14, జూన్ 2020, ఆదివారం

Sundarakanda సుందరకాండ 27


రామసుందరం
సప్తవింశస్సర్గః  
ఇత్యుక్తా స్సీతయా ఘోరా రాక్షస్యః క్రోధమూర్ఛితాః
కాశ్చి జ్జగ్ము స్త దాఖ్యాతుం రావణస్య తరస్వినః ॥ 1
సీత మాటలు, విని, భీకరులైన రాక్షసస్త్రీలు, మహాక్రోధాన్ని పొందారు. అందులో కొంతమంది, సీత ప్రాణత్యాగవిషయాన్ని, రావణునకు చెప్పటానికి, పోయారు.
తత స్సీతా ముపాగమ్య రాక్షస్యో ఘోరదర్శనాః
పునః పరుష మేకార్థ మనర్థార్థ మథాబ్రువన్‌ ॥ 2
భయంకరాకారలైన రాక్షసస్త్రీలు, సీతను సమీపించి, మరల, పరుషమై, అనర్థాన్ని కల్గించే, మునుపటి మాటలే, చెప్పారు.
అ ద్యేదానీం తవానార్యే స్సీతే పాపవినిశ్చయే
రాక్షస్యో భక్షయిష్యంతి మాంస మేత ద్యథాసుఖమ్‌ ॥ 3
ఓ దుష్టురాలా!, సీతా!, చస్తానని, పాపపు నిర్ణయం తీసుకొన్నావు. నేడే, ఈక్షణమే, నీ మాంసాన్ని, రాక్షసస్తీలు, తనివితీఱ తింటారు.
సీతాం తాభి రనార్యాభి ర్దృష్ట్వా సంతర్జితాం తదా
రాక్షసీ త్రిజటా వృద్ధా శయానా వాక్య మబ్రవీత్‌ ॥ 4
అపుడు, దుష్టలైన, ఆ రాక్షసస్త్రీలు, సీతను, బెదరించడాన్ని చూసి, అంతవఱకు, శయనించిన, ముసలిదైన, త్రిజట అనే రాక్షసి, లేచి, ఇలా అంది.
ఆత్మానం ఖాద తానార్యా న సీతాం భక్షయిష్యథ ।
జనకస్య సుతా మిష్టాం స్నుషాం దశరథస్య చ ॥ 5
“దుష్టకాంతలారా! జనకుని గారాబుకూతురు, దశరథమహారాజుకు ఇష్టమైన కోడలు అయిన, సీతను, తినకండి. నన్ను/మిమ్మల్ని మీఱే తినండి.
స్వప్నో హ్యద్య మయా దృష్టో దారుణో రోమహర్షణః
రాక్షసానా మభావాయ భర్తు రస్యా జయాయ చ॥ 6
రాక్షసులకు వినాశం, ఈమె భర్తకు జయం, సూచించే, దారుణమైన, గగుర్పాటు కలిగించే, ఒక కలను కన్నాను.”
ఏవ ముక్తా స్త్రిజటయా రాక్షస్యః క్రోధమూర్ఛితాః ।
సర్వా ఏ వాబ్రువన్భీతా స్త్రిజటాం తా మిదం వచః ॥ 7
మహాకోపంతో ఉన్న, ఆ రాక్షసస్రీలందఱూ, త్రిజట చెప్పింది విని, భయపడి, ఆ త్రిజటతో, ఇలా అన్నారు.
కథయస్వ త్వయా దృష్టః స్వప్నోఽయం కీదృశో నిశి ॥ 8
“నీవు ఈ రాత్రివేళ, ఎట్టి కల, కన్నావో చెప్పు.”
తాసాం శ్రుత్వా తు వచనం రాక్షసీనాం ముఖా చ్చ్యుతమ్‌
ఉవాచ వచనం కాలే త్రిజటా స్వప్నసంశ్రితమ్‌ ॥ 9
ఆ రాక్షసస్త్రీల మాటల్ని, విని, త్రిజట, ప్రాతఃకాలంలో, తాను, కలలో కన్న విషయాల్ని, వారితో, ఇలా చెప్పింది.
