6, మే 2019, సోమవారం

nagavulu nijamani nammeda


అన్నమాచార్య కీర్తన

||   నగవులు నిజమని నమ్మేదా
      గి నడియాసలు ద్దనవే  

(ఓ మనసా! నీ లేక ప్రపంచపు)

నవ్వులు 

నిజమని నమ్మచ్చా? (నమ్మరాదు. నమ్మితే ముంచేస్తావు)

ఒగిని (క్రమముగా/చక్కఁగా/బాగా/శ్రద్ధతో/లెస్సగా)

అడియాసలు (వట్టి ఆశలు/వ్యర్థాశలు/పేరాసలు

ఇక వద్దు అను.


||   తొల్లిటి కర్మము దొంతల నుండగ
      చెల్లబోయిక జేసేదా
      యెల్ల లోకములు యేలేటి దేవుడ  
      ల్ల నొల్లనిక నొద్దనవే 


పూర్వకర్మలు దొంతులు (దొంతరలు) గా ఉన్నాయి.

అవి చెల్లేటట్లు చేయాలి కదా! = తీరాలి కదా

ఇంకా పోగుచేసుకోవడం ఎందుకు?

అన్ని లోకాల్ని పరిపాలించే దేవా

(అని వేంకటేశ్వరుని స్మరిస్తూ, ఆయనతో చెప్తున్నట్లుగా

నా మనసు చేసే పనులను ఒల్లను అని చెప్పవచ్చు)

లేదా,

ఇక (ఓ మనసా! నిన్ను/నీ పనులను

ఒల్లను (అంగీకరించను/ఇష్టపడను)

కర్మలు చేయడాన్ని/తుంటరి తలపులను

ఇక వద్దను (వద్దు+అను)


||   పోయిన జన్మము పొరుగులనుండగ
      చీయనక యిందు జెలగేదా
      వేయినామముల వెన్నుడమాయలు
      ఓ యయ్య యింక నొద్దనవే

పోయిన (తనువు చాలించాక

(తర్వాత)

వెంటనే మరోజన్మ పొరుగుల (ప్రక్కనే సిద్ధంగా) ఉండగా,

ఛీ అనకుండా (మరో) జన్మను అంగీకరించి,  

ఇక్కడే భూలోకంలో అలరారేదా? (=ఒప్పేదా?, ఒప్పదు/సరికాదు)

వేయినామాల (సహస్రనాముడైన) వెన్నుని (విష్ణుని)

(మనం ఎఱుగరానివి/ తెలుసుకోలేనివి అయిన)

మాయలు

(అందువల్ల ఓ మనసా! ఆయనతో)

“ఓ అయ్యా! ఓ వెన్నుడా! ఇక నీ మాయలు వద్దయ్యా” అను.

(“ఈ నీ మయామోహప్రపంచంలో ఇక జన్మ వద్దు” అను “పరమపదం కావాల”ను)


||   నలి నీనామము నాలికనుండగ
      తలకొని యితరము దడవేదా
      బలు శ్రీ వేంకటపతి నిన్నుగొలిచి
      వొలుకు చంచలము లొద్దనవే
                                                      

బలు (గొప్పవాడవైన/బలవంతుడవైన) 

శ్రీవేంకటపతీ!

నిన్ను కొలిచి (పూజించి)(న వాడనై)

నలిని (యోగ్యంగా) 

నీనామం నాలుకపై ఉండగా,

తలకొని (ప్రయత్నించి/పూని)

ఇతరాలను = విషయవాంఛలను

తడవడం (వెదకడం/విచారించడం) ఎందుకు?

(ఓ మనసా!)

నీలో ఎన్నో చంచలాలు ఒలుకుతూ ఉంటాయి.

(అంటే నీవు స్థిరమైనదానవు కాదు అని)
 
వాటిని వద్దు అను. 

(వేంకటపతి పట్ల స్థిరంగా ఉండు.)

* భగవద్గీత (6 వ అధ్యాయం 34, 35 శ్లోకాలు) ఓసారి పరిశీలించండి

మంగళం మహత్



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

SUNDARAKANDA సుందరకాండ 36

  రామసుందరం - షట్త్రింశస్సర్గః   భూయ ఏవ మహాతేజా హనూమాన్మారుతాత్మజః | అబ్రవీత్ప్రశ్రితం వాక్యం సీతాప్రత్యయకారణాత్ || 1 || సీతక...