14, జులై 2015, మంగళవారం

" బాహుబలి " - " రాజమౌళి "



"బాహుబలి."  













తెలుగు చలనచిత్ర దర్శక దిగ్గజం., కాదు కాదు, 
ప్రపంచ చలనచిత్ర దార్శనిక దిగ్గజం రాజమౌళి అద్భుత సృష్టి. 





హాలీవుడ్ కూడా సినిమాలు తీయమని రాజమౌళిని 
అహ్వానిస్తుందనడంలో అతిశయోక్తి లేదని రాజమౌళి
తీయగలరని నిరూపించిన చిత్రం బాహుబలి.





   అందుకే ప్రపంచదర్శకుడన్నది.







టిక్కెట్లు దొరకకపోవడంతో ఈ సినిమాను కొంచెం ఆలస్యంగా, 
విడుదల అయిన ౩వ రోజున చూడటం జరిగింది.




చూశాక మనోభావాలను తెలియజేయకుండా ఉండలేక ఇలా...








నిజంగానే బాహుబలి "విజువల్ వండర్." 
దీనికి తెలుగుపదం వాడడం కంటే ఇదే సమంజసం.






వండర్స్ గుఱించి తర్వాత చెప్పుకొందాం.










ఫ్లాష్ బాక్ కథ - రివ్యూ :-












కథ చిన్నదే. కథనాన్ని అనుసరించి, మూడవతరం నుంచి కథ 
మొదటితరానికి వెళ్తుంది. ఫ్లాష్ బాక్ ప్రకారం 



(ఫొటోలో మాత్రం కనబడే) ప్రభాస్ మొదటితరం. ఈ మొదటి ప్రభాస్ 
అన్నగారు బిజ్జలదేవుడు(నాజర్). 





ఇతనికి శారీరక అవకరం ఉండడంవల్ల పెద్దవాడైనప్పటికీ అతనికి 
రాజ్యాధికారం ఇవ్వకుండా తమ్ముడైన ప్రభాస్ ని 




మహిష్మతీ రాజ్యానికి రాజును చేస్తారు. (ఎవరు చేస్తారో?) 
ఇది మూలమైన పాయింట్ - అని రచయిత దర్శకులు 




అనుకున్నట్లున్నారు. కానీ శారీరక అవకరం వల్ల రాజ్యాధికారం 
ఇవ్వకూడదని ఎక్కడుంది? మహాభారతమే దీనికి ప్రమాణం. 



గ్రుడ్డివాడైన ధృతరాష్ట్రునికి మఱి రాజ్యాధికారం రాలేదా? రాజు కాలేదా? 
గ్రుడ్డితనం కంటె సొట్టచెయ్యి నయం కదా! 





అన్నగారు రాజవటం. తమ్ముడు కుట్ర చేయడం. పాతకథ అనుకొన్నట్లున్నారు. 
అందువల్ల క్రొత్తగా ఉంటుందను



కొని రివర్స్ చేసినట్లున్నారు. కానీ మహాభారతాన్నిమర్చిపోయారు. 
రాజరికం ప్రకారం పెద్దవాడిదే రాజ్యం. వాడొద్దంటే తప్ప.




నిజానికి భారతీయదర్శకులందఱూ రామాయణ భారత భాగవతాల్ని 
అధ్యయనం చేయడం వల్ల ఎన్నో




మంచి సినిమాల్ని ప్రమాణయుక్తంగా తీయవచ్చు. 
అవి భక్తినో, మతాన్నో బోధించే పుస్తకాలు కావు.





మానవ జీవితాల్ని ప్రతిబింబించే గ్రంథరాజాలవి. వాటిలో లేని విషయాలు లేవు.







సరే, ఇక సినిమాలోకి వస్తే, అందువల్ల సహజంగానే బిజ్జలదేవునికి 
కోపం వస్తుంది. రగిలిపోతూంటాడు.





