17, జనవరి 2015, శనివారం

జగన్మాతవైభవం - 8

సౌందర్యలహరి15
 
 శరశ్చంద్రికలా శుద్ధమైనదానివిగానూ,
శశితో కూడిన జటాజూటమే కిరీటంగా కలదానివిగానూ,
వరాభయముద్రలూ, అక్షమాలాపుస్తకాలను ధరించినదానివిగానూ
నిన్ను ధ్యానించి, ఒక్కసారి నమస్కరించినవారికి
పూదేనె, గోక్షీరం, ద్రాక్షాఫలాల మాధుర్యం నిండిన మధురవాక్కులు ప్రాప్తిస్తాయి.

16
 

పద్మాలకు ఉదయకాలపు లేతఎండలా
కవుల మనఃపద్మాలకు వికాసం కల్గించే అరుణలా భావించి,
నిన్ను భజించేవారు
వాణీప్రసాదలబ్ధశృంగారరసగంభీరవాక్కులతో
సహృదయులను రంజింపచేస్తున్నారు.


17
 

తెల్లనైన దేహం కల్గినవారు,
వాక్కులను సృష్టించేవారు అయిన
వశిన్యాదిశక్తులు సేవించే
నిన్ను ధ్యానించే వాడు
సరస్వతి ముఖపద్మపరిమళాలను వెదజల్లే
మృదువైన రుచిగల వాక్కులతో
మహాకవుల్లా కావ్యరచన చేయగల సమర్థుడవుతున్నాడు.


మంగళం మహత్

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి