13, మే 2014, మంగళవారం

జగన్మాత వైభవం-1


 సౌందర్యలహరి
 1
           

 భావం: అమ్మా! భగవతీ! శివునిలోని శక్తివి నీవు.
        నీవు లేనిదే ఆతడు కదలడానికి కూడా సమర్థుడు కాడు.
        అందుచేత శివుడే కాక హరిబ్రహ్మాదులూ నిన్ను గౌరవిస్తారు.
        అటువంటి నిన్ను మొక్కాలన్నా, పొగడాలన్నా పుణ్యం చేసుకోవాలి.

(శక్తి సహాయంతోనే శివుడు లోకాలను సృష్టించడానికి సమర్థుడవుతున్నాడు.
శక్తిలేనివాడు కదలలేనట్లే పుణ్యం లేనివాడు తల్లిని గ్రహించలేడు.)


2
 

 భావం: నీ పాదకమలంనుండి పుట్టిన పరాగరేణువును (పాదధూళికణం) గ్రహించి,                        
        బ్రహ్మ లోకాల్ని సృష్టిస్తున్నాడు. (సృష్టి)
        విష్ణువు దాన్ని(పాదరేణువు/సృష్టి) వేయిపడగలతో మోస్తున్నాడు (పాలన)
        శివుడు దాన్ని చక్కగా మెదపి, శరీరమంతా విబూదిలా (లయం=చివరికి మిగిలేది)
        పూసుకొంటున్నాడు.

(హరిహరబ్రహ్మలు తమ తమ విధుల్ని నిర్వహించుకోవడానికి తల్లి పాదధూళే ఆధారం.)
2 వ్యాఖ్యలు:

 1. Daya chesi poorthi 100slokaaloo publish cheyyandi.madhyalo aapakundaa raase sakthi Jaganmaatha meeku prasaadinchu gaka.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. తప్పకుండా.
   మీకు నా కృతజ్ఞతలు.
   తల్లిదయ ఉండాలే కానీ కానిదేముంది?
   శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తాను.

   తొలగించు