦చారని కూడా అనుమానిస్తారు ఆయనకి సీతమ్మ పై నమ్మకం, ప్రేమ ఉన్నా.

    ఈ భావం మీరు ఇ౦కొకసారి సరిచూడ౦డి.లేదా రామాయణ౦ లో ఈ విషయాన్ని తెలియచేసిన సందర్భం చెప్ప౦డి .

    రిప్లయితొలగించండి
  2. nijame manalo chalamandi tanaki arhata unna lekunna ... vimarsha cheste oka pani ayipotundi kada ani notiki enta vaste anta aniveyam modern ayindi.

    ramudi peru palakadaniki kuda arhata leni vallu chestunna vimarshalaku answer cheppadam avasaram antara?

    రిప్లయితొలగించండి

Sundarakanda సుందరకాండ 35

                                     రామసుందరం పఞ్చత్రింశస్సర్గః తాం తు రామకథాం శ్రుత్వా వైదేహీ వానరర్షభాత్‌ । ఉవాచ వచనం సాంత్వ మిద...