గజదంతమయీం దివ్యాం శిబికా మంతరిక్షగామ్‌ ।
యుక్తాం హంససహస్రేణ స్వయ మాస్థాయ రాఘవః ।
శుక్లమాల్యాంబరధరో లక్ష్మణేన సహాగతః ॥ 10
“శ్రీరాముడు, తెల్లని పుష్పమాలికల్ని, వస్త్రాల్ని ధరించి, ఏనుగు దంతాలతో చేసిన, వేయి హంసలు పూన్చిన, ఆకాశంలో సంచరించేదైన, దివ్యమైన పల్లకిని, స్వయంగా, ఎక్కి, లక్ష్మణునితో కలసి, వచ్చాడు.
స్వప్నే చాద్య మయా దృష్టా సీతా శుక్లాంబరావృతా ।
సాగరేణ పరిక్షిప్తం శ్వేతం పర్వత మాస్థితా
రామేణ సంగతా సీతా భాస్కరేణ ప్రభా యథా ॥ 11
సముద్రం నడుమ ఉన్న, తెల్లని పర్వతంపై, తెల్లని వస్త్రాల్ని ధరించిన, సీత, సూర్యునితో కూడిన వెల్తురులా, రామునితో కలసి, ఆసీనురాలై ఉన్నట్లు, చూశాను.
రాఘవ శ్చ మయా దృష్ట శ్చతుర్దంతం మహాగజమ్‌
ఆరూఢ శ్శైలసంకాశం చచార సహలక్ష్మణః 12
శ్రీరాముడు, లక్ష్మణునితో కూడి, నాలుగు దంతాలున్న, పర్వతంలాంటి, పెద్దఏనుగు నెక్కి, సంచరించినట్లు చూశాను.
తత స్తౌ నరశార్దూలౌ దీప్యమానౌ స్వతేజసా
శుక్లమాల్యాంబరధరౌ జానకీం పర్యుపస్థితౌ ॥ 13
అంత, తెల్లని పుష్పమాలల్ని, వస్త్రాల్ని, ధరించిన, ఆ నరశార్దూలాలిఱువుఱూ, నిజతేజంతో, మిక్కిలి ప్రకాశిస్తూ, సీత సమీపానికి, వచ్చారు.
తత స్తస్య నగ స్యాగ్రే హ్యాకాశస్థస్య దంతినః
భర్త్రా పరిగృహీతస్య జానకీ స్కంధ మాశ్రితా ॥ 14
అంత, జానకి, ఆ శ్వేతపర్వతశిఖరాగ్రాన, ఆకాశంలో ఉన్న,
భర్త శ్రీరాముడెక్కిన ఏనుగు మూపుపై, ఎక్కింది.
భర్తు రంకా త్సముత్పత్య తతః కమలలోచనా ।
చంద్రసూర్యౌ మయా దృష్టా పాణినా పరిమార్జతీ ॥ 15
అప్పుడు, కమలలోచన సీత, భర్త ఒడినుండి లేచి, చంద్రసూర్యుల్ని, చేతితో తుడుస్తున్నట్లు, చూశాను.
తత స్తాభ్యాం కుమారాభ్యా మాస్థిత స్స గజోత్తమః
సీతయా చ విశాలాక్ష్యా లంకాయా ఉపరి స్థితః 16
పిమ్మట, ఆ ఇద్దఱు రాజకుమారులు, ఆ విశాలాక్షి సీత, ఎక్కిన, ఆ ఏనుగుమిన్న, లంకానగరం మీద నిలచింది.
పాండురర్షభయుక్తేన రథే నాష్టయుజా స్వయమ్‌ ।
ఇ హోపయాతః కాకుత్స్థ స్సీతయా సహ భార్యయా ॥ 17
కాకుత్స్థుడు రాముడు, భార్య సీతతో కలసి, ఎనిమిది తెల్లఎద్దుల్ని కట్టిన, రథాన్నెక్కి, ఈ లంకకు, వచ్చాడు.
శుక్లమాల్యాంబరధరో లక్ష్మణేన సహాగతః ।
తతోఽన్యత్ర మయా దృష్టో రామ స్సత్యపరాక్రమః ॥ 18
తర్వాత, వేఱొకవైపు, తెల్లని పూలమాలల్ని, ఉడుపుల్ని, ధరించి, సత్యపరాక్రముడు శ్రీరాముడు, లక్ష్మణునితో కలసి వచ్చినట్లుగా చూశాను.
