18, జనవరి 2015, ఆదివారం

soundarya lahari - 9

జగన్మాతవైభవం - 9
సౌందర్యలహరి

18







బాలసూర్యుని కాంతిపుంజాలను వెదజల్లుతున్న
నీ శరీరకాంతుల అరుణిమలో
భూమ్యాకాశాలు మునిగినట్లుగా
స్మరించినవానికి
ఊర్వశి మొదలైన అప్సరసలందఱూ వశులవుతారు

19
 


నీ మోమును బిందువుగా చేసి,
దాని క్రిందుగా కుచయుగం ఉంచి,
దాని క్రిందుగా త్రికోణం ఉంచి,
నీ మన్మథకళలను  ధ్యానించేవాడు
మరుక్షణంలోనే వనితలను కలతపెడుతున్నాడు.
అంతే కాదు
సూర్యచంద్రులు చనుగవగా కల్గిన
త్రిలోకి (మూడు లోకాలు) అనే స్త్రీనే  మోహపెడుతున్నాడు.


20

 


సర్వావయవాలనుండి అమృతాన్ని వర్షించే కిరణాలు కల
నిన్ను చంద్రకాంతమణినిర్మితప్రతిమలా భావించి,
హృదయంలో ప్రతిష్ఠించి, ధ్యానించేవాడు
గరుత్మంతునిలా సర్పాల దర్పాన్ని శమింపచేస్తున్నాడు.
తన చల్లనిచూపుచేత జ్వరపీడితుల జ్వరబాధలను తొలగించి,
సుఖాన్ని కల్గిస్తున్నాడు.

21
 


మెఱపుతీగలా సూక్ష్మమై, దీర్ఘమై,
సూర్యచంద్రాగ్నిరూపమై, క్షణప్రభయై,
షట్చక్రాలకుపైన సహస్రారంలో మహాపద్మాటవిలో కూర్చొన్న
నీ యొక్క సాదాఖ్యకళను
మహాత్ములు పరమాహ్లాదలహరిగా ధరిస్తారు.
అనగా నిరతిశయానందాన్ని సదా పొందుతున్నారు.

మంగళం మహత్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

SUNDARAKANDA సుందరకాండ 36

  రామసుందరం - షట్త్రింశస్సర్గః   భూయ ఏవ మహాతేజా హనూమాన్మారుతాత్మజః | అబ్రవీత్ప్రశ్రితం వాక్యం సీతాప్రత్యయకారణాత్ || 1 || సీతక...