తత్ర వ్యక్తం దృషది చరణన్యాసమర్ధేందుమౌళేః
శశ్వ త్సిద్ధై రుపచితబలిం భక్తినమ్రః పరీయాః,
యస్మి౯ దృష్టే కరణవిగమాదూర్ధ్వ ముద్ధూతపాపాః
కల్పిష్యంతే స్థిరగణపదప్రాప్తయే శ్రద్దధానా:
భావం:
ఆ హిమవత్పర్వతమందు,
పూర్వం, శివుడు, ఒక రాతిమీద తన పాదాన్ని ఉంచాడు.
(అప్పుడు పాదచిహ్నం ఏర్పడింది.)
ఆ పాద చిహ్నాన్ని, సిద్ధులు ఎన్నోసార్లు పూజించారు.
అటువంటి శివపాదానికి నమ్రుడవై భక్తితో ప్రదక్షిణం చెయ్యి.
అలా చేసినవారి పాపాలు నశిస్తాయి.
అంత్యకాలంలో ప్రమథగణస్థానాన్ని పొందుతారు.
శ్రేయస్సు కలుగుతుంది. శివ సాలోక్యం సిద్ధిస్తుందని భావం.
శబ్దాయంతే మధురమనిలై: కీచకా: పూర్యమాణా:
సంసక్తాభి స్త్రిపురవిజయో గీయతే కిన్నరీభి:,
నిర్హ్రాదస్తే మురజ ఇవ చేత్కందరేషు ధ్వని: స్యాత్
సంగీతార్థో నను పశుపతే స్తత్ర భావీ సమగ్ర:.
భావం:
బొంగువెదుళ్లు, గాలిచే నింపబడి, మ్రోగుతున్నాయి.
( వెదుళ్లు మ్రోగాలంటే రంధ్రాలుండాలి కదా! ఉన్నాయి.
ఆ రంధ్రాలను ఎవరు చేశారు? తుమ్మెదలు చేశాయి.)
కిన్నరస్త్రీలు, గుంపులు గూడి,
శివుడు, త్రిపురాసురలను జయించిన కథను పాడుతున్నారు.
నీవు ఉరిమినచో, ఆ ధ్వని, కొండగుహలలో చేరి, వెలువడునప్పుడు,
మద్దెలమ్రోతలా ఉంటుంది.
అప్పుడు శివసంగీతం, సంపూర్ణం అవుతుంది.
మంగళం మహత్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Sundarakanda సుందరకాండ 39
Sundarakanda సుందరకాండ 3 9 రామసుందరం – ఏకోనచత్వారింశ స్సర్గః మణిం దత్త్వా తత స్సీతా హనుమంత మథాఽబ్రవీత్ । అభిజ్ఞాన మభిజ్ఞాత మే...
-
రామసుందరం – అష్టత్రింశస్సర్గః తతః స కపిశార్దూల స్తేన వాక్యేన హర్షితః | సీతా మువాచ తచ్ఛ్రుత్వా వాక్యం వాక్యవిశారదః || 1 పిదప , వాక్యవ...
-
తత్రావశ్యం వలయకులిశోద్ఘట్టనోద్గీర్ణతోయం నేష్యంతి త్వాం సురయువతయో యంత్రధారాగృహత్వం , తాభ్యో మోక్షస్తవ యది సఖే ఘర్మలబ్ధస్య న స్యాత్ క్రీడాలోల...
-
తస్మిన్కాలే నయనసలిలం యోషితాం ఖండితానాం శాంతిం నేయం ప్రణయిభిరతో వర్త్మ భానోస్త్యజాశు, ప్రాలేయాస్రం కమలవదనాత్సో౭పి హర్తుం నలిన్యాః ప్...
Wow,
రిప్లయితొలగించండిtelugulo ilaanti blog undante atisayamgaa undi naku
awesome job....!
nice
bhale enchukunnaru kaavyaanni
mee blog title "Satatam" naaku baagaa nacchindi
?!
http://paramapadasopanam.blogspot.com
చాల సంతోషం.
రిప్లయితొలగించండిమీ వ్యాఖ్యలే కొండంత బలంగా
ఈ కావ్యాన్ని పూర్తి చేస్తాను.