లక్ష్మణేన సహ భ్రాత్రా సీతయా సహ వీర్యవాన్‌
ఆరుహ్య పుష్పకం దివ్యం విమానం సూర్యసన్నిభమ్‌ ।
ఉత్తరాం దిశ మాలోక్య జగామ పురుషోత్తమః ॥ 19
మహాపరాక్రమశాలి, పురుషోత్తముడు, శ్రీరాముడు, తమ్ముడు లక్ష్మణునితో, భార్య సీతతో కూడి, సూర్యునితో సమానమైన, దివ్యపుష్పకవిమానాన్ని ఎక్కి, ఉత్తరపుదిక్కుకు వెళ్లాడు.
ఏవం స్వప్నే మయా దృష్టో రామో విష్ణుపరాక్రమః ।
లక్ష్మణేన సహ భ్రాత్రా సీతయా సహ రాఘవః ॥ 20
నేను, ఈప్రకారం, స్వప్నంలో, విష్ణువుతో సమానమైన పరాక్రమం కలిగిన, శ్రీరాముని, ఆతని తమ్ముడు లక్ష్మణుని, భార్య సీతను, చూశాను.
న హి రామో మహాతేజా శ్శక్యో జేతుం సురాసురైః
రాక్షసై ర్వాపి చాన్యై ర్వా స్వర్గః పాపజనై రివ ॥ 21
స్వర్గాన్ని పాపాత్ములు పొందలేనట్లు, మహారాక్రమశాలి రాముని, దేవాసురులు కానీ, రాక్షసులు కానీ, మఱి అన్యులు కానీ, ఎంతమాత్రం జయించలేరు.
రావణ శ్చ మయా దృష్టః క్షితౌ తైలసముక్షితః ।
రక్తవాసాః పిబన్మత్తః కరవీరకృతస్రజః 22
రావణుడు, గన్నేరు పూలమాల ధరించి, ఒళ్లంతా నూనె పూసుకొని, ఎఱ్ఱని బట్టలు కట్టుకొని, త్రాగుతూ, మత్తెక్కి, నేలపై ఉండటాన్ని చూశాను.
విమానా త్పుష్పకా దద్య రావణః పతితో భువి ।
కృష్యమాణః స్త్రియా దృష్టో ముండః కృష్ణాంబరః పునః ॥ 23
తిరిగి, రావణుడు, పుష్పకవిమానంనుండి, నేలపైపడి, బోడితలతో ఉండి, నల్లనిబట్టలు కట్టుకొని, ఒక స్రీచే లాగబడుతున్నట్లు, చూశాను.
రథేన ఖరయుక్తేన రక్తమాల్యానులేపనః
పిబం స్తైలం హస న్నృత్యన్‌ భ్రాంతచిత్తాకులేంద్రియః 24
ఎఱ్ఱని పూలమాలికలు, రక్తగంధం ధరించి, నూనె త్రాగుతూ, నవ్వుతూ, నర్తిస్తూ, భ్రాంతచిత్తాకులేంద్రియుడై, గాడిదలు పూన్చిన రథాన్నెక్కి, వెళ్లడం, చూశాను. 
గర్దభేన యయౌ శీఘ్రం దక్షిణాం దిశ మాస్థితః
పున రేవ మయా దృష్టో రావణో రాక్షసేశ్వరః 25
మళ్లీ రావణుడు గాడిదనెక్కి దక్షిణదిక్కుకు వేగంగా పోవడం చూశాను.
పతితోఽవాక్ఛిరా భూమౌ గర్దభా ద్భయమోహితః ।
సహ సోత్థాయ సంభ్రాంతో భయార్తో మదవిహ్వలః 26
                         
తిరిగి, రావణుడు, భయమోహితుడై, గాడిదనుండి, తలక్రిందుగా, నేలపై పడి, వెంటనే లేచి, మదవిహ్వలుడై, తొట్రుపాటు పడుతూ, భయార్తుడవగా చూశాను.