"బి.దే" భార్య శివగామి (రమ్యకృష్ణ).











"బి.దే" అన్నగారు హఠాత్తుగా కాలం చేస్తాడు. అప్పటికి భార్య గర్భవతి. 
(ఈవిడను చూపించలేదు).




మొగబిడ్డను కని మరణిస్తుంది. ఇతడే అమరేంద్ర బాహుబలి (2వ ప్రభాస్). 
బి.దే, శివగాముల కొడుకు భళ్లాలదేవుడు. (రానా).



"అ.రే.బా.బ" ను "భ.దే" ని శివగామి పెంచుతుంది.






















ఎవరిని రాజును చేయాలనే విషయంలో శివగామి తనంతట తానే అధికారాన్ని 
ప్రదర్శించి, బలంతో పాటు ప్రజలను ప్రేమించే


స్వభావం ఉన్నవాణ్ణే రాజును చేస్తానంటుంది. ఇక్కడో విషయం చెప్పాలి. 
శివగామిని "రాజమాత" అని సంబోధిస్తూంటారు.



యువరాజు తల్లిని మాత్రమే రాజమాత అంటారు. దానికంటే ముందు ఆమె భర్త 
రాజయి ఉండాలి. ఇవేవీ లేకుండానే




ఆవిడ రాజమాత ఎలా అయిందో దర్శక రచయితలకే తెలియాలి. 
రామాయణంలో మంథర కైకతో, 





"రాముడు రాజయితే కౌసల్య రాజమాత అవుతుంది. గౌరవాదులు లభిస్తాయి. 
అదే నీ కొడుకు రాజయితే నీవు రాజమాతవు 



అవుతావు" అంటుంది. కాబట్టి యువరాజైనాకే ఆతని తల్లిని రాజమాత అనాలి.







అలా కాకుండానే మఱి శివగామి రాజమాత ఎలా అయిందో తెలీదు.








శాసించే అధికారం ఎవరిచ్చారో తెలీదు. బహుశః ఆవిడే తీసుకొనుంటుందనుకోవాలి.






అసలు అ.రే.బా.బ తండ్రి మరణించాక రాజెవడో తెలీదు. 









పెరిగి పెద్దయిన అ.రే.బా.బ, భ.దే లలో ఎవర్ని రాజును చేయాలనే 
సమస్యను తీర్చడం కోసం కాలకేయపాత్ర



(ప్రభాకర్) ను ప్రవేశపెట్టినట్లున్నారు. అంతకుమించి, వేరొక బలమైన కారణం 
కనబడదు. కాలకేయుడొక ఆటవికరాజు.



క్రూరుడు. మహిష్మతిమీద దండయాత్ర ప్రకటిస్తాడు.










"కాలకేయుని నెగ్గినవారే రాజ"ని శివగామి ప్రకటిస్తుంది.









ఇక యుద్ధం. రాజమౌళి కలలు కన్న యుద్ధం. ఇదొక వండర్. 
తెలుగు సినిమాల్లో ఊహించలేం.





 రాజమౌళి పడ్డ కష్టం అంతా కనిపిస్తుంది.











బిజ్జలుడు,  భళ్లాలునికి  
ఎక్కువ,  బాహుబలికి తక్కువ యుద్ధసౌకర్యాలు కల్పిస్తాడు.




ఉన్న వనరులతోనే తెలివిగాను, ప్రజలకు నష్టం 
కలగకుండాను బాహుబలి యుద్ధం చేస్తాడు.





చివరికి బాహుబలి కాలకేయుణ్ణి కొట్టి ,తెచ్చాక హఠాత్తుగా భళ్లాలదేవుడు 
కాలకేయుని హతమారుస్తాడు.





