16, జూన్ 2020, మంగళవారం

Sundarakanda సుందరకాండ 29


రామసుందరం
ఏకోనత్రింశస్సర్గః
తథాగతాం తాం వ్యథితా మనిందితాం
వ్యపేతహర్షాం పరిదీనమానసాం ।
శుభాం నిమిత్తాని శుభాని భేజిరే
నరం శ్రియా జుష్టమి వోపజీవినః 1
సంపద కలవాని చెంతకు సేవకులు చేరినట్లు, పరమదుఃఖిత, అనిందిత, సంతోషం లేనిది, పరిదీనమానస అయిన ఆ మంగళస్వరూపిణి సీతను, శుభనిమిత్తాలు ఆశ్రయించాయి.
తస్యా శ్శుభం వామ మరాళపక్ష్మ
రాజీవృతం కృష్ణవిశాలశుక్లమ్‌ ।
ప్రాస్సంద తైకం నయనం సుకేశ్యా
మీనాహతం పద్మ మి వాభితామ్రమ్‌ ॥ 2
శుభమైనదై, వంకరలైన ఱెప్పవెండ్రుకలు కల్గి, మధ్యలో నల్లగా, చుట్టూ తెల్లగా, కొనల్లో ఎఱ్ఱగా, ఒప్పే, సీత ఎడమకన్ను, చేపచే కొట్టబడిన కమలంలా అదరింది.
భుజ శ్చ చార్వంచితపీనవృత్తః
పరార్థ్యకాలాగరుచందనార్హః
అనుత్తమే నాధ్యుషితః ప్రియేణ
చిరేణ వామ స్సమవేపతాశు 3
సుందరమై, ఉత్తమమై, బలసి, గుండ్రంగా ఉండి, శ్రేష్టమైన కృష్ణాగరుగంధపుపూతలకు తగినదై, భర్త రామునికి, చిరకాలం తలగడయైన, సీత ఎడమ భుజం కంపించింది.
గజేంద్రహస్త ప్రతిమశ్చ పీన
స్తయో ర్ద్వయో స్సంహతయో స్సుజాతః
ప్రస్పందమానః పున రూరు రస్యా
రామం పురస్తాత్‌ స్థిత మాచచక్షే 4
రాముడు ముందటనే ఉన్నాడని, సూచిస్తోందా అన్నట్లు, సుజాతమై, ఏనుగు తొండంలా బలసి, ఒకదాంతో ఒకటి చక్కగా కలిసికొని ఉన్న, ఆమె రెండుతొడల్లో, ఎడమతొడ, బాగా చలించింది.
శుభం పున ర్హేమసమానవర్ణ
మీష ద్రజోధ్వస్తమి వామలాక్ష్యాః
వాస: స్థితాయా శ్శిఖరాగ్రదత్యాః
కించి త్పరిస్రంసత చారుగాత్ర్యాః ॥ 5
స్వచ్ఛమైన కండ్లు, కొనలు గుండ్రంగా ఉండే దంతాలు, చారుగాత్రం, కల్గి, నిలబడి ఉన్న, ఆ సీత కట్టుకొన్న, మంగళకరమైన, బంగారురంగు కల్గి, కొంచెం దుమ్మువల్ల కాంతి తగ్గినదైన చీర, కొద్దిగా జాఱింది.
ఏత్తె ర్నిమిత్తై రపరై శ్చ సుభ్రూ
స్సంబోధితా ప్రా గపి సాధుసిద్ధైః
వాతాతపక్లాంతమివ ప్రణష్టం
వర్షేణ బీజం ప్రతిసంజహర్ష ॥ 6
అందమైన కనుబొమలు కల సీత, గాలిఎండల తాకుడుకు వాడి, కృశించిన, బీజం, ర్షంతో తెప్పరిల్లి, మళ్లీ కాంతి పొందినట్లు, ఇదివఱకు సరియైన ఫలాలనిచ్చేవి అని నిర్ణయింపబడిన ఈ శుభనిమిత్తాలచేతా, ఇంకా మఱికొన్నిటిచేతా, శుభం(రామసమాగమం)కల్గుతుందని ఎఱిగి, ఎంతో సంతోషించింది.
తస్యాః పున ర్బింబఫలాధరోష్ఠం
స్వక్షిభ్రుకేశాంత మరాళపక్ష్మ
క్త్రం బభాసే సితశుక్లదంష్ట్రం
రాహోర్ముఖా చ్చంద్ర ఇవ ప్రముక్తః ॥ 7
దొండపండువంటి క్రింది పెదవి, అందమైన కనుబొమలు, ముంగురులు, వంకరలైన ఱెప్పవెండ్రుకలు, స్వచ్చమైన తెల్లని దంతాలు, కల ఆ సీత ముఖం, తిరిగి, రాహువు నోనుండి విడివడిన చంద్రునిలా, ప్రకాశించింది.
సా వీతశోకా వ్యపనీతతంద్రీ
శాంతజ్వరా హర్షవివృద్ధసత్వా
అశోభతార్యా వదనేన శుక్లే
శీతాంశునా రాత్రి రి వోదితేన ॥ 8
శోకం, మాంద్యం, ఆందోళన, ఆలస్యం, నిరుత్సాహం పోయి, తాపం ఉపశమించి, సంతోషంతో మనసు వికసించగా, పూజ్యురాలైన సీత, చంద్రోదయంతో శుక్లపక్షరాత్రిలా, వికసించిన వదనంతో, శోభిల్లింది.
-----------------------------------------------------------------------------------------
కూజన్తం రామరామేతి మధురం మధురాక్షరమ్ | ఆరుహ్య కవితాశాఖాం వన్దే వాల్మీకికోకిలమ్ ||34||
ఇత్యార్షే శ్రీమద్వాల్మీకిరామాయణే ఆదికావ్యే సుందరకాండే ఏకోనత్రింశస్సర్గః (29)
మంగళం మహత్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sundarakanda సుందరకాండ 35

                                     రామసుందరం పఞ్చత్రింశస్సర్గః తాం తు రామకథాం శ్రుత్వా వైదేహీ వానరర్షభాత్‌ । ఉవాచ వచనం సాంత్వ మిద...