ఉన్మత్త ఇవ దిగ్వాసా దుర్వాక్యం ప్రలప న్బహు
దుర్గంధం దుస్సహం ఘోరం తిమిరం నరకోపమమ్‌ 27
మలపంకం ప్రవి శ్యాశు మగ్న స్తత్ర స రావణః
ప్రస్థితో దక్షిణామాశాం ప్రవిష్టః కర్దమహ్రదం
కంఠే బద్ధ్వా దశగ్రీవం ప్రమదా రక్తవాసినీ 28
కాలీ కర్దమలిప్తాంగీ దిశం యామ్యాం ప్రకర్షతి
ఏవం తత్ర మయా దృష్టః కుంభకర్ణో నిశాచరః ॥ 29
పిచ్చివానిలా దిగంబరుడై, ఎన్నో దుర్వాక్యాలాడుతూ, దుర్గంధంతో, దుస్సహమై, భయంకరమై, చీకటితోనిండిన నరకంలాంటి, మలపంకంలోకి, చొచ్చి, అందులో మునిగిపోయాడు. మఱియు, దక్షిణపుదిశగా పోయి, ఒక బురదమడుగులో కూలాడు. ఎఱ్ఱని బట్టలు కట్టుకొని, ఒళ్లంతా బురద పూసుకొన్న, ఒక నల్లని స్త్రీ, రావణుని కంఠానికి, త్రాడు కట్టి, దక్షిణపుదిక్కుకు ఈడ్చుకొనిపోవడం, చూశాను. కుంభకర్ణుని కూడా, ఇలాగే, కలలో చూశాను.
రావణస్య సుతా స్సర్వే దృష్టా స్తైలసముక్షితాః
వరాహేణ దశగ్రీవ శ్శింశుమారేణ చేంద్రజిత్‌
ఉష్ట్రేణ కుంభకర్ణశ్చ ప్రయాతా దక్షిణాం దిశమ్‌ ॥ 30
రావణుని పుత్రులందఱూ, ఒంటికి నూనె పూసుకొని ఉండగా చూశాను. రావణుడు పంది మీద, ఇంద్రజిత్తు మొసలి మీద, కుంభకర్ణుడు ఒంటె మీద, ఎక్కి, దక్షిణపుదిక్కునుబట్టి పోయారు.
ఏక స్తత్ర మయా దృష్టః శ్వేతచ్ఛత్రో విభీషణః ।
శుక్లమాల్యాంబరధర శ్శుక్లగంధానులేపనః 31
శంఖదుందుభినిర్ఘోషై ర్నృత్తగీతై రలంకృతః
ఆరుహ్య శైలసంకాశం మేఘస్తనిత నిస్స్వనమ్‌ 32
చతుర్దంతం గజం దివ్య మాస్తే తత్ర విభీషణః
చతుర్భి స్సచివై స్సార్థం వైహాయస ముపస్థితః 33
అప్పుడు ఒక్క విభీషణుడు మాత్రం, తెల్లని గొడుగుతో, తెల్లని పూలమాలలు, తెల్లని వస్త్రాలు ధరించి, తెల్లని గంధం పూసుకొని, అలంకరించుకొని, శంఖ దుందుభుల ధ్వనులు చెలగగా, నృత్యగీతాలతో, మేఘధ్వనిలాంటి ధ్వని కలది,  నాల్గుదంతాలతో, పర్వతలాంటి దివ్యమైన ఏనుగును, ఎక్కి, తన నలుగురుమంత్రులతో, ఆకాశంలో సంచరిస్తుండగా చూశాను.
సమాజ శ్చ మయా దృష్టో గీతవాదిత్రనిస్స్వనః
పిబతాం రక్తమాల్యానాం రక్షసాం రక్తవాససామ్‌ ॥ 34
నూనె త్రాగుతూ, ఎఱ్ఱని పూలమాలలు ధరించి, ఎఱ్ఱని బట్టలు కట్టుకొని, పాడుతూ, వాద్యాలు వాయిస్తూ, ధ్వనులు వెలువరుస్తున్న, రాక్షసులగుంపును, చూశాను.
లంకా చేయం పురీ రమ్యా సవాజిరథకుంజరా
సాగరే పతితా దృష్టా భగ్నగోపురతోరణా ॥ 35
రమ్యమైన, ఈ లంకాపట్టణం, గోపురాలు, తోరణాలు విఱిగి, గుఱ్ఱాలతో, రథాలతో ఏనుగులతో, సముద్రంలో, కూలిపోయినట్లు చూశాను.