ఊహించనివిధంగా శివగామి






 "నూరుమంది శత్రువులను చంపితే వీరుడంటారు. ఒక్కణ్ణి కాపాడితే దేవుడంటారు. అందువల్ల





బాహుబలే రాజు. భళ్లాలుడు సర్వసైన్యాధిపతి" అని ప్రకటిస్తుంది.









ఈ యుద్ధంలో చిత్రమేమిటంటే చాలా దూరంలో జరుగుతున్న 
యుద్ధాన్ని కూడా శివగామి తదితరులు




క్లియర్ గా చూసేస్తూంటారు. యుద్ధరంగంలో ఉన్నా వారికి ఒక్క బాణం కూడా 
తగలదు. అలాగే దూరంగా ఉన్న కాలకేయ కూడా.


అయితే ఊపిరి తీసుకోనివ్వని ఆ యుద్ధదృశ్యాల్లో కొట్టుకొనిపోయే  ప్రేక్షకులు 
ఇది పెద్దగా పట్టించుకోకపోవచ్చు.




అసలు మధ్యలో వారిని చూపించకుండా ఉంటే బాగుండునని దర్శకునికి 
ఎడిటర్ సలహా ఇస్తే బాగుండేది.






ఈ ఫ్లాష్ బాక్ అంతా ఆ రాజకుటుంబానికి బానిసగా సేవచేస్తున్న 
కట్టప్ప(సత్యరాజ్) మహేంద్రబాహుబలికి 
(3వ ప్రభాస్ కి) చెప్తాడు.



















ముందువెనుకల్ని సరిచేసి చెప్తే, 











రాజైన బాహుబలి దేవసేనను(అనుష్క) వివాహమాడతాడు.


వారికి పుట్టిన బిడ్డే మహేంద్రబాహుబలి. 



(భళ్లాలుడు)మహేంద్రను చంపబోతే
శివగామి బిడ్డను ఎత్తుకొని పారిపోయి వచ్చి, నీటిలో మునిగే క్రమంలో

బిడ్డ, సంగ (రోహిణి) కంటబడి, కాపాడబడుతుంది. శివుడని పేరుపెట్టి పెంచుతుంటారు. 











ఇక్కడ జలపాత దృశ్యాలు. న భూతో న భవిష్యతి. 










ఈ క్రమంలో శివునికి మనకూ కూడా అవంతిక (తమన్నా) పరిచయం.







భళ్లాలుడు బంధించిన దేవసేనను విడిపించడానికి 
అవంతిక బృందం పోరాటం.






శివుడు అవంతికల ప్రేమ. శివుడు దేవసేన కోసం వెళ్లడం. 
భళ్లాలుని సైన్యంతో యుద్ధం. ఆ క్రమంలో



తన జననీ జనకుల గాధను కట్టప్పద్వారా 
శివుడు వినడం. ఇదీ కథ.






సినిమాలో అసహజత్వాలకు లోటులేదు.










శివుణ్ణి చాలా బలవంతునిగా చూపించడం కోసం జలపాత హిమపాతాది 
దృశ్యాల్లొ అతి చేసి చూపారు.




దర్శకునిగా రాజమౌళి :-












మహాభారతాన్ని సినిమాగా తీయాలన్న కోరిక ఉన్నట్లు 
రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.






దాన్ని దృష్టిలో పెట్టుకొనే పంచపాండవులకు ప్రతీకగా ప్రభాస్ ని, రూపొందించారనిపిస్తుంది.





ధర్మరాజులా ప్రజల్ని ప్రేమించేలా,











భీమునిలా బలపరాక్రమాలు చూపించేవానిలా 
( బండల్ని కూలదోయడం. మనుషుల్ని ఎత్తిపడేయడం లాంటి



దృశ్యాలే ఎక్కువ సినిమాలో. నిజానికి భీముని  స్వభావమే ఎక్కువ శివునిలో.







అర్జునునిలా బాణవిద్య.












నకులునిలా గుఱ్ఱపుస్వారీ.












సహదేవుని ప్రశంస మహిష్మతీ రాజ్యం విషయంలో. 
సహదేవుడు మహిష్మతీ మీద దండయాత్ర చేస్తాడు భారతంలో.




ఇక రానాని వందమంది కౌరవులకు పెట్టు అన్నట్టుగా చిత్రీకరించారు. 
గద కూడా పెట్టారు.






పైగా ఇద్దరూ అన్నదమ్ముల బిడ్డలు కూడా.










మహాభారతంలో యుద్ధదృశ్యాలను చిత్రీకరించగలనా లేదా అని 
చూసుకోవటానికా అన్నట్లు రాజమౌళి కాలకేయునితో యుద్ధాన్ని

చిత్రీకరించినట్లు తోస్తుంది.













కృష్ణుడు కూడా అర్జునుడు కౌరవులతో యుద్ధం చేయగలడా లేదా 
అని రిహార్సల్స్ కోసం గయోపాఖ్యానాన్ని సృష్టించినట్లు 


రాజమౌళి కూడా కాలకేయోపాఖ్యానాన్ని సినిమాలో అతికించినట్లుంది.








గయోపాఖ్యానమూ ఊహే. బాహుబలీ ఊహే.










సరే భారతం సినిమాగా తీయాల్సి వస్తే బాహుబలి చూశాక 
అనిపించిదేమంటే భారతాన్ని తీయడం రాజమౌళికి మాత్రమే 


సాధ్యం అని.














అయితే మదీయ సలహా ఏంటంటే 18 పర్వాల్ని ఒకో సినిమాగా 
గంటా పదినుంచి, రెండుగంటల ఇరవైనిమిషాలలోపు



18  సినిమాలుగా కానీ లేదంటే కనీసం రెండు పర్వాల్ని కల్పి 9 సినిమాలుగా 
తీయమని. (ఇది అసాధ్యమేమో)





భావోద్వేగాలు అంటూ దర్శకుడు పదే పదే అన్నా, 
శివగామి శత్రువును చంపిన చేత్తోనే బిడ్డను లాలించడం సీన్ మినహా


ఊరించినంత భావోద్వేగ దృశ్యాలు కనిపించలేదు. (నాకు మాత్రం)









ఇక దృశ్యపరంగా












హాలీవుడ్ సినిమాల్లో కూడా ఇంత పెద్ద జలపాతం  చూపించబడలేదేమో. అత్యద్భుతం.






కొన్ని ఇంగ్లీషు సినిమాల్లో హిమపాతదృశ్యాలున్నా 
తెలుగుసినిమాల్లో మాత్రం అపూర్వం.






జలపాత హిమపాత దృశ్యాలకే డబ్బులిచ్చేయచ్చు.









మహిష్మతి కోట ఒకటి ఇంకో పరమాద్భుతం. నోళ్లు తెలియకుండానే తెరుచుకొంటాయి. "వావ్" అంటూ.




ఇవన్నీ రాజమౌళి & టీం వర్క్స్ అయినా రాజమౌళిని బట్టే కదా టీం తయారవుత.






అందరికీ హాట్సాఫ్. (నిజానికిది చిన్నపదం)









నటీనటులు :-














ప్రభాస్ రానాలు పోటీ పడ్డారు.











అందం + అభినయం రెండూ కావాలంటే మాత్రం శివగామిగా 
రమ్యకృష్ణ తప్ప మరొక ఛాయిస్ లేదు.





అనుష్క సంగతి రెండో పార్ట్ లో కానీ తెలీదు.










తమన్నా అందంగా ఉంది తప్ప బలంగా లేదు.










కట్టప్ప గా సత్యరాజ్ జీవించారు. ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్ర.








నాజర్ కు కొట్టిన పిండి.












ప్రభాకర్ నిజంగానే కాలకేయుడు. భయపెట్టాడు.









కెమెరా ఒకే మాట. అద్భుతం.