లంకా దృష్టా మయా స్వప్నే రావణే నాభిరక్షితా
దగ్ధా రామస్య దూతేన వానరేణ తరస్వినా ॥ 36
రావణునిచే బహుభద్రంగా కాపాడబడుతున్న, ఈ లంకను, రాముని దూత, బలవంతుడు అయిన ఒక వానరుడు, దహించినట్లు, కలలో చూశాను.
పీత్వా తైలం ప్రనృత్తా శ్చ ప్రహసంత్యో మహాస్వనాః ।
లంకాయాం భస్మరూక్షాయాం ప్రవిష్టా రాక్షసస్త్రియః ॥ 37
రాక్షసస్ర్త్రీలు, నూనె త్రాగి, నృత్తం చేస్తూ, వెకిలిగా నవ్వుతూ, గట్టిగా కేకలు వేస్తూ, బూడిద మిగిలిన లంకలో తిరుగుతూండటం చూశాను.
కుంభకర్ణాదయ శ్చేమే సర్వే రాక్షసపుంగవాః
రక్తం నివసనం గృహ్య ప్రవిష్టా గోమయహ్రదే ॥ 38
కుంభకర్ణుడు మొదలైన, గొప్ప రాక్షసవీరులందఱూ, ఎఱ్ఱని వలువలు ధరించి, పేడగుంటలో పడి మునిగారు.
అపగచ్ఛత నశ్యధ్వం సీతా మాప స రాఘవః
ఘాతయే త్పరమామర్షీ సర్వై స్సార్థం హి రాక్షసైః ॥ 39
ఇక్కడనుండి వెళ్లిపొండి. లేకపోతే నశిస్తారు. ఆ శ్రీరాముడు, సీతను పొందినట్లే నిశ్చయించుకోండి. క్రుద్ధుడైన రాముడు, రాక్షసులతో సహా, మిమ్మల్ని చంపగలడు.  
ప్రియాం బహుమతాం భార్యాం వనవాస మనువ్రతామ్‌ ।
భర్త్సితాం తర్జితాం వాపి నానుమంస్యతి రాఘవః ॥ 40
ప్రియురాలు, మిక్కిలి మన్నన పొందినది, వనవాసానికి కూడా అనుసరించి వచ్చినదైన భార్య సీతను, అవమానించినా, బెదరించినా, రాముడు, సహించడు.
తదలం క్రూరవాక్యై ర్వస్సాంత్వ మే వాభిధీయతామ్‌
అభియాచామ వైదేహీ మేత ద్ధి మమ రోచతే ॥ 41
కాబట్టి, మీ క్రూరపుమాటలు ఇక చాలు. సాంత్వవచనాలు పల్కండి. వైదేహిని రక్షించమని ప్రార్థిద్దాం. ఇదే మంచిది నాకు అనిపిస్తోంది.
యస్యా మేవంవిధః స్స్వప్నో దుఃఖితాయాం ప్రదృశ్యతే
సా దుఃఖై ర్వివిధై ర్ముక్తా ప్రియం ప్రాప్నోత్యనుత్తమమ్‌ ॥ 42
దుఃఖిస్తున్న, ఏ ఇంతికి సంబంధించి, ఇలాంటి కల వస్తుందో, ఆవనిత, వివిధదుఃఖాలనుండి, విడువడి, మితిలేని సంతోషాన్ని పొందుతుంది.
భర్త్సితా మపి యాచధ్వం రాక్షస్యః కిం వివక్షయా
రాఘవాద్ధి భయం ఘోరం రాక్షసానా ముపస్థితమ్‌ 43
రాక్షసస్త్రీలారా!, నిందించాం కదా! ఎలా అనుకోవద్దు. సీతను, వేడుకోండి. ఎందుకంటే రాక్షసులకు, రామునివల్ల, భయంకరమైన ప్రమాదం వాటిల్లనుంది.
ప్రణిపాతప్రసన్నా హి మైథిలీ జనకాత్మజా
అల మేషా పరిత్రాతుం రాక్షస్యో మహతో భయాత్‌ ॥ 44
ఓ రాక్షసాంగనలారా! నమస్కారం చేస్తే చాలు జనకాత్మజ మైథిలి తనే ప్రసన్నురా లవుతుంది. ఈమే, గొప్పభయంనుండి మనను కాపాడగలదు.