ఆర్ట్ ఇదీ ఒకే మాటలో - సినిమాకు ప్రాణం.










సంగీతం ఇంకా మనసుపెడితే బాగుండనిపిస్తుంది.









మిగతా డిపార్ట్ మెంట్స్













అందరి కష్టం కనిపిస్తుంది.
పచ్చబొట్టు పాటలో సెట్టింగ్స్ ఎంత చెప్పినా తక్కువే.












ముగింపు














సినిమాను 3 భాగాలుగా తీస్తే బాగుండుననిపిస్తుంది.









మొదటి ప్రభాస్ నాజర్ లది ఒక కథ గాను.










అమరేంద్ర బాహుబలి రానాలది ఒక కథ గాను










మహేంద్రబాహుబలి రానా కొడుకులది ఒక కథ గానూ 
దేనికదే end అయ్యేలాగ తీసి ఉంటే సరిపోయేదేమో.





సెట్టింగ్స్ అవే కాబట్టి. ఇక వేరే ఖర్చు ఉండదు. కథ నడుపుకు పోవడమే.







బాహుబలిని ధియేటర్ లోనే చూడాలి. 
బాహుబలిని ధియేటర్ లోనే చూడండి.











చూసిన వారిని ఈ సినిమా వెంటాడుతుంది.










మర్చిపోలేరు.













ప్రభాస్ అభిమానిగా బాహుబలి-2 కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తూ.........





























సతతం(రావెమ్మెస్సారెల్)




18, జనవరి 2015, ఆదివారం

soundarya lahari - 9

జగన్మాతవైభవం - 9
సౌందర్యలహరి

18







బాలసూర్యుని కాంతిపుంజాలను వెదజల్లుతున్న
నీ శరీరకాంతుల అరుణిమలో
భూమ్యాకాశాలు మునిగినట్లుగా
స్మరించినవానికి
ఊర్వశి మొదలైన అప్సరసలందఱూ వశులవుతారు

19
 


నీ మోమును బిందువుగా చేసి,
దాని క్రిందుగా కుచయుగం ఉంచి,
దాని క్రిందుగా త్రికోణం ఉంచి,
నీ మన్మథకళలను  ధ్యానించేవాడు
మరుక్షణంలోనే వనితలను కలతపెడుతున్నాడు.
అంతే కాదు
సూర్యచంద్రులు చనుగవగా కల్గిన
త్రిలోకి (మూడు లోకాలు) అనే స్త్రీనే  మోహపెడుతున్నాడు.


20

 


సర్వావయవాలనుండి అమృతాన్ని వర్షించే కిరణాలు కల
నిన్ను చంద్రకాంతమణినిర్మితప్రతిమలా భావించి,
హృదయంలో ప్రతిష్ఠించి, ధ్యానించేవాడు
గరుత్మంతునిలా సర్పాల దర్పాన్ని శమింపచేస్తున్నాడు.
తన చల్లనిచూపుచేత జ్వరపీడితుల జ్వరబాధలను తొలగించి,
సుఖాన్ని కల్గిస్తున్నాడు.

21
 


మెఱపుతీగలా సూక్ష్మమై, దీర్ఘమై,
సూర్యచంద్రాగ్నిరూపమై, క్షణప్రభయై,
షట్చక్రాలకుపైన సహస్రారంలో మహాపద్మాటవిలో కూర్చొన్న
నీ యొక్క సాదాఖ్యకళను
మహాత్ములు పరమాహ్లాదలహరిగా ధరిస్తారు.
అనగా నిరతిశయానందాన్ని సదా పొందుతున్నారు.

మంగళం మహత్

Sundarakanda సుందరకాండ 35

                                     రామసుందరం పఞ్చత్రింశస్సర్గః తాం తు రామకథాం శ్రుత్వా వైదేహీ వానరర్షభాత్‌ । ఉవాచ వచనం సాంత్వ మిద...