అపి చాస్యా విశాలాక్ష్యా న కించి దుపలక్షయే
విరూప మపి చాంగేషు సుసూక్ష్మ మపి లక్షణమ్‌ ॥ 45
అంతే కాదు. ఈ విశాలాక్షి అవయవాల్లో, కొంచెమైనా వైకల్యం కాని, చిన్నపాటి  అవలక్షణం కాని, కనిపించటంలేదు.
ఛాయావైగుణ్యమాత్రం తు శంకే దుఃఖ ముపస్థితమ్‌
అదుఃఖార్హామిమాం దేవీం వైహాయస ముపస్థితామ్‌ 46
ఈవిడ దేహంలో తేజస్సు కొంచెం తగ్గటంవల్ల దివ్యభోగాల్ని అనుభవింపతగిన, దుఃఖాలకు తగనిదైన, ఈ సీతకు ఈ దుఃఖం, సంభవించిదాని శంకిస్తున్నాను.
అర్థసిద్ధిం తు వైదేహ్యాః పశ్యా మ్యహ ముపస్థితామ్‌ ।
రాక్షసేంద్రవినాశం చ విజయం రాఘవస్య చ ॥ 47
రావణునికి నాశం, రామునకు విజయం, అనే అర్థసిద్ధి, వైదేహికి, శీఘ్రంగానే జరుగుతుందని నాకనిపిస్తోంది.
నిమిత్తభూత మేత త్తు శ్రోతు మస్యా మహత్ప్రియమ్‌
దృశ్యతే చ స్ఫురచ్చక్షుః పద్మపత్ర మివాయతమ్‌ ॥ 48
తామరరేకులాంటి విశాలమైన, ఈమె, ఎడమకన్ను అదురుతూ, కనిపిస్తోంది.  ఈమె, గొప్పశుభాన్నివినగలదు అనడానికి, ఇది ఒక సూచిక.
ఈషచ్చ హృషితో వాస్యా దక్షిణాయా హ్యదక్షిణః ।
అకస్మాదేవ వైదేహ్యా బాహు రేకః ప్రకంపతే 49
సమర్థురాలైన, ఈ సీత ఎడమభుజం, కొంచెం గగుర్పాటు పొంది, అకస్మాత్తుగా, అదురుతోంది.
కరేణుహస్త ప్రతిమ స్సవ్య శ్చోరు రనుత్తమః ।
వేపమాన స్సూచయతి రాఘవం పురతః స్థితమ్‌ ॥ 50
ఆడేనుగు తొండాన్ని పోలిన, సుందరమైన ఈమె ఎడమతొడ గూడ, కంపింస్తూ, రాముడు, శీఘ్రమే ఎదుట నిలచునని, సూచిస్తోంది.
పక్షీ చ శాఖానిలయం ప్రవిష్టః
పునః పున శ్చోత్తమసాంత్వవాదీ
సుస్వాగతాం వాచ ముదీరయానః
పునః పున శ్పోదయతీవ హృష్టః ॥ 51
కొమ్మపై నివాసముండి, సంతోషంతో, ఈ (పింగళ)పక్షి కూడా, పలుమాఱు మధురంగా కూస్తూ, ప్రియబంధువు రాకను తెలిపే మాటను పల్కుతూ, ఆనండాన్ని పొందినదై, మళ్లీ మళ్లీ  ప్రేరేపిస్తున్నట్లుంది."
------------------------------------------------------------------------------------------
లోకాభిరామం రణరంగధీరం రాజీవనేత్రం రఘువంశనాథం | కారుణ్యరూపం కరుణాకరం తం శ్రీరామచన్ద్రం శరణం ప్రపద్యే ||32||
ఇత్యార్షే శ్రీమద్వాల్మీకిరామాయణే ఆదికావ్యే సుందరకాండే సప్తవింశస్సర్గః (27)
మంగళం మహత్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sundarakanda సుందరకాండ 35

                                     రామసుందరం పఞ్చత్రింశస్సర్గః తాం తు రామకథాం శ్రుత్వా వైదేహీ వానరర్షభాత్‌ । ఉవాచ వచనం సాంత్వ మిద...